Krishna Mukunda Murari: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మురారి.. ఆమెతోనే పెళ్లికి రెడీ.. ముకుంద పని గోవిందా!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

కోపంగా ఉన్న భవానీ దేవితో మధుకర్ 'కృష్ణను కాఫీ తీసుకు రమ్మని చెప్పనా పెద్దమ్మా' అని అడుగుతాడు. దీనికామెకు కోపం వచ్చి అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మురారి అది చూసి 'మధుకర్ ఏం చేశాడు? ఎందుకు కొట్టావు' అని భవానీని ప్రశ్నిస్తాడు. దీనికామె 'వీడు ఒక పనికిమాలిన పని చేశాడు అందుకే అలా కొట్టాను' అని చెప్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode December 27th

మురారితో కలిసి వచ్చిన కృష్ణ కాఫీ తీసుకోమని రేవతితో అంటుంది. దీనికామె భవానీ వైపు చూపిస్తూ వద్దు అని సైగలు చేస్తుంది. అది గమనించిన మురారి 'చూశావా కృష్ణ వీళ్లు నిన్ను పని మనిషిలాగా కూడా చూడటం లేదని చెప్తే వినలేదు. ఇప్పుడు సరిపోయిందా' అన్నట్లుగా తిడతాడు. అప్పుడు భవానీ 'శభాష్ మురారి.. కేసు తేలకముందే నువ్వు వేరు, మేము వేరు అన్నట్టు చేశావు. ఇక కేసులు ఎందుకు? పంచాయతీలు ఎందుకు' అని అంటుంది. తర్వాత అతడు సమాధానం చెప్పబోతుంటే మాత్రం పట్టించుకోదు.

ఆ తర్వాత భవానీ దేవి 'కేసు తేలే వరకు రావొద్దని నేను చాలా క్లియర్‌గా చెప్పాను. అయినా ఫలితం లేదు' అంటుంది. దీనికి మురారి 'మీకు ముందే చెప్పాను. కృష్ణ ఈ ఇంటికి రావచ్చు పోవచ్చని' అంటాడు. దీనికి భవానీ 'ఎందుకు మురారి ఇలా నటించడం అలవాటు చేసుకుంటున్నావు' అని ప్రశ్నించగా.. నేను నటిస్తున్నానా అని మురారి ఎదురు ప్రశ్నిస్తాడు.

మురారి మాటలకు భవానీ దేవి 'చెప్పాలంటే మమ్మల్ని చీట్ చేస్తున్నావు. మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నావు' అంటాడు. దీనికి కృష్ణ 'ఏమైనా ఉంటే నన్ను అనండి. తప్పు చేశాను కాబట్టి నేను పడతాను. కానీ ఏసీపీ సర్' అని ఏదో అనబోతుండగా.. భవానీ నోర్ముయ్ ఏం మాట్లాడాలో నువ్వు డిసైడ్ చేస్తావా అని అరుస్తుంది. అప్పుడు మురారి 'వచ్చే శుక్రవారం లోపు కేసు తేలకపోతే ముకుందని పెళ్లి చేసుకుంటానని అన్నాను ఇందులో ఏం మాట తప్పాను' అంటాడు. కానీ, మురారి ఔట్ హౌస్‌లోనే ఎక్కువ ఉంటున్నాడని, అందుకే కేసు తేలట్లేదని అంటారు.

తర్వాత ముకుంద 'నువ్వు గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు. వాళ్ల పనులని బట్టి ఎవరి మీదైన ఇష్టం, అయిష్టం ఏర్పడుతుంది. అది అందరికీ అలాగే ఉంటుంది. కాఫీ తీసుకు రమ్మని నీకు చెప్పకున్నా మా పరువు తీయడానికి తెచ్చావా' అని కృష్ణను అడుగుతుంది. దీనికామె కాఫీ పట్టుకొస్తే తప్పు ఏంటని అడగ్గా.. 'కేసు తేలే వరకు తీసుకురాకూడదు. అలా చేస్తే మమ్మల్ని మంచి చేసుకోవడానికని అర్థం' అని భవానీ మాట్లాడుతుంది. దీనికి మురారి 'రెండు రోజుల్లో కేసును తేలుస్తాను. నువ్వు ఇక ఇదే ఇంట్లో శాశ్వతంగా ఉంటావు' అని కృష్ణకు మాటిస్తాడు.

మధుకర్ 'మురారి గురించి కాదు.. వాడికి పట్టిన దురదృష్టం గురించి ఆలోచించాలి. బ్రో నిజంగా హీరో. మురారిలో వచ్చిన మార్పు నువ్వు గమనించావా? తను ఇప్పుడు ప్రశ్నించడం నేర్చుకున్నాడు. కృష్ణను వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నాడు. వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. శుక్రవారం కృష్ణతో పాటు మురారినే పెళ్లి పీటల మీద కూర్చుంటాడు' అని అంటాడు. దీంతో నందినీ మాత్రం చాలా టెన్షన్‌గా ఉందని అంటుంది.

మరోవైపు ముకుంద 'మురారి స్పీడ్ చూస్తుంటే ఇవాళో, రేపో నిజం బయట పెట్టేలా ఉన్నాడు' అని టెన్షన్ పడుతుంది. అప్పుడు దేవ్ 'వాడి మొహం.. ఇలాంటి వాళ్ళు మాటలే కానీ చేతలు ఉండవులే' అని ధైర్యం చెప్తాడు. దీనికి ముకుంద 'ఏమో నాకు అయితే కృష్ణ నిన్ను గమనిస్తుందని డౌట్‌గా ఉంది. నావైపు అదోలా చూస్తుంది. అదే మురారికి కూడా అనిపిస్తే' అంటుంది. అంతలోనే మధుకర్ అటు వస్తాడు. దీంతో వీళ్లు మాటలు ఆపేస్తారు. అది చూసి మధుకర్ వీళ్లు ఓవర్ చేస్తున్నారు అనుకుంటాడు.

అనంతరం కృష్ణ 'ఏసీపీ సర్‌తో వెళ్ళి కేసు సాల్వ్ చేయాలి. అప్పుడు మా బంధం శాశ్వతం అవుతుంది' అనుకుంటుంది. అప్పుడు మురారి 'పెద్దమ్మ ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు' అనుకుంటూ.. కృష్ణ ఇంటి ముందు నిలబడి పిలుస్తాడు. వాళ్ళని ముకుంద, దేవ్ చూస్తూ ఉంటారు. అది చూసి ఎప్పుడు కృష్ణ చుట్టూనే తిరుగుతున్నాడు నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు అని దేవ్ అడుగుతాడు. అయినా ముకుంద సమాధానం చెప్తుంది. తర్వాత కృష్ణ పడుతుంటే మురారి పట్టుకుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X