Krishna Mukunda Murari Last Episode: చివర్లో ఇద్దరు బిడ్డలతో ట్విస్ట్.. ముగిసిపోయిన కృష్ణ ముకుంద మురారి

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదికి పైగానే ప్రసారం అయిన ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తూ వచ్చింది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం అయిన చివరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మీరు నానమ్మ కాబోతున్నారు
కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడంతో పరిమళ వచ్చి చెక్ చేస్తుంది. తర్వాత 'వారసులు కావాలని అడిగారు కదా. కృష్ణ మీకు వారసులను ఇవ్వబోతుంది' అని చెప్తుంది. దీంతో భవానీ ఆనందానికి అవధులు ఉండవు. ముకుంద మాత్రం షాక్ అవుతుంది. మీరు నానమ్మ కాబోతున్నారు భవానీ గారు అని పరిమళ మళ్లీ చెప్తుంది. అప్పుడు ముకుంద 'గర్భసంచి లేకపోతే కడుపు వచ్చిందని చెప్తుంది ఏంటి' అనుకుంటుంది. అప్పుడే కృష్ణ 'గర్భసంచి తీసేశారు కదా డాక్టర్. అది మీకు కూడ తెలుసు కదా' అని అడుగుతుంది.

Krishna Mukunda Murari Serial Last Episode

వివరించి చెప్పిన పరిమళ
కృష్ణ అడగడంతో పరిమళ 'ఒక పేషెంట్‌కు నెగటివ్ రిపోర్ట్ వస్తే సేఫ్ సైడ్‌గా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం కదా. మరి నువ్వు ఎందుకు ఒక రిపోర్ట్‌ను నమ్మావు' అని ప్రశ్నిస్తుంది. దీంతో రేవతి.. కృష్ణ గర్భసంచి పోలేదా అని అడుగుతుంది. అప్పుడామె లేదని, కృష్ణ తల్లి కాబోతుందని చెబుతుంది. దీంతో కృష్ణ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు, వైదేహి చెప్పేసరికి సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని చెప్తుంది. అప్పుడు భవానీ 'ఆ వైదేహి మీరాతో కలిసి డ్రామా చేసింది దాని మాటలు ఎలా నమ్మావు' అని అంటుంది. ముకుంద జారుకుంటుంటే భవానీ ఆపుతుంది.

మీరానే ముకుంద అంటూ
తర్వాత మీరాను ఆపిన భవానీ ఎవరు నువ్వు అంటే మీరానే అంటుంది. దీంతో ఒక్కటి పీకుతుంది. అప్పుడామె 'అడిగేది నీ పేరు కాదు.. మా ఇంటి మీద పగ పట్టావు ఇంత అల్లకల్లోలం సృష్టించావు ఎవరు నువ్వు? కృష్ణ ఇది ఎవరో దీని బాగోతం ఏంటో నీకు మొత్తం తెలుసని నాకు తెలుసు' అంటుంది. అప్పుడు కృష్ణ 'నేను చెప్పడం కాదు.. అది తన నోటితో చెప్తేనే అన్నింటికీ ముగింపు దొరుకుతుంది' అంటుంది. అప్పుడు మీరా చాలా ప్రయత్నాలు చేశాను కృష్ణ కానీ ఏవి వర్కౌట్ కాలేదు. నేను మిమ్మల్ని నమ్మించలేకపోయాను అంటూ నిజం మొత్తం చెప్పేస్తుంది.

