Krishna Mukunda Murari: మురారిని ఆపేసిన ఆదర్శ్.. మీరాలో కొత్త టెన్షన్.. కథలో అదిరిపోయే మలుపు

సినిమాలు, ఓటీటీల హవా కనిపిస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
మందు తాగొద్దని చెప్పిన మురారిపై ఆదర్శ్ సీరియస్ అవుతాడు. అంతేకాదు, తన కళ్ల ముందు తిరగడానికి సిగ్గు లేదా అన్నట్లుగా మాట్లాడతాడు. పరోక్షంగా మురారి, కృష్ణను ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటాడు. ఇదంతా విని భవానీ దేవి బాధపడుతుంది. అప్పుడు మీరా అన్నదమ్ములను కలుపుతాను అంటూ ఆమెకు హామీ ఇస్తుంది. అయితే, తనకు వచ్చిన ఛాన్స్‌ను వినియోగించుకుంటూ మురారి మంచోడని, కృష్ణే మొత్తం చేసిందని ఆదర్శ్‌కు చెబుతుంది. మురారి మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode April 8th

ఇంట్లో నుంచి వెళ్లిపోతామని
మురారి వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోడానికి బ్యాగ్ పట్టుకుని వస్తారు. దీంతో రేవతి వాళ్లను ప్రశ్నిస్తుంది. అప్పుడే మీరా వాళ్లను చూసి షాక్ అయిపోతుంది. తర్వాత రేవతి పదే పదే ఎక్కడికి అని అడగడంతో మురారి మా ఇంటికి వెళ్తున్నామని చెప్తాడు. అప్పుడు మీరా 'మురారి కోసం ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే వెళ్లిపోతానని అంటాడు ఏంటి' అనుకుంటుంది. తర్వాత కృష్ణ 'క్షమించండి అత్తయ్య.. మేము ఇక్కడ ఉండటం కొంతమందికి నచ్చడం లేదు. ఇక్కడే ఉండి వాళ్లను బాధపెట్టడం ఎందుకని వేరే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం' అని చెప్తుంది.

వెళ్లిపోవడమే మంచిదంటూ
తర్వాత కృష్ణ 'ఇక్కడ ఉన్న వాళ్ళైన సంతోషంగా ఉంటారు అది చాలు. మీకు అర్థమైంది కదా ఆత్తయ్య' అంటుంది. దీంతో రజినీ ఎవరు ఏమన్నారని వెళ్లిపోతున్నారు అని అడుగుతుంది. మధు 'కోపాలు సర్దుకుంటాయని నువ్వే అన్నావ్ కదా' అంటాడు. రజిని మాత్రం వెళ్లిపోవడమే మంచిది. కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతే సగం అడ్డు తొలగిపోతుంది అనుకుంటుంది. అప్పుడు రేవతి 'నీకు వాడి మనసు బాధ ఏంటో తెలుసు. వాడు ఏ పరిస్థితిలో అలా మాట్లాడుతున్నాడో తెలుసు కదా' అంటుంది. దీంతో మురారి అర్థం చేసుకోవట్లేదు కాబట్టే వెళ్లిపోతుంది అంటాడు.

ఇక్కడ సంతోషంగా ఉండరు
కృష్ణ మాట్లాడుతూ.. 'మేం కళ్ళెదురుగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. కసురుకుంటున్నాడు. అది కూడా బాధ కదా అందుకే దూరంగా ఉండాలని అనుకుంటున్నాం' అని చెప్తుంది. దీంతో మధు 'మీరు వెళ్తే ఇక్కడ ఎవరు సంతోషంగా ఉండరు' అంటాడు. అప్పుడు మధు 'అమ్మ నువ్వు కూడా మాతో వచ్చేస్తే మంచిది. నీ కొడుకు ఉండటం ఇష్టం లేని వాడికి నువ్వు ఉంటే ఇష్టంగా ఉంటుందా' అని అడుగుతాడు. అప్పుడు మధు 'మురారి బాధలో మాట్లాడుతున్నాడు వద్దు' అంటూ బతిమలాడతాడు. దీనికి మురారి.. ఆదర్శ్ మాట్లాడడం లేదు నువ్వు వచ్చేయ్ అంటాడు.

