Krishna Mukunda Murari: మురారి, కృష్ణకు అవమానం.. భవానీకి ప్రామిస్ చేసిన మీరా.. కథలో ఫుల్ ట్విస్ట్‌లు

ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
ముకుందకు పిండ ప్రదానం చేసిన తర్వాత శ్రీనివాస్.. మీరాను తన కూతురు అంటూ మాట్లాడతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత ఆదర్శ్ వచ్చి మీరాకు ముకుంద పేరు పెడతానని అంటాడు. అంతేకాదు, ఇంట్లో వాళ్లు కూడా అలానే పిలవాలని చెప్తాడు. కానీ, దీనికి ఎవరూ అంగీకరించరు. అప్పుడు మీరా యాక్టింగ్ షురూ చేస్తుంది. ఇంట్లో వాళ్లను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఇక, రజినీ.. కృష్ణను అవమానించేలా మాట్లాడుతుంటే భవానీ కోడలికి సపోర్ట్ చేస్తుంది. చివర్లో సంగీతను రజినీ తిడుతుండగా.. వాళ్లకు సపోర్ట్ చేస్తానని మీరా హామీ ఇస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode April 6th

ఆవిడకు గౌరవం ఇవ్వండి అంటూ

కృష్ణ, మురారి ఇంటికి వచ్చేసరికి ఆదర్శ్ తాగుతూ కనిపిస్తాడు. అప్పుడు కృష్ణ 'మందు తాగడం మానితే కానీ ఆదర్శ్ మారడు. పెద్దత్తయ్య ఉన్నారు కనీసం ఆవిడకు గౌరవం ఇచ్చి తాగకుండా ఉంటే బాగుంటుంది' అని అంటుంది. దీంతో మురారి.. ఆదర్శ్‌తో మాట్లాడతానని చెప్పి కృష్ణని పంపించేస్తాడు. ఆ వెంటనే మురారి ఇంకెన్నాళ్ళు ఇలా అని అనగా.. ఆదర్శ్ పట్టించుకోకుండా నటిస్తాడు. అప్పుడు మురారి 'పెద్దమ్మ ఇంట్లో ఉంది. నువ్వు ప్రతిరోజు తాగడం చూస్తే బాధపడుతుంది. మాకోసం కాకపోయినా పెద్దమ్మ కోసం ఒక్కసారి ఆలోచించు' అంటాడు.

నువ్వు నాకు నీతులు చెప్పొద్దని
ఆదర్శ్, మురారి మాటలను భవానీ గమనిస్తుంటుంది. అప్పుడే ఆదర్శ్ గ్లాసును పగలగొడతాడు. అంతేకాదు, 'ఆవిడ నీకు పెద్దమ్మ అయితే నాకు అమ్మ.. నువ్వు నాకు నీతులు చెప్పొద్దు' అని కోప్పడతాడు. దీనికి మురారి బాధ్యత మర్చిపోయి ఇలా ఉండొద్దు అంటాడు. దీంతో ఆదర్శ్ 'నేను ఈరోజు ఇలా అయిపోవడానికి కారణం మీరు. నువ్వు కృష్ణ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు' అంటాడు. అప్పుడు వీళ్ల వీళ్ళ మాటలు విన్న ముకుంద ఆదర్శ్ మురారి మీద బాగా కక్ష పెట్టుకున్నాడు.. ముందు అది పోగొట్టాలి అని అనుకుంటుంది.

నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తానని

ఆ తర్వాత ఆదర్శ్ 'నీ మాటలు నా చెవిలో పడుతుంటే నాకు కంపరంగా ఉంది. నీ మొహం చూస్తుంటే అసహ్యంగా ఉంది. నువ్వు ఉంటున్న ఇంట్లో నేను ఉంటుంటే నాకు ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోవాలని ఉంది. నాకు ఇంత ద్రోహం చేసి సిగ్గులేకుండా నా ముందుకు ఎలా వస్తున్నావ్? నీ ప్లేస్‌లో నేను ఉంటే ఇలా ఉండను. నీకోసం ప్రాణాలు అయినా ఇస్తాను కానీ నీలా నమ్మక ద్రోహం చేయను. పొరపాటున ఉండాల్సి వస్తే నా మొహం కూడా చూపించేవాడిని కాదు. ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయేవాడిని. నీకు సిగ్గులేదు' అంటూ అవమానిస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 6th