Krishna Mukunda Murari Serial Last Episode

మీరా కడుపులో బిడ్డ అదే
భవానీ.. 'మీరా కడుపులో పెరుగుతుంది మురారి వాళ్ళ బిడ్డ. కృష్ణ కడుపులో పెరుగుతుంది వాళ్ళ బిడ్డే. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు' అని తలపట్టుకుంటుంది. అప్పుడు రేవతి 'కృష్ణ తల్లి అవుతుందని ముకుంద కడుపులో ఉన్న బిడ్డను వదులుకోలేము కదా' అంటుంది. అలా ఇద్దరూ బిడ్డ కోసం ఆలోచిస్తారు. అప్పుడు మురారి గురించి చూస్తుండగా ఆదర్శ్ వచ్చి భవానీ కాళ్లు పట్టుకుంటాడు. తర్వాత కృష్ణను అపార్థం చేసుకున్నానని బాధ పడతుంటే కృష్ణ అతడిని క్షమించినట్లు చెబుతుంది. తర్వాత ముకుందను మార్చుకుంటానని ఆదర్శ్ అంటాడు.

ప్రెగ్నెంట్ అని చెప్పేసి
అందరూ కలిసి హాస్పిటల్‌లో ఉన్న మురారి దగ్గరకు వెళతారు. కొడుకును చూసి భవానీ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు మురారి 'నేను ఏ తప్పు చేయలేదు. ముకుంద నా వల్లే తల్లి కాబోతుందని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే కృష్ణకి గర్భసంచి లేదని చెప్పాలి. కృష్ణకు పిల్లలు పుట్టకపోతే ఎక్కడకు బయటకు వెళ్లగొడతారోనని భయంతో వెళ్లిపోయాను. బైక్ డ్రైవ్ చేస్తూ లారీని ఢీ కొట్టాను. కళ్ళు తెరిచే చూస్తే ముకుంద దగ్గర ఉన్నాను' అని చెప్తాడు. అప్పుడు కృష్ణ తాను ప్రెగ్నెంట్ అని అసలు నిజాన్ని మురారికి చెబుతుంది.

Krishna Mukunda Murari Serial Last Episode

ఆరు నెలలకు బిడ్డలతో
కథను ఆరు నెలలు ముందుకు తీసుకు వెళ్లారు. అప్పుడు కృష్ణకు బిడ్డ పుడుతుంది. ముకుంద మరొక బిడ్డను ఎత్తుకుని ఇంటికి వస్తుంది. అంతేకాదు 'మీ బిడ్డ ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుంది' అని చెప్తుంది. కృష్ణ బిడ్డను చూసి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ముకుంద 'ఈ బిడ్డ మీ పాప తొమ్మిది నెలలు మోస్తానని బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు మీ బిడ్డను మీకు ఇచ్చేస్తున్నాను' అని ఆమె చేతిలో పెడుతుంది. ఆ బిడ్డను చూసి కృష్ణ ఎమోషనల్ అవుతుండగా ఆదర్శ్.. ముకుంద రూపాన్నే కాదు తనను కూడా మార్చుకున్నాను అని చెబుతాడు.

ఈ బిడ్డ నీదే.. ముగింపు
ముకుంద, ఆదర్శ్ వెళ్లిపోతుంటే మురారి వాళ్లను ఆపుతాడు. 'నువ్వు మా మధ్య ఉండకూడదని కోరుకున్నామే కానీ.. కలిసి ఉండకూడదని కోరుకోలేదు. ఈ బిడ్డ మీద నాకు ఎంత హక్కు ఉందో నీకు అంతే ఉంది' అంటాడు. అప్పుడు కృష్ణ 'బిడ్డను వదులుకోవడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. పైకి సంతోషంగా కనిపించినా ఒకప్పుడు ఏసీపీ సర్ దక్కలేదని కనిపించిన బాధ మళ్ళీ ఇప్పుడు పాపని నా చేతిలో పెట్టినప్పుడు బాధ కనిపించింది. నువ్వు సర్ మీద చూపించాలనుకున్న ప్రేమ మా బిడ్డ మీద చూపించు' అని బిడ్డను ముకుందకు ఇచ్చేస్తుంది. తర్వాత ఆ ఇద్దరు బిడ్డలను భవానీ ఎత్తుకుని మురిసిపోతుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X