Krishna Mukunda Murari: ఆదర్శ్ జోడీ సంగీత ఎంట్రీ.. భవానీ, కృష్ణకు షాక్.. వాళ్లతో మీరా కొత్త ప్లాన్
దేశ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో కొత్త కంటెంట్‌తో కార్యక్రమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ఇంట్లో వాళ్లందరూ ఆదర్శ్‌కు వ్యతిరేకంగా మాట్లాడతారు. దీంతో అతడు సీరియస్ అవడంతో భవానీ కూడా నిలదీస్తుంది. అప్పుడతను ఇంటిని తన పేరిట రాసివ్వమని, అప్పుడు ఇంట్లో ఎవరు ఉండాలో.. ఎవరు వెళ్లిపోవాలో డిసైడ్ చేస్తానని అంటాడు. దీంతో భవానీ అతడిని కొడుతుంది. అప్పుడు మీరా.. ఆదర్శ్‌ను తీసుకుని గదిలోకి వెళ్లి మందు తాగిపిస్తూ తనవైపు తిప్పుకోవాలని చూస్తుంది. తర్వాత మురారి వస్తే అతడిని కూడా బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక, ఆదర్శ్ ప్రవర్తనపై భవానీ బాధపడుతుండగా.. కృష్ణ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది.

అత్తను క్షమాపణ కోరిన కృష్ణ
భవానీతో మాట్లాడుతున్న కృష్ణ 'మీరు ఇచ్చిన బాధ్యత నెరవేర్చలేకపోయాను క్షమించండి' అంటుంది. దీనికామె 'ఇందులో నీ తప్పేముంది? మనిషిని అయితే మార్చగలం కానీ బండరాయిని మార్చలేం కదా. ముకుంద ఒక బండ రాయి. మురారి దక్కడని తెలిసినా కూడా తనకోసమే ఎదురు చూసింది. తనని నువ్వు గుడ్డిగా నమ్మేశావు. ఇకనైనా నీ గురించి నువ్వు ఆలోచించుకో ఇతరుల గురించి ఆలోచించొద్దు' అని సలహా ఇస్తుంది. అప్పుడే భవాని అనే పిలుపు వినిపిస్తుంది. అలా భవానీ ఆడబిడ్డ, ఆమె కూతురు ఇంటికి (సీరియల్‌లోకి) వస్తారు.
ఆదర్శ్ మీద కన్నేసిన అత్త
భవానీ ఆడబిడ్డ రజినీ రావడం రావడమే తన నోటికి పని చెబుతుంది. 'ముకుంద చనిపోయింది అంట కదా అది తెలిసే వచ్చాం. అసలు నా కూతుర్నే కోడలుగా చేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అప్పుడు అడిగితే వద్దని అన్నావ్ ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. నీ కొడుక్కి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయ్' అని అడుగుతుంది. దీనికామె 'ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు' అని చెప్తుంది. దీంతో రజినీ 'ఏం తెలుసు భవానీ నీకు? అందుకే ఇంటి పరిస్థితి ఇలా అయింది. ఆదర్శ్ తాగుబోతు అయ్యాడు' అని అవమానిస్తుంది.
బాగా సీరియస్ అయిన కృష్ణ
రజినీ తరచూ భవానీ భవానీ అని పిలుస్తుండడంతో కృష్ణ 'పెద్దత్తయ్యను ఇంకోసారి పేరు పెట్టి పిలవ్వద్దు. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి' అని సీరియస్ అవుతుంది. దీనికామె 'అసలు నువ్వు ఎవతివే నాకు చెప్పడానికి? మా వదినను ఎలా పిలవాలో నాకు తెలుసు' అంటూ కౌంటర్ ఇస్తుంది. అప్పుడే భవానీ కూడా కృష్ణని అపుతుంది. దీంతో ఆమె 'మిమ్మల్ని అలా ఏకవచనంతో పిలవడం నాకు నచ్చలేదు. మా పెద్దత్తయ్యను పేరు పెట్టి పిలిచే ధైర్యం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు' అంటుంది. దీంతో రజినీ పంచ్ వేయడంతో వెళ్లిపోతుంది.
