Krishna Mukunda Murari: భవానీ కొత్త ప్లాన్‌తో మీరాకు షాక్.. ఎట్టకేలకు మురారి శోభనం.. అంతలోనే ట్విస్ట్

ఇండియాలో చాలా ఇండస్ట్రీలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
తండ్రి శ్రీనివాస్ ఇల్లు అమ్మేసిన విషయం చెప్పేందుకు ఫోన్ చేయడంతో ముకుంద సీరియస్ అవుతుంది. అంతేకాదు, ఇంకెప్పుడూ తనకు కాల్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. కృష్ణ.. భవానీ గతంలో రాసిన లెటర్‌ను చూసి.. ఆమె కోరిక మేరకు తల్లి కావాలని డిసైడ్ అవుతుంది. దీంతో శోభనానికి ముహూర్తం పెట్టించమని అత్తగారికి చెప్తుంది. కానీ, ఇదంతా గమనించిన ముకుంద వాళ్ల శోభనం జరగనివ్వనని అంటుంది. అంతేకాదు, ఆ లెటర్‌ను చించేస్తుంది. అది చూసి ఆదర్శ్ ప్రశ్నించడంతో అతడికి లేనిపోనివి అన్నీ చెప్తుంది. దీంతో కృష్ణపై ఆదర్శ్‌కు కోపం పెరుగుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode April 13th

మా స్వార్థం ఆలోచించామా

కృష్ణకు చుడీదార్ బాగోదని మురారి అంటాడు. దీంతో అతడిని కొడతానని గరిటె పట్టుకుని వెనకాల పరిగెడుతుంది. అలా ఇద్దరూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అది ముకుంద, ఆదర్శ్ చూసి కోపం రగిలిపోతుంటారు. అప్పుడే వాళ్ళను ఆపి ఇద్దరినీ పక్క పక్కన నిలబడమని చెప్తుంది. అంతేకాదు, తను చెప్పింది పాటించాలని, అలా అని మాట ఇవ్వమని అడుగుతుంది. దీంతో కృష్ణ 'అలా అంటారు ఏంటి? ఎప్పుడైనా మా స్వార్థం గురించి ఆలోచించామా' అంటుంది. దీనికి భవానీ 'అదే నా బాధ కూడా. ఇప్పటికైనా నీ గురించి ఆలోచించు' అంటుంది.

భవానీ ఇలా.. మీరా మరోలా
ఆ తర్వాత భవానీ 'ఏ స్వార్థం లేకుండా పిచ్చిదానిలా అందరి గురించి ఆలోచిస్తావ్. ఇప్పుడైనా నీ గురించి కొంచెం ఆలోచించుకుని ఉంటే ఈ పాటికి మీ అత్తయ్యను ఎప్పుడో నానమ్మను చేసి ఉండేదానివి' అంటుంది. అప్పుడు మీరా 'మళ్ళీ వీళ్ళ శోభనం గురించి ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచించాలి' అనుకుంటుంది. అప్పుడు రేవతి 'ఇంతకు ముందు ముకుంద, ఆదర్శ్ గురించి శోభనం వద్దని చెప్పింది. తర్వాత ముహూర్తం పెట్టినా ఏదో ఒక ఆటంకం వచ్చింది. ఈసారి ఏ ఆటంకం లేదు పైగా కృష్ణ అడిగింది కాబట్టి సమస్య రాదు' అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 13th

ముహూర్తం వద్దన్న భవానీ

పంతులుతో ముహూర్తం పెట్టిద్దామని రేవతి అనడంతో భవానీ అవసరం లేదు అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడామె 'ఈ ముహూర్తాలు ఏవి వద్దు. అది పెట్టిన ప్రతిసారి ఏదో ఒక సమస్య. అందుకే ఈ సారి అవేమీ లేవు. ఎప్పుడో భార్యాభర్తలైన మీరు ఈరోజు నుంచి నిజమైన భార్యాభర్తలుగా మెలగండి' అని చెప్తుంది. కృష్ణ, మురారి చూసుకుని సిగ్గుపడతారు. అప్పుడు మీరా 'ఇదేంటి ఈవిడ ఇంత పెద్ద షాక్ ఇచ్చింది. శోభనం ముహూర్తం పెడితే చెడగొట్టాలని అనుకుంటే ఇలా అన్నది. ప్రతి రాత్రి వీళ్ళకు నేనెక్కడ కాపలా ఉండేది' అని టెన్షన్ పడుతుంది.

