Krishna Mukunda Murari: సంగీతకు మీరా హెల్ప్.. ఆమెకు లైన్ వేస్తున్న మధు.. కృష్ణ కీలక నిర్ణయం

చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చనందుకు భవానీకి కృష్ణ సారీ చెప్తుంది. అప్పుడే భవానీ ఆడబిడ్డ రజినీ, ఆమె కూతురు సంగీత వస్తారు. ఆమె ముకుంద చనిపోవడం గురించి, ఆదర్శ్ తాగుబోతు అవడం గురించి అవమానించేలా మాట్లాడుతుంది. దీంతో కృష్ణకు కోపం వచ్చి అరవగా.. రజినీ కౌంటర్ ఇస్తుంది. వాళ్లను చూసి ముకుంద తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. రజినీ తన కూతురు సంగీతను ఆదర్శ్‌కు దగ్గర చేయాలని భావిస్తుంది. అందుకు అతడి దగ్గరకు పంపించగా.. సంగీతపై సీరియస్ అయి పంపించేస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 3rd

నా కూతురే పెళ్లాం అవుతుంది
రజినీ ఓవర్‌గా మాట్లాడితే ఆమెకు కృష్ణ కౌంటర్లు వేస్తుంది. దీంతో సంగీతను వెళ్లి ఆదర్శ్‌ను మంచి చేసుకోమని చెప్తుంది. అది విన్న ముకుంద 'ఆదర్శ్ ఈ సంగీతకు కనెక్ట్ అయితే.. రేపు నేను ముకుంద అని తెలిసినా నాకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది' అని మనసులో అనుకుంటుంది. అప్పుడే రజినీ 'నా కూతురు ఆదర్శ్ మరదలు. పెళ్లాం కావాల్సింది కాలేదు. ఇప్పుడు అతడి పెళ్లాం పోయింది. నా కూతురు పెళ్లాం అవుతుంది' అని అంటుంది. దీంతో మీరా 'నేను అసలు ఆపాలని అనుకోవడం లేదు మీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా' అంటుంది.

దగ్గరైతే హ్యాపీనే కదా అంటూ
మీరా మాటలకు షాకైన రజినీ 'మాకు హెల్ప్ చేస్తే నీకు ఏం వస్తుంది' అని అడుగుతుంది. దీనికామె 'ఆదర్శ్ భార్యను పోగొట్టుకుని బాధలో ఉన్నాడు. మీ సంగీతకు దగ్గర అయితే అంతా హ్యాపీనే కదా. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి చేస్తాను' అని చెప్తుంది. అప్పుడు సంగీత.. మీరా చాలా మంచిది అని అమాయకంగా అంటుంది. తర్వాత సంగీత కాఫీ పట్టుకుని ఆదర్శ్ రూమ్ వెళ్లి అతడిని నిద్రలేపుతుంది. దీంతో అతడు 'పొద్దున్నే నా గదిలోకి ఎందుకు వచ్చావ్ వెళ్లిపో' అంటూ ఆమెపై సీరియస్ అవుతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 3rd

సంగీతకు రజినీ క్లాస్ పీకేస్తూ
ఆదర్శ్ సీరియస్ అవడంతో సంగీత 'అమ్మ బావ దగ్గరకు వెళ్లు అంటుంది. నువ్వేమో నన్ను కసురుకుంటావు. నన్ను ఎవరూ అర్థం చేసుకోరు' అంటూ బిక్కముఖం వేసుకుని చెబుతుంది. ఆ తర్వాత బయటకు వెళ్లగా.. ఆదర్శ్‌కు త్వరగా దగ్గర అవమని కూతురికి రజినీ పెద్ద క్లాస్‌నే ఇస్తుంది. దీనికామె 'హద్దులలో ఉండకపోతే ఇంట్లో నుంచి బయటకి పొమ్మంటున్నాడు' అని చెప్తుంది. సంగీత చెప్పిన దానికి రజినీ 'అయితే ఏదో ఒకటి కావాలని చెప్పి మీ బావను అడుగుతూ తన వెనుక తిరగు' అని అంటుంది. ఇలా ఇద్దరూ అష్టకష్టాలు పడుతుంటారు.

