Krishna Mukunda Murari Weekly Roundup: కృష్ణకు దగ్గరైన మురారి.. నిజం చెప్పిన భవానీ.. కథలో ట్విస్ట్
తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే నవంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!
06వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:06వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి చూసి తమ దగ్గరకు రావడంతో ముకుంద అబద్దాలు చెప్పి కవర్ చేస్తుంది. దీంతో మురారికి డౌట్ వస్తుంది. అప్పుడు కృష్ణ అతడికి నచ్చిన స్వీట్ ఆర్డర్ ఇవ్వడంతో గతం కొంచెం గుర్తుకు వస్తుంది. అనంతరం మురారిని అమెరికా పంపించవద్దని భవానీ దేవికి రేవతి రిక్వెస్ట్ చేస్తుంది. కానీ, ఆమె మాత్రం కన్విన్స్ చేస్తుంది. ఇక, మురారి మాత్రం తనకు ఇంట్లో వాళ్లు ఏదో నిజం చెప్పడం లేదని సందేహిస్తాడు. చివర్లో కృష్ణ దగ్గరకు వెళ్లిన ముకుంద చాలెంజ్ చేయబోతే ఆమె రివర్స్ కౌంటర్లు వేస్తుంది.

07వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:07వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంట్లో జరుగుతున్న పరిణామాలతో మురారికి అనుమానం రావడంతో.. వెంటనే వెళ్లి భవానీ దేవిని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె కృష్ణ ఫ్యామిలీ తమకు ద్రోహం చేసిందని అబద్ధం చెప్తుంది. అనంతరం ఉదయాన్నే మురారి కృష్ణ దగ్గరకు వెళ్లగా.. కాఫీ కోసం ఆమెను ఇంట్లోకి తీసుకొస్తాడు. అంతేకాదు, కృష్ణకు స్వయంగా కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. అనంతరం ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఇక, తనను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ముకుందపై మురారి ఓ రేంజ్‌లో ఫైర్ అయిపోతాడు. తర్వాత సారీ చెబుతాడు.
08వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:08వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారి తనపై ప్రేమను చూపిస్తుండడంతో కృష్ణ సంతోషంగా ఉంటుంది. అంతేకాదు, ముకుంద అడ్డు తొలగించేలా అతడి మనసులో చోటు దక్కించుకోవాలని అనుకుంటుంది. అనంతరం ముకుంద, మురారి, కృష్ణ కలిసి షాపింగ్‌కు వెళ్తారు. అక్కడ కృష్ణ అతడికి గతం గుర్తు చేయడానికి ప్రయత్నించగా.. ముకుంద డైవర్ట్ చేస్తుంటుంది. ఇక, రేవతి వాళ్లు మాత్రం మురారికి గతం గుర్తుకు వచ్చి కృష్ణతో కలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అందుకోసం అమెరికా వెళ్లకుండా చేయాలని ప్లాన్లు చేస్తుంటారు.
09వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:09వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఔట్ హౌస్‌కు వచ్చిన మురారి.. కృష్ణ కోసమే వచ్చానని సూటిగా చెప్పేస్తాడు. దీంతో ఆమె సంతోషపడుతుంది. తర్వాత రేవతితో మురారికి గతం గుర్తొచ్చిందని, త్వరలోనే ఇద్దరం ఒక్కటి అవుతాం అంటుంది. కానీ, ముకుంద మాత్రం కృష్ణ, మురారిని ఎప్పటికీ కలకుండా చేయాలని అనుకుంటుంది. అనంతరం కృష్ణ దగ్గరకు వచ్చిన మురారి.. 'ఈ ఇంట్లోని ఎవరిని చూసిన తన వారిలా అనిపించడం లేదని, నిన్ను చూస్తేనే సొంత మనిషిలా అనిపిస్తున్నావు. అందుకే నీ దగ్గరకు వస్తున్నాను' అని చెప్పేస్తాడు.

10వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:10వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ దగ్గరకు వచ్చిన మురారి.. తాను ముకుందతో కలిసి యూఎస్ వెళ్తున్నట్లు చెప్తాడు. దీంతో కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అదే సమయంలో మురారితో కలిసి యూఎస్‌లో సెటిల్ అవుతానని ముకుంద రేవతితో చెప్పగా ఆమె సీరియస్ అవుతుంది. ఇక, కృష్ణకు మురారి చీరను గిఫ్టుగా ఇస్తాడు. ఆ విషయం ముకుందతో చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. అనంతరం కృష్ణ చీర కట్టుకుని మురారికి చూపించగా ఫ్లాట్ అవుతాడు. చివర్లో మధుకర్‌పై భవానీ దేవి సీరియస్ అవడంతో పాటు ఒక్కటి పీకుతుంది.
11వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో:11వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారిని చంపించడానికి కృష్ణ వాళ్లు ప్రయత్నించారని భావానీ దేవి అనగా.. ముకుంద ఇంకా రెచ్చగొడుతుంది. అంతలోనే కృష్ణ, మురారి అక్కడకు వస్తారు. అప్పుడు భవానీ.. కృష్ణను వెళ్లిపోయి పని చూసుకో అంటుంది. దీంతో మురారికి ఎలా దగ్గరవ్వాలని ఆమె బాధ పడుతుంది. అనంతరం అక్కడకు శకుంతల వస్తుంది. ఆ తర్వాత రేవతి కృష్ణ దగ్గరకు వెళ్లగా.. శకుంతల దెప్పిపొడుస్తుంది. ఇక, ఇంటికి వచ్చిన నందూ, గౌతమ్‌కు భవానీ దేవి మురారి గురించి నిజం చెప్తుంది. దీంతో వాళ్లంతా షాక్ అవుతారు.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే:నవంబర్ 7వ తేదీ నుంచి 11వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో కృష్ణ.. మురారికి దగ్గర అవడం.. వాళ్లను దూరం చేసేందుకు భవానీ దేవి, ముకుంద ప్రయత్నించడం చూపించారు. ఒకవైపు మురారి అమెరికా వెళ్లకుండా చేయాలని రేవతి కూడా ట్రై చేస్తుంటుంది. ఇక, ఇంటికి వచ్చిన నందూ, గౌతమ్‌లకు నిజం తెలియడంతో వాళ్లు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, వచ్చే వారంలో మురారిని ఇంప్రెస్ చేయడానికి కృష్ణ, ముకుందా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.


Click it and Unblock the Notifications











