Krishna Mukunda Murari: మీరాకు కృష్ణ గిఫ్ట్.. వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని ప్లాన్.. భవానీకి చెప్పడంతో!

టెలివిజన్ ఆడియెన్స్ టేస్ట్‌కు తగ్గట్లుగానే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మురారితో ఆదర్శ్ కలిసిపోయినా తనతో కలివిడిగా లేకపోవడంతో కృష్ణకు డౌట్ వస్తుంది. కానీ, మురారి మాత్రం ఆమెను అవన్నీ పట్టించుకోవద్దని చెప్తాడు. ఆ తర్వాత రౌడీలు ఎక్కడి నుంచి వచ్చారని ఆమెకు డౌట్ వస్తుంది. అప్పుడు మురారి మాత్రం ఎలాగైనా ఆదర్శ్ తనతో కలవడం గురించే మాట్లాడతాడు. అనంతరం ఇంట్లో వాళ్లంతా హోలీ ఆడుతారు. అప్పుడు సంగీత కోసం మధు, మీరా కోసం ఆదర్శ్, మురారి కోసం మీరా తహతహలాడతారు. అనంతరం మీరా హోలీ ఆడే సమయంలో మురారి వెనకాలే తిరగడంపై కృష్ణకు అనుమానం వస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode April 11th

నీలో బాగా జెలస్ ఉంది అని:హోలీ ఆటతో మీరా ప్రవర్తన చూసిన కృష్ణ మురారితో 'హోలీ రంగు పట్టుకుని మీ వెంట పడుతుంది. మీకెలా పూస్తుంది' అని అడుగుతుంది. దీనికి మురారి 'హోలీ అన్నాక రంగులు పూస్తారు. అందులో ఏముంది' అంటాడు. దీనికామె రంగులు పూయడం వేరు రాసుకుని పూసుకుని తిరగడం వేరు అని చెప్తుంది. దీంతో మురారి 'మీరాకు ముకుంద పేరు పెట్టగానే తన బుద్దులు వచ్చేసి నా వెంట పడుతుందని అనుకుంటున్నావా' అని అంటాడు. అప్పుడామె అలా కాదు అసలు మీరా మనసులో ఏముందా అంటుంది. దీనికతడు నీకు జెలసీ ఉంది అంటాడు.

నాతో ఎందుకు మాట్లాడడు:మురారి మాటలకు కృష్ణ 'ఏమో ఆదర్శ్ మీతో మాట్లాడక అంతగా మంచిగా ఉందని అనిపించినా ఏదో తెలియని భయం వెంటాడుతుంది' అంటుంది. దీంతో మురారి 'ఆదర్శ్ మాట్లాడటం లేదని నీ భయం' అని అంటాడు. అప్పుడామె 'మీతో మాట్లాడి నాతో ఎందుకు మాట్లాడటం లేదు? ఉంటే ఇద్దరి మీద కోపం ఉండాలి లేదంటే ఇద్దరి మీద కోపం పోవాలి. ఇలా ఏంటి' అని కోపంగా మాట్లాడుతుంది. దీంతో మురారి 'సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాడులే' అంటాడు. కృష్ణ కోపం తగ్గకపోయే సరికి మురారి ఆమెకు ముద్దు పెడతాడు. వెంటనే సిగ్గుపడిపోతుంది.

మీరాపై రజిని అస్త్రాలతో:మురారితో హోలీ ఆడింది గుర్తు చేసుకుని మీరా మురిసిపోతుంది. అప్పుడు రజినీ వచ్చి 'ఊహల్లో బాగా విహరిస్తున్నట్టు ఉన్నావుగా. నా కూతురితో ఆదర్శ్ పెళ్లి చేస్తానని చెప్పి నువ్వు తనతో రాసుకుపూసుకు తిరుగుతున్నావేంటి' అని ప్రశ్నిస్తుంది. దీంతో మీరా 'తప్పుగా అర్థం చేసుకుంటున్నారు' అంటుంది. అప్పుడామె 'నీ మీద ఆదర్శ్‌కు ఏదో ఉందని అనిపిస్తుంది' అంటుంది. అప్పుడు మీరా 'మీ అనుమానం కరెక్ట్. ఇలా ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇప్పుడే ఒక పని చేద్దాం. భవానీ మేడమ్‌తో ఆదర్శ్, సంగీత పెళ్లి గురించి మాట్లాడదాం' అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode April 11th

