Krishna Mukunda Murari: పరిమళ దగ్గరకెళ్లిన దేవ్.. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో టెన్షన్.. తేల్చేసిన మురారి

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఏం జరిగిందంటే:కృష్ణతో ఇంట్లో వాళ్లు మామూలుగానే ఉంటుండడం చూసి భవానీ దేవికి కోపం వస్తుంది. ఆ సమయంలో మురారి ఆమెను ఎదురించి మాట్లాడుతాడు. దీంతో శుక్రవారం కేసు తేలిపోతే ముకుందను పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని గుర్తు చేస్తారు. దీనికి మురారి కేసును ఎలాగైనా తేల్చి కృష్ణనే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేస్తాడు. ఈ పరిణామాలతో ఇంట్లో రెండు వర్గాలు అవుతాయి. ముఖ్యంగా కృష్ణనే ఇష్టపడుతున్న మురారి కోసం ఎందుకు పరితపిస్తున్నావు అని దేవ్.. ముకుందను అడుగుతాడు. కానీ, ఆమె మాత్రం మురారి తనకే కావాలని అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode December 28th

కృష్ణకు సేవలు చేయడంతో:కృష్ణకు కాలు బెనకడంతో మురారి ఆమెను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకు వస్తాడు. అది చూసి మధుకర్ ఏమైందని అడగ్గా మురారి విషయం చెప్తాడు. అంతేకాదు, 'చిన్న నొప్పి అని తగ్గే వరకూ నిర్లక్ష్యం చేయకూడదు' అంటాడు. అప్పుడు ముకుంద అలా అని తగ్గేవరకు ఎత్తుకుని తిరుగుతావా ఏంటి అని అడుగుతుంది. తర్వాత కృష్ణ కాలికి మురారి స్ప్రే చేస్తూ సేవలు చేస్తుండడంతో భవానీకి కోపం వస్తుంది.

బాగా రెచ్చగొట్టిన ముకుంద:అప్పుడే ముకుంద 'చూశారుగా అత్తయ్య.. అంతగా చెప్పి ఐదు నిమిషాలు కూడా కాలేదు. అయినా మురారి చూడండి ఏం చేస్తున్నాడో. అయినా ఇప్పుడు మురారిలో కృష్ణ మీద ప్రేమ కంటే మీ మీద ఉన్న పంతమే కనిపిస్తుంది' అని రెచ్చగొడుతుంది. అప్పుడు భవానీ వెళ్లిపోతుంటే ఆపిన మురారి 'పరిమళ దగ్గరకి వెళ్దామని అనుకున్నా కానీ ఇంతలోనే ఇలా జరిగింది' అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode December 28th

తప్పించుకుపోయిన దేవ్:పరిమళ దగ్గరకు కృష్ణ వెళ్తానని అంటే మురారి వద్దని వారిస్తాడు. అంతేకాదు, తననే ఇక్కడకు రమ్మంటాను.. ఆమె వస్తే నీ ట్రీట్‌మెంట్‌తో పాటు నా పని కూడా అవుతుంది అంటాడు. దీంతో ముకుందలో టెన్షన్ మొదలు అవుతుంది. వెంటనే దేవ్‌ను రాకుండా ఆపాలని అనుకుంటుంది. అంతలోనే మురారి.. పరిమళకు కాల్ చేసి 'కృష్ణ కాలు బెణికింది. తనని వదిలి రావడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. నువ్వే ఇంటికి రా కృష్ణకు ట్రీట్ చేసినట్టు ఉంటుంది. మన పని కూడా అవుతుంది' అంటాడు. అంతలోనే దేవ్ అక్కడకు వెళ్లి ఆమెను చూసి తప్పించుకుని వెళ్లిపోతాడు.

ముకుంద మీద సందేహం:మురారి కాల్ మాట్లాడిన తర్వాత దేవ్‌కు ఫోన్ చేసేందుకు ముకుంద పక్కకు వెళ్తుంది. అది చూసిన కృష్ణకు ఆమెపై డౌట్ పెరుగుతుంది. అప్పుడు 'మొన్నేమో ఎవరూ చూడకుండా లోపలికి వెళ్ళింది. కేసు విషయంలో ముకుంద ఎందుకో కంగారుపడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది' అనుకుంటుంది. ఇక, దేవ్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ముకుంద టెన్షన్ పడుతుంది. భవానీ ముకుందని ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. అప్పుడు ముకుంద 'నాకు అన్ని నిజాలు తెలుసని అత్తయ్యకి తెలిస్తే నా గతి ఏంటి' అని మనసులో అనుకుంటుంది.

నీ కోడలు ఇంట్లో ఉంటుంది:తర్వాత మురారి.. భవానీని కూర్చోమని 'స్కెచ్ ఆర్టిస్ట్ వస్తున్నాడు. పరిమళ పోలికలు చెప్పగానే అసలు వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. కావాలని ఇంట్లోనే కూర్చుని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు కానీ.. ఇది ఓవర్ యాక్షన్ కాదు' అంటాడు. దీనికామె 'నేనేం అడగలేదు కదా. ఎందుకు సంజాయిషీ ఇస్తున్నావ్ ఏదైనా తప్పు చేస్తున్నావా' అంటుంది. దీంతో మురారి 'మీకు అలా అర్థం అయితే నేనేం చేయలేను పెద్దమ్మ. అమ్మ ఇక నుంచి నీ కోడలు ఇంట్లోనే ఉంటుంది' అంటాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు.

Krishna Mukunda Murari Serial Today Episode December 28th

దేవ్‌కు కూడా టెన్షన్‌గానే:ఇంటికి వచ్చిన దేవ్ 'ఇప్పుడు నేను డాక్టర్‌కు కనిపిస్తే నేను అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యేది. డాక్టర్‌ను లేపేస్తే అసలు ఏ టెన్షన్ ఉండదు కదా. మళ్ళీ ఇంత తక్కువ టైమ్‌లో అంత రిస్క్ చేయకూడదు' అనుకుంటాడు. అంతలోనే అటుగా వచ్చిన మధుకర్.. దేవ్‌ మీద డౌట్ పడుతూ ఉంటాడు. కానీ, అతడు మాత్రం ఏం లేదని చెప్పి కవర్ చేస్తాడు. అంతలోనే ఇంటి బయట ఉన్న దేవ్ దగ్గరకు ముకుంద కంగారుగా వస్తుంది. అప్పుడు పరిమళ ఇంటికి వస్తుంది.. ఎలాగైన తప్పించుకుని తిరుగు అని చెప్తుంది. దీంతో అతడు వెనక డోర్ నుంచి లోనికి వెళ్తాడు.

కృష్ణకు చెప్పేసిన మధు:ముకుంద, దేవ్ కంగారు చూసిన మధుకర్‌లో సందేహాలు పెరిగిపోతుంటాయి. అంతలోనే తన అభిప్రాయాలను, అనుమానాలను కృష్ణకు వివరిస్తాడు. కానీ, ఆమె మాత్రం దేవ్ మంచోడని నమ్ముతుంది. అప్పుడు మధుకర్ ఎంత చెప్పినా పట్టించుకోదు. అంతలోనే అక్కడకు మురారి వచ్చి కృష్ణను తీసుకెళ్లబోతాడు. అప్పుడు మధుకర్ 'ఒక క్యారెక్టర్ గురించి ఎలా రాయాలో అర్థం కావట్లేదు' అనగా.. మురారి 'విలన్‌గా రాసేయ్' అంటాడు. దీంతో మధుకర్‌కు క్లారిటీ వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X