Krishna Mukunda Murari: భవానీకి తెలిసిన నిజం.. ప్లాన్ అమలు చేసిన డాక్టర్.. రంజుగా నేటి ఎపిసోడ్‌

చాలా కాలంగానే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మురారి, కృష్ణ తల్లిదండ్రులు కాలేకపోతున్న బాధలో ఉంటే.. ముకుంద మాత్రం డాక్టర్ వైదేహి దగ్గర సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, సరోగసి ద్వారా మురారి బిడ్డకు తానే తల్లిని కావాలని ఆమెకు చెప్తుంది. ఆ తర్వాత బాధలో ఉన్న కృష్ణను మురారి ఓదార్చుతాడు. ఆ సమయంలో కృష్ణ సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిద్దామని, అందుకోసం మంచి అమ్మాయిని చూద్దామని అంటుంది. దీనికి మురారి కూడా ఓకే చెప్తాడు. అది విన్న ముకుంద ఎంతో సంతోషిస్తుంది. ఆ తర్వాత వాళ్లు డాక్టర్ దగ్గరకు వెళ్లగా.. వైదేహిని సంప్రదించమని సలహా ఇస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode April 30th

బిడ్డ లేకపోవడం కంటే బెటర్:కృష్ణ బాధపడుతుండగా మురారి 'నువ్వు తొమ్మిది నెలలు మోయకపోయినా తల్లివి కాగలవు. అన్ని మర్చిపోయి ఈ అవకాశాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం' అని చెప్తాడు. అప్పుడామె ఈ విషయం పెద్దత్తయ్యకు తెలిస్తే అనగా.. 'తెలుస్తుంది.. బిడ్డలు లేకుండా పోవడం కంటే ఇది బెటర్ కదా. సరోగసి సక్సెస్ అయిన తర్వాత ఇంట్లో చెబుదాము' అంటాడు. మరోవైపు, కృష్ణ ఎక్కడని భవానీ అడగ్గా.. హాస్పిటల్‌కు వెళ్ళిందని రేవతి చెప్తుంది. దీంతో భవానీ 'కృష్ణ కంగారు చూస్తుంటే తను నెల తప్పినట్టు ఉంది' అంటుంది. వెంటనే హాస్పిటల్‌కు కాల్ చేస్తుంది.

ఫుల్ హ్యాపీగానే భవానీ, రేవతి:హాస్పటల్‌కు కాల్ చేయగా కృష్ణ వాళ్లు ప్రెగ్నెన్సీ గురించి కనుక్కోవడానికి వచ్చారని, గైనకాలజిస్ట్‌ను కలిశారని చెప్తారు. దీంతో కృష్ణ నెల తప్పిందని భవానీ, రేవతి సంతోషపడతారు. అంతేకాదు, వాళ్ళకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని భవానీ అంటుంది. రేవతి మాత్రం కృష్ణ నెల తప్పితే చెప్పకుండా ఎందుకు ఉంటుందని డౌట్ పడుతుంది. కానీ, భవానీ మాత్రం 'హాస్పిటల్ వాళ్ళు చెప్పారు కదా నా కోడలు తల్లి కాబోతుంది' అని హ్యాపీగా అంటుంది. తర్వాత భవానీ గతంలో తన కోడలు విషయంలో అవమానించిన వాళ్లకు సరైన బుద్ది చెప్పాలని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode April 30th

సీక్రెట్‌గా ఉంచుతామంటూ:వైదేహి దగ్గరకు వచ్చిన కృష్ణ, మురారి సరోగసి గురించి మాట్లాడతారు. అప్పుడామె 'సరోగసి మథర్ దొరకడానికి రెండు నెలలు టైమ్ పడుతుంది' అని చెప్తుంది. కానీ, కృష్ణ మాత్రం తమకు అంత టైమ్ లేదని త్వరగా చూడమని చెప్తుంది. దీనికామె 'సరోగసి అంటే ఆషామాషీ కాదు. గతంలో మీలాగే ఒక జంట వచ్చింది. వాళ్ళ కోసం ఒక మథర్‌కు చూశాం. ఆమెను మీకు ఇస్తాం' అని వైదేహి చెప్తుంది. అప్పుడు కృష్ణ ఆత్రంగా వెంటనే చెప్పేయండి సంతకాలు పెట్టేస్తానని అంటుంది. కానీ, వైదేహి మాత్రం ఆమె ఎవరో, ఎలా ఉంటుందో సీక్రెట్‌గా ఉంచుతామని అంటుంది.

ఒక్కసారి చూపించమంటూ:వైదేహి మాటలకు కృష్ణ 'సరే మేము ఆవిడను కలవము కానీ.. తనను ఒకసారి చూపించండి' అని అడుగుతుంది. దీనికామె 'ముందు వాళ్లను ఒప్పించనివ్వండి. తర్వాత ఆలోచిద్దాం' అని సర్ది చెప్తుంది. ఆ సమయంలోనే కృష్ణ వాళ్ళు రావడం ముకుంద చూస్తుంది. అప్పుడు 'తొమ్మిది నెలలు బిడ్డని మోసే ఆవిడ నా పక్కన ఉంటే నా బిడ్డ నా పక్కన ఉంటుంది కదా. నా బిడ్డను మోయలేకపోతున్నాననే బాధ కొంచెమైన తగ్గుతుంది' అంటుంది. అప్పుడు మురారి 'ఆవిడ ఎవరో తెలిస్తే నీ పక్కన ఉండేలా చూసుకుంటాను' అని ఆమెకు మాట ఇస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 30th

నిజం తెలిస్తే అంతే అని:తర్వాత వైదేహిని ముకుంద కలుస్తుంది. అప్పుడామె 'సరోగసి మథర్ ఎవరో చూపించమని కృష్ణ క్యూరియాసిటిగా అడిగింది' అని చెప్తుంది. దీంతో ముకుంద 'అది అలాగే ఉండనివ్వు కానీ.. కృష్ణకు నిజం తెలిసిన రోజు తన గుండె పగిలిపోవడం ఖాయం' అని ఆనందపడుతుంది. మరోవైపు భవానీ ఇంట్లో సర్‌ప్రైజ్ పార్టీ ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు ఆదర్శ్ ఇంట్లో ఏంటి హడావుడి అని మధును అడుగుతాడు. దీనికతడు కృష్ణ నెల తప్పింది పెద్ద పెద్దమ్మ పార్టీ ఇస్తుంది అని సంతోషంగా చెప్తాడు. ఆదర్శ్ ఫేస్ మాడిపోతుంది.

ఆదర్శ్‌ను వదిలేశారంటూ:పార్టీకి వచ్చిన భవానీ ఫ్రెండ్స్ ఆదర్శ్‌ను చూసి 'మీ అమ్మ నిన్ను ఇలాగే వదిలేస్తుందా? మళ్ళీ పెళ్లి చేస్తుందా' అని నోటికి పని చెబుతాడు. అప్పుడు భవానీ ఫ్రెండ్స్ సుచరిత వాళ్ళ మాటలు విని ఆదర్శ్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. మరోవైపు కృష్ణ సరోగసి మథర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆవిడ ఎవరో ఏంటోనని అంటుంది. కృష్ణ వాళ్ళు రోడ్డు మీద మామిడి కాయలు కనిపిస్తే వాటి దగ్గర ఆగుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X