Krishna Mukunda Murari Weekly Roundup: ఆ వ్యక్తి రాకతో బిగ్ ట్విస్ట్.. వాళ్ల మాటలను మురారి వినేశాడా?
జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఈ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!
30వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
30వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఇంటికి తిరిగి వచ్చిన కృష్ణను భవానీ దేవి అడ్డుకుంటుంది. అప్పుడామె ఎంత బ్రతిమాలినా వినకుండా బయటకు పంపుతుంది. అయినా కృష్ణ ఇంటి ముందే నిల్చుని ఉంటుంది. అనంతరం ముకుంద.. మురారికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేయడంతో అతడు ఇబ్బంది పడతాడు. దీంతో కృష్ణ వచ్చి ఇంజెక్షన్ చేయడంతో కోలుకుంటాడు. అనంతరం మురారి బాగు అయ్యే వరకూ కృష్ణ అక్కడే ఉండేందుకు భవానీ ఒప్పుకుంటుంది. కానీ, ఔట్ హౌస్‌లోనే ఉండాలని చెబుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
31వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మురారికి తన రూమ్ ఏదో తెలియక ఇబ్బంది పడుతుంటే ముకుంద వచ్చి తన రూమ్‌లోకి తీసుకు వెళ్తుంది. అప్పుడు భవానీ కూడా మురారి బాగయ్యే వరకూ చూసుకోమని చెప్తుంది. ఇక, ఔట్ హౌస్‌ను కృష్ణ శుభ్రం చేసుకుంటూ ఉండగా.. ముకుంద వచ్చి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడకు మురారి వచ్చి కృష్ణకు సహాయం చేస్తానని అంటాడు. దీంతో ఆమె ముకుందను ఇరికిస్తుంది. అప్పుడు తప్పక ముకుందనే మురారితో కలిసి రూమ్ అంతా క్లీన్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
01వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ముకుందతో మురారికి పెళ్లి చేయాలని ఈశ్వర్ డిసైడ్ అవుతాడు. ఈ విషయాన్ని భవానీ దేవికి చెప్పగా.. ఆమె ఆలోచనలో పడుతుంది. కృష్ణ చేతిలో ఓడిపోయానని బాధపడుతున్న ముకుందకు మురారి మాటలు సంతోషాన్ని ఇస్తాయి. అనంతరం కృష్ణ తన పేరును మార్చుకుని మురారికి వేరేది చెప్తుంది. ఇక, కృష్ణ ఆలోచనలోనే ఉన్న మురారి.. ఆమె దగ్గరకు వెళ్లాలని కింద పడబోతాడు. విషయం తెలుసుకున్న భవానీ మాత్రం కృష్ణను పంపించేస్తానని వార్నింగ్‌ను ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
02వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణుడి బొమ్మను చూసి మురారికి గతం గుర్తుకు వస్తుంది. కానీ, తనకు ఆ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు అన్నది మాత్రం ఎంత ప్రయత్నించినా గుర్తు రాదు. దీంతో వాంతు చేసుకుని మరీ ఇబ్బంది పడతాడు. అప్పుడు ముకుంద నీ పక్కనే ఉంటానని అంటుంది. కృష్ణకు ధైర్యం చెప్పడానికి వెళ్లిన మధుకర్.. ఆమె కాన్ఫిడెంట్ చూసి ముచ్చటపడతాడు. ఆ తర్వాత రేవతి కూడా వచ్చి కృష్ణతో మాట్లాడుతుంది. అది చూసిన భవానీ.. మురారిని యూఎస్ పంపించి వైద్యం చేయించాలని అనుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
03వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణ చేసిన బిర్యానీ తినడానికి మురారి వాళ్లు అందరూ ఔట్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ అందరూ తిన్న తర్వాత కృష్ణ ఓ గేమ్ చెప్తుంది. అప్పుడు మురారి ఆమెనే చూస్తూ ఉంటాడు. అది గమనించిన భవానీ దేవి అతడిని అమెరికాకు పంపే విషయాన్ని చెప్తుంది. దీంతో ఇక్కడ డాక్టర్ ఉండగా అక్కడికెందుకు పంపిస్తున్నారని మురారికి డౌట్ వస్తుంది. తర్వాత కృష్ణకు జ్వరం వస్తుంది. అది తెలుసుకున్న మురారి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తానని అనగా భవానీ దేవి అడ్డుకుంటుంది.
04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
04వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. కృష్ణకు జ్వరం రావడంతో మురారి తనను ఆస్పత్రికి తీసుకు వెళ్తాడు. ఇది భవానీకి తెలుస్తుందేమో అని రేవతి టెన్షన్ పడుతుంది. అనుకున్నట్లుగానే ఆమెకు విషయం తెలుస్తుంది. దీంతో మురారిని యూఎస్ పంపాలనుకున్న విషయం చెప్తుంది. తర్వాత కృష్ణ గురించి నిజాలు దాచడంతో అతడికి డౌట్లు వస్తుంటాయి. ఆస్పత్రిలోనూ మురారికి డాక్టర్ గతం గుర్తు చేస్తుంది. ఇక, ఇంటికి వస్తున్న సమయంలో ఓ రెస్టారెంట్ దగ్గర ఆగగా.. అతడికి కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అప్పుడే ఓ వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.
ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 4వ వరకు సాగిన 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో కృష్ణ.. మురారి ఇంటికి రావడం.. అక్కడ ఆమెను భవానీ దేవి అవమానించడం.. తర్వాత ఔట్ హౌస్‌లో ఉండేందుకు ఓకే చెప్పడం చూపించారు. అలాగే, అప్పుడప్పుడూ మురారికి గతం గుర్తుకు రావడం హైలైట్ చేశారు. ఇక, ఇప్పుడేమో భవానీ దేవి.. మురారిని యూఎస్‌కు పంపాలని ప్లాన్ చేస్తుంది. కృష్ణ మాత్రం అది ఫెయిల్ అయ్యేలా చేయాలని అనుకుంటుంది. దీంతో వచ్చే వారం మరింత ఆసక్తికరంగా మారనుంది.


Click it and Unblock the Notifications