మీరాకు థ్యాంక్స్ చెప్పాడు
అనంతరం కృష్ణ 'ఆదర్శ్ బాధకు మేమే కారణమని గట్టిగా నమ్మకంతో ఉన్నాడు. మనం దూరమయి తన బాధను దూరం చేద్దాం. మాతో పాటు రండి' అని అడుగుతుంది. అప్పుడు మీరా మాత్రం ఎలాగైనా మురారి వాళ్ళని ఆపాలని భవానీ కోసం చూస్తుంది. సుమలత ఆదర్శ్‌ను బతిమలాడుతుంది. కానీ అతడు మాత్రం సైలెంటుగానే ఉండిపోతాడు. దీంతో మురారి 'ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు పిన్నీ' అంటాడు. తర్వాత మురారి తనను కాపాడినందుకు మీరాకి థాంక్స్ చెప్తాడు. మీరు చేసిన సహాయం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అంటాడు.

నువ్వు వెళ్తే ఊరుకుంటానా
ఎవరూ చెప్పినా వినకపోవడంతో మురారి వాళ్లను సుమలత, మధు బ్రతిమాలతారు. అయినా వాళ్లు వెళ్లిపోతుంటే భవానీ ఎదురుగా వస్తుంది. అప్పుడామె 'ఎక్కడికి బయల్దేరారు? రేవతి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు' అని అడుగుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్లు 'ఎవరో ఏదో అన్నారని కృష్ణ, మురారి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. వాళ్ళను వెళ్లొద్దని చెప్పు' అనగానే భవానీ తనని మాట్లాడొద్దని ఆపుతుంది. అంతేకాదు, 'అప్పుడు ఆదర్శ్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతే ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే ఊరుకుంటానని అనుకుంటున్నావా' అంటుంది.

మురారిని ఆపేసిన ఆదర్శ్
భవానీ మాట్లాడుతుండగానే ఆదర్శ్ బయటకు వస్తాడు. అప్పుడు భవానీ 'మిమ్మల్ని ఎవరు బయటకి వెళ్లమన్నారో వాళ్ళనే మీరు ఎందుకు బయటకు వెళ్లాలో కారణం చెప్పమను. అప్పుడు నేనే నిర్ణయిస్తాను మీరు ఉండాలో వద్దో' అని అంటుంది. దీంతో మీరా 'నేను చెప్పడం వల్లే వెళ్లిపోతున్నారని ఆదర్శ్ నా పేరు చెప్తే పరిస్థితి ఏంటి' అని టెన్షన్ పడుతుంది. అప్పుడు కృష్ణ ఈ ఒక్క విషయంలో క్షమించమని అడుగుతుంది. తర్వాత భవానీ ఒకే ఒక్క కారణం చెప్పు. నేనే మిమ్మల్ని పంపించేస్తానని ఆదర్శ్‌ను అడగ్గా.. అతడు మురారి బ్యాగు తీసుకుని లోపలికి వెళ్తాడు.

కృష్ణను శత్రువుగా చేస్తాను
మురారి వాళ్లు వెళ్లడం ఆగిపోవడంతో మీరా 'మురారి వెళ్లలేదు ఈసారి ఆదర్శ్ ని రెచ్చగొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను ఏం చెప్తే అది చేసేలాగా ఆదర్శ్‌ను నా గుప్పిట్లో పెట్టుకోవాలి. మురారి భార్యగా ఈ గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వచ్చే రోజు ఎప్పుడు వస్తుందో. ఈ కృష్ణని పంపించేస్తే ఆరోజు వస్తుంది. తనని ఎలాగైనా పంపించాలి. ఆదర్శ్ మనసులో మురారి మీద ఉన్న నెగటివ్ ఫీలింగ్ తీసేస్తాను కానీ నిన్ను మాత్రం బద్ధ శత్రువుని చేస్తాను' అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X