Krishna Mukunda Murari: మళ్లీ ఒక్కటైన ఆ ఇద్దరు.. ఇంట్లో కొత్త లవ్ ట్రాకులు.. ఇవేం ట్విస్టులు బాబోయ్!

మారుతున్న అభిరుచులకు అనుగుణంగానే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి రెడీ అయిన రేవతితో భవానీ దేవి మాట్లాడుతుంది. అంతేకాదు, ఆదర్శ్‌కు ఎవరో నూరిపోస్తున్నారని, అందుకే అలా మాట్లాడుతున్నాడని భవానీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక, మీరా వచ్చి హోళీ పండుగ చేసుకుందాం అనగా.. ఎవరైనా చనిపోతే ఏడాది వరకూ ఏమీ చేసుకోకూడదని భవానీ చెప్తుంది. కానీ, ఎలాగోలా మీరా ఆమెను ఒప్పిస్తుంది. తర్వాత రౌడీలు వచ్చి మురారిని కొట్టబోతుంటే ఆదర్శ్ వచ్చి అడ్డుకుంటాడు. అలా ఇద్దరూ కలిసి వాళ్లను కొడతారు. అనంతరం ముకుంద మీద ఆదర్శ్ తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 10th

అనుమానం ఎందుకు వచ్చింది?
తనతో ఆదర్శ్ కలివిడిగా లేకపోవడంతో కృష్ణ ఆలోచనలో పడుతుంది. కానీ, మురారి మాత్రం 'ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆదర్శ్ మారాడు' అంటాడు. దీంతో కృష్ణ నిజంగా ఆదర్శ్ మారాడా అని అడుగుతుంది. దీనికతడు అదేంటి నన్ను కౌగలించుకుంటే ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటాడు. దీంతో కృష్ణ 'మిమ్మల్ని కౌగలించుకున్నాడు.. మరి నా మీద ఎందుకు కోపంగా ఉన్నాడు' అంటుంది. అప్పుడు మురారి కొంచెం టైమ్ పడుతుందిలే అని సర్ది చెప్పేందుకు చూస్తాడు. కానీ, కృష్ణ మాత్రం ఆదర్శ్‌కు తన మీద కోపం ఉందని చెబుతుంది.

అవి మర్చిపోయి హ్యాపీగా ఉండు
తర్వాత కృష్ణ 'మీరు జైలుకు వెళ్ళినప్పుడు మీ మీద కోపంతో మిమ్మల్ని పట్టించుకోవద్దని నాతో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మీ మీద కోపం పోయి నా మీద కోపం ఉండవచ్చు కదా. ఆదర్శ్ ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావడం లేదు' అంటుంది. దీనికి మురారి 'ఇప్పుడు అనవసరంగా ఏవేవో ఆలోచించి పండగ మూడ్ పాడు చేయవద్దు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు' అని చెబుతాడు. అప్పుడు కృష్ణ 'ఆ రౌడీ మీకు గుర్తు ఉన్నాడా? ఏ కేసులో అరెస్ట్ చేశారు' అడుగుతుంది. దీంతో మురారి అతడు ఎవరో తనకు గుర్తు లేదని అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 10th

వాడు రావడం మంచే జరిగింది
రౌడీ గురించి మాట్లాడుతూ మురారి 'వాడు రావడం నన్ను కొట్టబోవడం వల్ల మంచే జరిగింది కదా. ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఉండు' అని చెప్తాడు. అందరూ హోలీ ఆడేందుకు రెడీ అయి హాల్లోకి వస్తారు. సంగీతను చూసి మధు మనసు పారేసుకుంటాడు. అటు ముకుందను చూసి ఆదర్శ్ ఫ్లాట్ అయిపోతాడు. అది గమనించిన మీరా 'ఆదర్శ్ ఏంటి తినేసేలా చూస్తున్నాడు. రూపం మార్చుకున్నా నా మీద మోజు పోయినట్టు లేదు. తొందరగా సంగీతను అంట గట్టాలి. లేదంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది' అని అనుకుంటుంది.

