Krishna Mukunda Murari: ఆదర్శ్‌ను లైన్‌లో పెట్టిన మీరా.. చెంప పగలగొట్టిన భవానీ.. నేటి ఎపిసోడ్ అదుర్స్

ఈ మధ్య కాలంలో కొత్త కంటెంట్‌తో వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:ముకుంద ఫొటోను తీసేయమని మీరా అడగడంతో భవానీ.. ఆదర్శ్ చేత్తోనే దాన్ని తీయిస్తుంది. ఆ తర్వాత కృష్ణకు ఆమెపై డౌట్ వస్తుంది. దీంతో మురారి ఆమెకు సర్ధి చెబుతాడు. తర్వాత మురారి షర్ట్ కనిపించకపోవడంతో కృష్ణ వాళ్లు వెతుకుతుంటారు. కానీ అప్పుడు ముకుంద దానిలో మురారిని ఊహించుకుని మాట్లాడుతుంటుంది. తర్వాత మీరా తన తండ్రి శ్రీనివాస్‌ను కలుస్తుంది. ఆయన మాత్రం మురారిని చంపితేనే మంచిది అనుకుంటాడు. ఇక, మురారి, కృష్ణ తమకు తరచూ ఏదో ఒక ఇబ్బంది వస్తుండడంతో బాధపడుతుంటారు.

Krishna Mukunda Murari Serial Today Episode April 1st

నాకు విలువ ఇవ్వడం లేదు:భోజనం దగ్గర కూర్చుకున్న ఆదర్శ్ కోపంలో గట్టిగా అరుస్తాడు. దీంతో అందరూ అక్కడకు చేరుకుంటారు. అప్పుడు భవానీ దేవి ఏమైందని అతడిని ప్రశ్నిస్తుంది. దీనికి ఆదర్శ్ 'వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు. నేను నీ కొడుకును కాదు కదా. వీళ్లందరికీ లోకువ అయిపోయాను. నన్ను పరాయివాడిలా చూస్తున్నారు' అని చెప్తాడు. దీనికామె నిన్ను ఇప్పుడు ఎవరు తక్కువ చేశారని అడగ్గా.. 'అందరూ.. నాకు అన్యాయం చేసిన వాళ్ళకు ఉన్న విలువ కూడా నాకు లేదు. చివరికి దారిన పోయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి ఇచ్చే విలువ కూడా ఇవ్వట్లేదు' అంటాడు.

వాడికి ఒక లక్ష్యం ఉందని:ఆదర్శ్ మాటలతో రేవతి ఏమందని అడగ్గా.. మధు ఇంట్లో పెద్ద పెద్దమ్మ ఉంది రూమ్‌లో తాగు బయటకి వెళ్లకని చెప్పా అంటాడు. దీంతో ఆదర్శ్ 'దేనికి పనికిరాని వీడు కూడా నేను ఏం చేయాలో నీతులు చెప్తున్నాడు' అంటుంది. దీంతో రేవతి 'అందులో తప్పు ఏముంది? మురారి ఏ తప్పు చేయలేదని లోకం మొత్తం తెలిసినా వీడు నమ్మలేదు. పోలీసులు ప్రాణాలు తీసేస్తారని చెప్పినా లెక్కలేదు. మధు అంటే అసలే లెక్కలేదు. మధు ఎందుకు పనికిరాకపోవచ్చు కానీ వాడికి ఒక లక్ష్యం ఉంది. దానికోసం నిరంతరం కష్టపడుతున్నాడు' అని క్లాస్ పీకుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode April 1st

ఆదర్శ్‌ను నిలదీయడంతో:ఆ తర్వాత మురారి 'నేను తప్పు చేశానని వాడు నమ్ముతున్నాడు. అందుకని నేను ఒప్పుకోవాలా? ఒప్పుకోకపోతే వాడిని పరాయివాడిలాగా చూసినట్టా' అని అంటాడు. అప్పుడు కృష్ణ 'ఆదర్శ్ ఏమైపోతాడోనని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నాం. పోనీ సొంత మనిషి అనుకోవాలంటే ఏం చేయాలో చెప్పు' అని కృష్ణ బాధగా అడుగుతుంది. దీంతో భవానీ 'చెప్పు ఇంట్లో అందరినీ అంటున్నావ్ అంటే నన్ను కూడా కలిపి అన్నట్టే కదా చెప్పు ఇంకా ఏం చేస్తే సొంత వాడిలా ఫీల్ అవుతావు' అని నిలదీస్తుంది. ఇలా అందరూ ఆదర్శ్‌ను సూటిగా ప్రశ్నిస్తారు.

