BIGG BOSS TELUGU 8 : బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రేరణకు భారీ రెమ్యునరేషన్.. రష్మిక ఫ్రెండ్‌కు ఎన్ని లక్షలంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ 1న జరిగిన కార్యక్రమంలో హోస్ట్ అక్కినేని నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారిని లోపలికి పంపారు . అయితే తొలిరోజే కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్‌కు రెమ్యునరేషన్ ఎంత.. హయ్యెస్ట్ తీసుకునేది ఎవరు , ఇలాంటి అంశాలపై ఆడియన్స్‌లో ఉత్కంఠ నెలకొంది.
బిగ్‌బాస్ తెలుగు 8 లాంచింగ్ సందర్భంగా 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. యాష్మీగౌడ, నిఖిల్, అభయ్ నవీన్, బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, విష్ణుప్రియ, ప్రేరణ కంభం, సోనియా ఆకుల, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నైనిక, ఆఫ్రిది, పృథ్వీరాజ్‌లు ఆదివారం రాత్రి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. పలకరింపులు పూర్తయ్యాక, అందరూ నైట్ డ్రెస్సులోకి మారి.. తమ సామాన్లు సర్దుకున్నారు.

ఇకపోతే.. తొలి రోజే కొందరు కంటెస్టెంట్స్ తమ గుడ్ లుక్స్, బిహేవియర్‌తో ఆకట్టుకున్నారు . వీరిలో ప్రేరణ కంభం ఒకరు. చైల్డ్ హుడ్ నుంచి మీ మూవీస్ చూస్తున్నానని, అప్పుడెలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారని మీరు నిజంగా మన్మథుడేనంటూ వచ్చి రాగానే నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించింది. తాను పొట్టిగా అయిపోతానేమో భయపడి లాంగ్ జంప్, హైజంప్, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, రగ్బీ ఆడానని చెప్పింది. హౌస్‌లో అలాగే ఆడితే మిగిలిన కంటెస్టెంట్స్ పరిస్థితి తలచుకుంటే భయంగా ఉందని కామెంట్ చేసింది.
ఇదే సమయంలో నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో రిలేషన్‌ను ఆమె బయటపెట్టింది. తాను రష్మిక చాలా క్లోజ్ అని ఆమెతో తనకు ఎన్నో మెమొరీస్ ఉన్నాయని పేర్కొంది. తనకు పెళ్లయి 8 నెలలు కాకుండానే భర్తను వదిలిపెట్టి వచ్చానని, కానీ బిగ్‌బాస్‌లో ఆఫర్ రావడం పెద్ద విషయమని ప్రేరణ చెప్పింది. హౌస్‌లో లిమిట్‌లెస్‌గా ఏం కావాలని నాగ్ అడగ్గా.. ప్రేరణ నిద్ర కావాలని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.
బిగ్‌బాస్ తెలుగు 8 హౌస్‌లో తెలుగు సీరియల్స్‌లో మాదిరే కన్నడిగులు చోటు దక్కించుకున్నారు. నిఖిల్, యాష్మీ గౌడలు కర్ణాటకకు చెందిన వారే కాగా.. ప్రేరణ కూడా అదే బ్యాక్‌గ్రౌండ్. దీంతో ఇంట్లో వీరు ముగ్గురు ఓ గ్యాంగ్‌లా తయారవుతారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మాటలతో పులిహోర కలపడంతో ప్రేరణ దిట్ట , ఇక ఆటల్లోనూ ఫస్ట్ అని చెప్పడంతో ఆమెను ఎదుర్కోవడం అంత ఈజీ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తెలుగు, కన్నడంలో వరుస సీరియల్స్‌తో పాపులరైన ప్రేరణ కంభం. ఆ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 8లో ఛాన్స్ దక్కించుకుంది. మరి ఈ సీజన్ కోసం ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని కంటెస్టెంట్స్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ను బట్టి.. ప్రేరణ వారానికి రూ.3.5 లక్షల పారితోషికం అందుకోనున్నారట. ఆమె కనుక 15 వారాలు బిగ్‌బాస్ హౌస్‌లో కంటిన్యూ అయితే రూ.52.5 లక్షలను నిర్వాహకులు ముట్టజెప్పాల్సిందే. ఈ విషయం తెలిసి నెటిజన్లు వామ్మో అనుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