అల్లుడికి ఎసరు పెట్టేలా ఉంది
మీరా తీరును చూసి రజినీ తిట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు, 'నా కూతురికి సాయం చేస్తానని చెప్పి అల్లుడికి ఎసరు పెట్టేలా ఉంది' అంటూ ఆమె వైపు కోపంగా చూస్తుంది. తర్వాత కృష్ణ చున్నీ నడుముకు కట్టి హోలీ మొదలుపెడతామా అంటుంది. దీంతో మురారి 'నీ అవతారం ఏంటి? చీర కట్టుకోవచ్చు కదా' అని భార్యను ఆటపట్టిస్తాడు. దీంతో కృష్ణ మురారి మీద రంగు వేసేసి నవ్వుతుంది. తర్వాత మురారి కృష్ణకు రంగు రాయడానికి వెళ్తే పారిపోతుంది. ఇద్దరూ సంతోషంగా అటూ ఇటూ పరుగులు పెడుతూ ఆడతారు.

Krishna Mukunda Murari Serial Today Episode April 10th

ఆదర్శ్ మీద రంగు పడడంతో
కృష్ణ, మురారి ఆడుకుంటూ ఉండగా మీరా 'వీళ్లిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి. అప్పుడే నాకు నిజమైన హోలీ' అని మనసులో అనుకుంటుంది. అందరూ సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ముకుంద రంగు తీసుకుని మురారి మీద విసరాలని చూస్తే అది వెళ్లి ఆదర్శ్ మీద పడుతుంది. దీంతో అతడి మనసులో గంటలు తెగ మోగేస్తాయి. ఆదర్శ్ కూడా ముకుంద బుగ్గలకు రంగులు పూసేస్తాడు. మురారి.. కృష్ణకు రంగులు పూయడం చూసి రగిలిపోతుంది. మధు.. సంగీత దగ్గరకు వెళ్ళి రంగులు పూస్తాడు. మురారి.. కృష్ణ మీదకు రంగు విసిరితే అది వెళ్లి మీరాపై పడుతుంది.

మీరాకు థ్యాంక్స్ చెప్పేశాడు
మీరా కూడా మురారికి రంగు పూయగా.. అది కృష్ణ చూస్తుంది. తర్వాత అతడు వెళ్లిపోతుంటే మీరా ఆపుతుంది. అంతలోనే ఆదర్శ్ వచ్చి మీరా బుగ్గలపై రంగులు రాస్తాడు. అప్పుడామె ఇబ్బందిగానే ఫేస్ పెడుతుంది. అనంతరం అందరూ హోలీ ఆడుకుని కూర్చుంటారు. అప్పుడు ఆదర్శ్ 'థ్యాంక్స్ మీరా.. ఈరోజు ఈ సంతోషం అంతా నీ వల్లే. నువ్వు నా మీద రంగులు చల్లగానే నా మనసంతా హరివిల్లులాగా మారిపోయింది' అని చెప్తాడు. దీంతో మీరా 'ఖర్మ ఈ ఆదర్శ్ మళ్ళీ నాకే కనెక్ట్ అవుతున్నాడు' అని అనుకుంటుంది.

మీ వెనుక ఎందుకు తిరిగింది
కృష్ణకు మీరా మీద సందేహం వస్తుంది. అప్పుడామె మురారితో 'మీరా మంచిది కాదని అనడం లేదు కానీ.. తన ప్రవర్తన బాగోలేదు. మెచ్యూరిటీ లేక అలా ప్రవర్తిస్తుందో లేదంటే ఏంటో అర్థం కావడం లేదు. హోలీ రంగులు పట్టుకుని మీ వెనుక ఎందుకు తిరుగుతుంది' అంటుంది. దీనికి మురారి 'మీరాకు ముకుంద పేరు పెట్టగానే తన బుద్ధులు వచ్చేసి నా వెంట పడుతుందని అంటావా ఏంటి' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X