అడ్డంగా దొరికిపోయిన మీరా
తండ్రి శ్రీనివాస్‌కు మీరా ఫోన్ చేసి 'ఇల్లు అమ్మడానికి ఇంక ఎన్ని రోజులు పడుతుంది? అది అమ్మమంటే ఇన్ని పాట్లు పడుతున్నావు. ఇల్లు అమ్మడం ఇష్టం లేక సాకులు చెప్తే బాగోదు' అంటుంది. దీనికాయన 'నువ్వు ఎక్కడ దొరికిపోతావోనని భయంగా ఉంది' అంటాడు. తర్వాత ఆమె నాన్న అని మాట్లాడుతుంటే పక్క నుంచి కృష్ణ వినేస్తుంది. అప్పుడు కృష్ణ 'తనకు ఎవరూ లేరని చెప్పింది కదా. మరి నాన్న అంటుంది ఏంటి' అని మనసులో అనుకుంటుంది. అప్పుడు వెనక్కి చూసిన మీరా.. కృష్ణ తన మాటలు వినేసిందా ఏంటి అని షాక్ అవుతుంది.

పాత ఇంటి ఓనర్‌తో అంటూ
ఫోన్ మాట్లాడడం అయిపోయిన వెంటనే ఎవరితో మాట్లాడుతున్నావు అని మీరాను కృష్ణ ప్రశ్నిస్తుంది. దీనికామె 'పాత ఇంటి ఓనర్ తో మాట్లాడుతున్నా. ఆయన్ని నాన్న అని పిలవడం అలవాటు' అని కవర్ చేస్తుంది. కానీ కృష్ణ మాత్రం నమ్మదు. దీంతో ఆమెను నమ్మించడం కోసం డ్రామా మొదలుపెట్టేస్తుంది. చివరకు ఆమె మాటలు నమ్మేసిన కృష్ణ వెళ్ళిపోతుంది. తర్వాత సంగీత మళ్ళీ ఆదర్శ్ దగ్గరకి వస్తుంది. ఏంటి అంటే ఏం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. దీంతో ఆదర్శ్ నీ ప్రాబ్లం ఏంటి అంటూ ఆమెను సీరియస్‌గా ప్రశ్నిస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 3rd

సంగీతకు లైన్ వేసిన మధు
ఆదర్శ్ సీరియస్‌గా ఉండడంతో సంగీత 'ఏం లేదు హాయిగా నిద్రపోయాను. ఏసీ బాగుంది. ఐస్ క్రీమ్ తినాలని ఉంది' అంటూ ఏదేదో మాట్లాడుతుంది. దీంతో ఆదర్శ్ కొనిస్తానని చెప్పి కొట్టబోతుంటే పారిపోతుంది. దీంతో ఆమె 'పెద్ద బావకు అసలు మనసు లేదు. ఐస్ క్రీమ్ అడిగితే కర్ర తీసుకుని కొడతానని అంటున్నాడు. ఈ విషయం అమ్మకి చెప్తే కర్ర పట్టుకొస్తుంది' అని భయపడుతుంది. అప్పుడే మధు వచ్చి సంగీతకు లైన్ వేస్తూ ఐస్ క్రీమ్ ఇస్తాడు. అప్పుడది తీసుకుని చిన బావ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకుని పెద్ద బావ ఇచ్చాడని చెప్పాలని అనుకుంటుంది.

మనలో ఒకరిగా చూడాలని
మీరా మాటలను నమ్మేసిన కృష్ణ 'ఇంటి ఓనర్‌ను నాన్న అని పిలుస్తుంది. అది విని చాలా బాధేసింది. ఎవరు కొంచెం ప్రేమ చూపించినా కనెక్ట్ అయిపోతుంది. తనను మనలో ఒకరిగా చూసుకోవాలి. మీరాకు ఫోన్ కొనిద్దాం' అని మురారికి చెప్తుంది. దీనికతడు సరే అంటాడు. రేవతి భవానీతో ముకుంద పిండ ప్రదాన కార్యక్రమం గురించి మాట్లాడుతుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X