Krishna Mukunda Murari: ముకుందగా మారిన మీరా.. కలిసిపోయిన శత్రువులు.. నేటి ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:చనిపోయిన ముకుందకు పిండ ప్రదానం చేసి ఆత్మ శాంతింపజేయాలని రేవతి అనుకుంటుంది. అలాగే, శ్రీనివాస్‌ను కూడా పిలుద్దామని భవానీతో చెప్తుంది. కానీ, ఎవరూ దానికి రావని చెప్తారు. తర్వాత ముకుంద ఆత్మ అద్దంలో కనిపించి మీరాతో మాట్లాడుతుంది. ఆ తర్వాత ముకుందకు పిండ ప్రదానం చేయడానికి శ్రీనివాస్ ఇబ్బంది పడుతుంటాడు. అంతేకాదు, తన కూతురు బతికే ఉందని అంటాడు. అప్పుడు మీరా వచ్చి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే, తనకు పిండ ప్రదానం చేయమని తండ్రితో అంటుంది. దీంతో ఆయన ఇబ్బంది పడుతూనే పని చేస్తాడు.

నా కూతురు నీలో ఉందని:ఇష్టం లేకపోయినా శ్రీనివాస్ తన కూతురికి పిండ ప్రదానం చేస్తాడు. అది చూసి మీరా తన తండ్రిని హత్తుకుంటుంది. అప్పుడాయన 'నా కూతురు చనిపోలేదు నీలోనే ఉంది. ఈరోజు నుంచి నా కూతురిని నీలోనే చూసుకుంటాను' అని అంటాడు. దీంతో మీరా 'తెలిసి అన్నావో తెలియక అన్నావో కానీ అద్భుతమైన ఐడియా ఇచ్చావు' అని మనసులో అనుకుంటుంది. మరోవైపు సంగీతను ఆదర్శ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని రజినీ అనుకుంటుంది. అప్పుడే కృష్ణ వెళ్తుండగా ఆమెను ఆపి ముకుంద ఎలా చనిపోయింది అని ప్రశ్నిస్తుంది.
కృష్ణను సపోర్ట్ చేసిన అత్త:రజినీ అడగ్గానే కృష్ణ అందరూ చనిపోయినట్టే చనిపోయింది అంటుంది. దీంతో ఆమెకు బీపీ పెరిగి భవానీని పిలుస్తుంది. అప్పుడు 'నీ కోడలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నేను ఏం అడిగినా పెడసరిగా సమాధానం చెప్తుంది. అసలు మమ్మల్ని మనుషులుగా కూడా చూడటం లేదు' అని కంప్లైంట్ చేస్తుంది. దీంతో భవానీ 'ఆ మాట నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో అందరి బాగోగులు చూసే వాళ్లు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ మాత్రమే. తను ఎవరిని తక్కువగా చూడదు నిన్ను కూడా' అంటూ ఆమెను సపోర్ట్ చేస్తుంది.
యాక్టింగ్ స్టార్ట్ చేసిన మీరా:మీరా ఒక్కసారిగా కూలబడి ఏడుస్తుంది. అప్పుడు ఆదర్శ్ ఏమైందని అడుగుతాడు. దీంతో మీరా 'ముకుంద గుర్తుకు వచ్చింది. వాళ్ళ నాన్న ఒకమాట అన్నారు.. నా కూతురు చనిపోలేదు నీలోనే ఉంది అని. తనని చూసుకున్నాట్టే నన్ను చూసుకున్నారు. కానీ నేను ముకుంద అని ఎవరిని పిలవాలి? ఈ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది' అని ఏడుస్తుంది. దీంతో భవానీ 'మీరా మనకి కావాల్సిన వాళ్ళు ఒక్కసారిగా కనిపించకపోతే ఆ బాధ తట్టుకోవడం కష్టం. వాళ్ళ జ్ఞాపకాలు మనల్ని వెంటాడి వేధిస్తాయి. కానీ కొన్నేళ్లు మోయక తప్పదు' అని ఓదార్చుతుంది.