రజినీని రెచ్చగొట్టిన మీరా:మీరా అడగడంతో రజినీ ఇప్పుడు అడిగితే భవానీ కోప్పడుతుందని అంటుంది. కానీ, మీరా మాత్రం భవానీ దగ్గరే మాట్లాడాలని చెప్తుంది. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఆమె దగ్గరకు వస్తారు. అప్పుడు రజినీ 'అంతా బాగుంది కదా. ఇప్పుడు ముకుంద చనిపోయింది. నా కూతురితో నీ కొడుక్కి పెళ్లి చెయ్' అని అడుగుతుంది. దీంతో మీరా 'ఒప్పుకోండి అత్తయ్య. నా పేరు ముకుంద అని మార్చిన దగ్గర నుంచి ఆదర్శ్ దృష్టి నామీద ఉంది. ఈ పెళ్లి జరిగిపోతే ఆదర్శ్ నా వెంట పడటం మానేస్తాడు. అప్పుడు నేను మురారి మీద ఫోకస్ పెడతాను' అని మనసులో అనుకుంటుంది.

ఆలోచిస్తానని అంటుంది:రజినీ మాటలకు మీరా కూడా సపోర్ట్ చేయడంతో భవానీ సీరియస్‌గా చూస్తుంది. దీంతో ఆమె 'ఆదర్శ్.. ముకుందను మర్చిపోవాలంటే తన జీవితంలోకి ఎవరో ఒకరు రావాలి. అది కూడా తనని బాగా ఇష్టపడే వాళ్ళు వస్తే బాగుంటుంది. ఆదర్శ్ సంతోషంగా ఉంటారని చెప్పాను తప్పయితే క్షమించండి' అని అడుగుతుంది. దీంతో రేవతి తప్పేమీ లేదు ఈ ఇంటి గురించే మాట్లాడావని అంటుంది. అప్పుడ భవానీ 'అనుకున్న వెంటనే అయిపోవాలంటే కుదరదు. నాకు చెప్పావ్ కదా నేను ఆలోచిస్తాను. ఆదర్శ్‌కు మంచి జరుగుతుందని అంటే తప్పకుండా చేస్తా' అంటుంది.

పక్కన కూర్చున్న ఆదర్శ్:ఆ తర్వాత అందరూ తినడం కోసం వస్తారు. అప్పుడు ఆదర్శ్ సంతోషంగా మురారి గురించి అడుగుతాడు. దీంతో అందరూ ఎమోషనల్ అవుతారు. అప్పుడు భవానీ 'ఇప్పుడు బాగుంది నువ్వు మురారి గురించి అడగటం చాలా బాగుంది' అంటుంది. అప్పుడే మురారి వాళ్ళు వస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర మురారి వెళ్ళి ఆదర్శ్ పక్కన కూర్చుంటాడు. ఆదర్శ్ మాత్రం కృష్ణ వైపు కోపంగా చూస్తాడు. మధు ఫోన్లో హోలీ ఫోటోస్ చాలా బాగా వచ్చాయని చెప్పి అందరికీ చూపిస్తాడు. వాటిలో మురారికి ముకుంద రంగు పూస్తున్నది చూసి కృష్ణకు కోపం వస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode April 11th

మీరా అనే పిలుస్తానంటూ:అనంతరం భవానీ 'నువ్వు చాలా తెలివైన దానివి ముకుంద. ఎవరిని ఎలా కలుపుకోవాలో, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నీకు బాగా తెలుసు. నా కోడలు ముకుందలాగా కాదు నువ్వు వేరు' అంటుంది. దీంతో మీరా మనసులో 'రెండూ నేనే అత్త రూపం మారింది అంతే నిజం తెలిసిన రోజు ఏమైపోతారో' అని మనసులో అనుకుంటుంది. తర్వాత ఆమెకు మంచి ఉద్యోగం చూస్తానని భవానీ చెప్తుంది. అనంతరం కృష్ణ ఆమెను మీరా అని పిలుస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత మీరాకు కృష్ణ ఫోన్ గిఫ్టుగా ఇస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X