ఇంకో మనవడూ వస్తాడని
రజినీ 'తొమ్మిది నెలలు తిరిగే లోగా నీ చేతికి మనవడో మనవరాలో ఇచ్చేస్తుంది. అలాగే ఇంకొక మనవడు కూడా వస్తాడు' అనడంతో అందరూ అయోమయంగా చూస్తారు. అప్పుడు కృష్ణ 'దేని గురించి' అనగా.. 'ఇన్నాళ్ళూ పక్కన వాళ్ళ గురించి ఆలోచించింది చాలు.. ఇప్పటికైనా నీ గురించి ఆలోచించుకో' అని భవానీ చెప్తుంది. దీంతో మురారి 'ఇంతకాలానికి పెద్దమ్మ అర్థం చేసుకుని చెప్పాల్సిన మాట చెప్పింది' అనుకుంటాడు. అప్పుడే ముకుంద వచ్చి ఇప్పుడు మీరు హ్యాపీ కదా అంటూ బలవంతంగా మురారి చేతిని తీసుకుని అలా పట్టుకుని ఉంటుంది.

మీ స్టోరీ మొత్తం తెలుసు

ఆ తర్వాత మీరా 'ముకుంద ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉండేది. మీ స్టోరీ మొత్తం నాకు తెలుసు. నేను కాస్త డిసప్పాయింట్ అయ్యాను శోభనానికి ముహూర్తాలు పెడతారు ఏమో కృష్ణకు చెల్లెలిలాగా ఏర్పాట్లు చేద్దామని అనుకున్నాను. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది' అంటుంది. కృష్ణ అటుగా వచ్చి వాళ్ళను చూస్తుంది. ఆమె వచ్చేసరికి ముకుంద వెళ్ళిపోతుంది. మీరా ఏం మాట్లాడుతుంది చేయి పట్టుకుని వదలకుండా ఉంది అని అడుగుతుంది. కంగ్రాట్స్ చెప్పింది శోభనానికి ముహూర్తాలు లేవని పెద్దమ్మ లైన్ క్లియర్ చేసింది కదా అందుకే అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 13th

కృష్ణ డౌట్.. మీరా ఫైర్
మురారి చెప్పిన మాటకు కృష్ణ 'కంగ్రాట్స్ మీకు చెప్పడం ఏంటి? నాకు కదా చెప్పాల్సింది' అని డౌట్ పడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ శోభనం మూడ్‌లోకి వెళ్లిపోయి మాట్లాడుకుంటారు. ఇక, ముకుంద మాత్రం భవానీ మాటలు గుర్తు చేసుకుంటూ.. 'ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఏంటి? మోడ్రన్ అత్తలాగా ముహూర్తాలు లేకుండా రాత్రి పగలు అని చూడొద్దని అల్టిమేటం ఇచ్చింది' అని తిట్టుకుంటుంది. తర్వాత మీరా రజినికి ఫోన్ చేసి పిలుస్తుంది. సంగీత కూడా వస్తే తనని బయటకు వెళ్ళమని పంపించేస్తుంది. తర్వాత రజినీపై సీరియస్ కూడా అవుతుంది.

రజినీతో కలిసి ప్లాన్ చేసి

గౌరవం లేకుండా మాట్లాడడంతో రజినీకి కోపం వస్తుంది. అప్పుడు మీరా అంతా మీ కూతురు పెళ్లి కోసమేనని కవర్ చేస్తుంది. అనంతరం కృష్ణ, మురారి ఒక్కటి కాకుండా ముకుంద రజినికి ఏదో ప్లాన్ చెప్తుంది. మరోవైపు, కృష్ణ అందంగా రెడీ అయి గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వస్తుంది. భార్య అందాన్ని చూసి మురిసిపోతాడు. కాసేపు మురారిని ఆటపట్టిస్తుంది. తర్వాత మురారి హనీమూన్‌కు వెళ్దామని అడుగుతాడు. కానీ, కృష్ణ వద్దంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X