ముకుందగా మారిన మీరా:భవానీ మాటలకు ఆదర్శ్ 'అవసరం లేదమ్మా.. ఏది మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఏ బాధ లేకుండా ఎప్పటికీ గుర్తుంచుకునే దారి ఉంది. ఇప్పటి నుంచి మీరా పేరు ముకుంద' అని అంటాడు. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అప్పుడు మధు 'ముకుంద అనే పేరు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలిసి కూడా మళ్ళీ ఆ పేరు ఎందుకు' అని అంటాడు. కానీ ఆదర్శ్ మాత్రం 'శ్రీనివాస్ మీరాలో ముకుందని చూసుకుంటే మీకేంటి ప్రాబ్లం? ముకుంద అంటే ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు కానీ మీరా అంటే అందరికీ ఇష్టమే కదా' అని అంటాడు.
అలాగే పిలవండి అంటూ:తర్వాత ఆదర్శ్.. మీరా కోరికను నెరవేరుద్దామని తల్లిని బతిమలాడతాడు. దీంతో భవానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉన్నావంటే ఒప్పుకున్నాట్టే కదాని ఆదర్స్ వెళ్ళి మీరాని పేరు మార్చడం ఇష్టమే కదాని అడుగుతాడు. దీనికామె 'ఇష్టం కాదు.. ఇది నా అదృష్టం. ఈ క్షణం నుంచి అందరూ నన్ను ముకుంద అని పిలవండి ఆనందంగా పలుకుతాను' అంటుంది. ఇంట్లో అందరూ కోపంగా చూస్తారు. మీరాకు ముకుంద పేరు పెట్టడం ఏంటని కృష్ణ మురారిని అడుగుతుంది. మన మీద పగ తీర్చుకుంనేందుకు ఇలా పెట్టాడు అనుకుంటారు.
ఆదర్శ్ మనసు మార్చాలి:మురారి 'ముకుంద చనిపోవడానికి మనం కారణం కాదు కదా మనకేంటి ఇబ్బంది? కానీ నా బాధ అంతా ఆదర్శ్ గురించి. జరిగింది మర్చిపోయి తను మనల్ని క్షమిస్తాడని అనుకున్నాం కానీ ఇప్పుడు మీరాని ముకుంద అని పిలిస్తే జరిగింది ఏదీ మర్చిపోలేడు' అంటాడు. దీంతో కృష్ణ 'ఆదర్శ్ మనసు ఎలాగైనా మార్చాలి, ముకుంద చావుకు మనం కారణం కాదని నమ్మించాలి' అని కృష్ణ అనగా.. మురారి 'ఎక్కడ నమ్ముతున్నాడు. మనల్ని శత్రువులుగా చూస్తున్నాడు' అని అంటాడు. అప్పుడు కృష్ణ.. 'మీరా మీరు ఏది చెప్తే అది చేస్తుంది' అని ఐడియా ఇస్తుంది.

రజినీతో ముకుంద ప్లాన్:తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని మీరా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రజినీ.. తన కూతురికి ఆదర్శ్‌ను వలలో వేసుకోవడం కుదరడం లేదని తిడుతుంది. అప్పుడు సంగీత.. ఆదర్శ్.. ముకుందను మర్చిపోలేదని చెప్తుంది. అప్పుడు మీరా వచ్చి 'మరచిపోవడం ఎంత సేపు పిన్ని గారు.. చచ్చిపోయిన పెళ్ళాం పేరు నీకు పెడితే నువ్వు తల ఊపావు. నీ మనసులో ఏముంది' అని డౌట్ పడుతుంది. దీంతో మీరా 'నేను తన ఫ్రెండ్ అని పెట్టాడు' అని అంటుంది. అప్పుడామె 'ఏమో నీకు తన పెళ్ళాం పేరు పెట్టిన వాడు రేపు నీలో తన పెళ్ళాన్ని చూసుకుంటే ఏంటి' రజినీ అడిగేసరికి ముకుంద షాక్ అవుతుంది. అప్పుడు మీరా.. ఆదర్శ్‌తో మీ కూతురు పెళ్లి చేసే బాధ్యత నాది అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