వాళ్ల రాకతో ముకుంద ప్లాన్
ఆ తర్వాత రజినీ తన కూతురితో 'ఆదర్శ్ బావ తాగి ఉన్నాడు తిన్నాడో లేదో వెళ్లి కనుక్కుని.. వంట చేసి పెట్టు' అని చెప్తుంది. అప్పుడు మీరా 'రావడంతోనే కృష్ణతో గొడవ పెట్టుకున్నారు. మనకు పనికొచ్చేలాగే ఉన్నారు. వీళ్లను అడ్డం పెట్టుకుని చక్రం తిప్పుదాము. కుదరకపోతే ఇంట్లో నుంచి బయటకి పంపించేయాలి' అని మనసులో అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్ గదిలో ముకుంద గురించే ఆలోచిస్తూ 'నా మీద ఉన్న అభిమానాన్ని నువ్వు ప్రేమగా మార్చుకున్నట్లయితే మనం సంతోషంగా కలిసి ఉండే వాళ్ళం. నిన్ను మర్చిపోలేక పోతున్నాను' అనుకుంటాడు.
సంగీతకు షాక్ ఇచ్చేశాడు
ఆదర్శ్ గదిలోకి వెళ్లిన సంగీత 'ముకుంద కోసం అంతగా బాధపడతావ్ ఏంటి? నువ్వు ఏమైనా తనతో కలిసి ఉన్నావా? పెళ్లి చేసుకోగానే నువ్వు వదిలేసి పోయావు. నువ్వు వచ్చాక తను వదిలేసి పోయింది. కాకపోతే ఒకటే తేడా నువ్వు తిరిగి వచ్చావు ముకుంద తిరిగి రాలేదు' అని అనడంతో అతడు సీరియస్ అవుతాడు. అంతేకాదు, 'ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి కూడా పంపించేస్తాను' అని తిట్టి బయటికి పంపించేస్తాడు. దీనికామె ఈరోజు కాకపోతే రేపైనా నిన్ను బుట్టలో వేసుకుంటానని వెళ్ళిపోతుంది.
మురారికి చెప్పేసిన కృష్ణ
మురారి నిద్ర లేవగానే కృష్ణ వచ్చి 'ఆవిడకు ఎంత ధైర్యం ఉంటే పెద్దత్తయ్యను పేరు పెట్టి పిలుస్తుంది. అలా పిలవడం నాకు అసలు నచ్చలేదు. ఇంకోసారి అత్తయ్యను ఎవరైనా అవమానిస్తే సహించేదే లేదు' అని కోప్పడుతుంది. దీంతో మురారి 'పక్కన వాళ్ళ గురించి ఆలోచించద్దని పెద్దమ్మ చెప్పింది కదా. నీకు నీ సంగతి నువ్వు చూసుకో' అంటాడు. దీంతో కృష్ణ 'పెద్దత్తయ్యను ఎవరేమైనా అంటే ఊరుకునేది లేదు' అంటుంది. దీంతో మురారి 'రజిని అత్తయ్య కంచు. ఆ కంచును వంచే రకం కృష్ణ ఇంట్లో ఏం జరగబోతుందో' అని అనుకుంటాడు.
కృష్ణను పనిమనిషి అని
తర్వాత కృష్ణ వస్తుంటే సంగీత కాఫీ కావాలని రజినీతో అంటుంది. అప్పుడామె 'మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అదిగో వస్తుందిగా పనిమనిషి తనే పెట్టిస్తుందిలే. ఇంటికి వచ్చిన వాళ్ళను పట్టించుకునేది లేదా' అని తిడుతుంది. దీనికి కృష్ణ 'మీరే కదా అన్నారు రాత్రి మేము ఇంట్లో వాళ్ళం.. పరాయి వాళ్ళం కాదు అని. ఇంట్లో వాళ్ళకు మర్యాదలు చేయరు. చుట్టాలకైతే మర్యాదలు చేస్తారు' అంటుంది. దీంతో రజినీ 'మేం చుట్టాలమే కదా' అని రజిని నోరు జారుతుంది. తర్వాత కృష్ణ కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