భవానీకి మాట ఇచ్చిన మీరా
ఆదర్శ్ మాటలు విని బాధపడుతున్న భవానీతో మీరా 'ఆ ఇద్దరు అన్నదమ్ములను కలిపే బాధ్యత నాది' అని మాట ఇస్తుంది. దీంతో భవానీ 'ప్రయత్నించు కానీ.. ఆదర్శ్‌ను ఎక్కువగా బతిమలాడాల్సిన అవసరం లేదు. కానీ మురారి తప్పు ఏమి లేదని వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో' అంటుంది. అప్పుడు మీరా 'మురారి మీద ఆదర్శ్‌కు ఉన్న అభిప్రాయం పోవాలి. కృష్ణ మాత్రమే చెడ్డదానిలా కనిపించాలి' అని ప్లాన్ చేస్తుంది. తర్వాత మురారి తన గదిలోకి వచ్చి బాధపడుతుంటే కృష్ణ పట్టించుకోవద్దు వదిలేయమని చెప్తుంది. అలాగే డౌట్లు కూడా పెడుతుంది.

మీరానే విషయం చెప్పిందా

కృష్ణ డౌట్ పెట్టడంతో మురారి 'నేను అదే అనుకున్నాను కానీ ముకుంద కోసం మనమే తనని తీసుకొచ్చాము కదా అందుకే మన మీద కోపంగా ఉన్నాడు. కానీ ముకుంద మీద వాడికి ఉన్న అభిప్రాయం అంత సడెన్ గా ఎలా మారిపోయింది' అని డౌట్ పడతాడు. దీంతో కృష్ణ.. ముకుంద గురించి ఎవరైనా పాజిటివ్‌గా చెప్తూ ఉండి ఉంటారేమో అంటుంది. ఎవరు చెప్తారని మురారి అంటే మీరా అయి ఉంటుందేమో అంటూ.. 'మీరా.. ముకుంద ఫ్రెండ్స్ కదా. ఆదర్శ్ ముకుంద గురించి చెడుగా మాట్లాడటం భరించలేక తన తప్పు లేదని ఒప్పించి ఉంటుంది' అంటుంది.

ఇంట్లో నుంచి వెళ్లిపోదామని
ఆ తర్వాత మురారి బ్యాగ్ తీసుకుని బట్టలు సర్ధుతుంటాడు. దీంతో కృష్ణ ఏమైందని అడగ్గా.. ఈ ఇంట్లో ఉండటం లేదు వెళ్లిపోతున్నాం అంటాడు. దీంతో కృష్ణ సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా మురారి వినిపించుకోడు. పైగా 'మొదటి సారి నా మీద అనుమానం వచ్చినప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోదామని అనుకున్నా. కానీ అందరి గురించి ఆలోచించాను. నన్ను లాకప్ డెత్ చేస్తారంటే కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు నాతో పాటు నిన్ను తిడుతున్నాడు. ఇలా చీటికి మాటికి అభిప్రాయం మార్చుకునే వాడి దగ్గర ఉండలేను బట్టలు సర్దుకో' అని సీరియస్‌గా చెబుతాడు.

ముకుందనే మొత్తం చేసింది

మరోవైపు ఆదర్శ్ దగ్గరకు వచ్చిన మీరా 'కుటుంబ గౌరవం కోసం మురారి అలా చేశాడని ముకుంద నాతో చెప్పింది. మీకు తెలిసినవన్నీ నిజాలు కాదు. మురారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీకు తెలియనివి ముకుంద నాతో పంచుకున్న నిజాలు చెప్తాను. కృష్ణ ఈ ఇంట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే కృష్ణ వాళ్ళ ప్రేమ గురించి తెలుసుకుంది. అది కూడా మురారి తన మంచితనంతో తన భార్య దగ్గర ఏ నిజం దాచకూడదని చెప్పాడు. కానీ కృష్ణ వదల్లేదు. ముకుందకు ఏ కష్టం రాకూడదని మీరు ముకుంద కలిసి ఉండాలని మురారి ఆశ' అని కృష్ణపై కోపం పెంచేలా చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X