ఇల్లు మొత్తం రాసేయని:అందరూ అడగడంతో ఆదర్శ్ 'ఈ ఇల్లు, ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేయ్. అప్పుడు ఈ ఇల్లు నా సొంతం అవుతుంది. అప్పుడు నేనే డిసైడ్ చేస్తాను ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో' అనడంతో భవానీ అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. అంతేకాదు, 'చంపేస్తాను పిచ్చి పిచ్చిగా వాగావంటే.. ఎవరిని వేరుగా చూశాను? ఈ ఇంట్లో అందరూ నాకు ప్రాణం. ఏ ఒక్కరినీ వదులుకోవాల్సి వచ్చినా నా ప్రాణం పోయినట్టే. చెప్పు నా ప్రాణం తీసేస్తావా' అని నిలదీస్తుంది. అప్పుడు మీరా.. ఆదర్శ్‌ను తనవైపు తిప్పుకోడానికి సరైన సమయం అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode April 1st

ఆదర్శ్‌ను కాకా పట్టాలని:ఆదర్శ్‌ను తీసుకుని మీరా లోపలికి వెళ్తుంది. అప్పుడు అతడికి మందు పోస్తుంది. ఆ సమయంలో ఆదర్శ్ తన బాధను ఆమెకు చెప్తాడు. దీంతో మీరా 'మీరంటే ప్రేమించే వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు' అంటుంది. దీనికతడు 'ఎవరు ఉన్నారు? నేను ఎంతో ఇష్టపడిన ముకుంద కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది' అంటాడు. అప్పుడామె 'ఇంకా నా గురించే ఆలోచిస్తున్నాడు. నేను అదే దారిలో వెళ్ళి తనని దారిలోకి తెచ్చుకోవాలి' అనుకుంటుంది. తర్వాత ముకుంద మీ గురించి ఆలోచించింది. మీరంటే తనకు చాలా అభిమానం అంటూ అబద్దాలు చెప్తుంది.

నాతో పంచుకోండంటూ:ఆ తర్వాత మీరా 'నేను నా జీవితంలోకి ఆదర్శ్‌ను ఎందుకు ఆహ్వానించకూడది' అని అడిగింది. మంచి నిర్ణయం ఆలోచించచడం ఎందుకని అలాగే చేయమని చెప్పానని చెప్తుంది. దీంతో ఆదర్శ్ 'కానీ శోభనం గదిలో ఏం జరిగిందో తెలుసా' అంటాడు. అప్పుడామె 'తెలుసు మనసు మార్చుకుని ఇద్దరూ సంతోషంగా ఉంటారని అనుకున్నాను కానీ ఇలా చేస్తుందనిఅనుకోలేదు. తన మనసు ఎవరో మార్చేశారు. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఖచ్చితంగా ఎవరో తన మనసు విరిచేశారు. లేదంటే ముకుంద అలాంటి మనిషి కాదు' అంటూ ఏదేదో చెబుతుంది.

సర్ధి చెప్పి.. భవానీ భయం:తన దగ్గరకు వచ్చిన మురారిపై ఆదర్శ్ కోప్పడతాడు. దీంతో మీరా 'మన మీద కోపం ఉన్నప్పుడు సర్ది చెప్పాలని చూస్తే కోపం పెరుగుతుంది. సమయం చూసి తనకి నేనే సర్ది చెప్తాను. అప్పటి వరకు ఓపికగా ఉండండి' అని చెప్తుంది. మరోవైపు భవానీ.. ఆదర్శ్ మాటలను గుర్తు చేసుకుంటుంది. అప్పుడే కృష్ణ రావడంతో 'కుటుంబం అంతా కలిసి ఉండాలని నేను పాకులాడుతుంటే ముక్కలు చేయాలని వాడు అనుకుంటున్నాడు' అంటుంది. దీంతో కృష్ణ సర్ది చెబుతుంది. తర్వాత తన బాధను కూడా ఆమెకు చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X