Krishna Mukunda Murari: ఆమెతో పెళ్లికి ఓకే చెప్పిన మురారి.. అంతలోనే మెలిక.. రసవత్తరంగా నేటి ఎపిసోడ్

చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఏం జరిగిందంటే:కృష్ణకు కాలు బెణకడంతో ఆమెను మురారి ఎత్తుకుని వచ్చి సపర్యలు చేస్తుంటాడు. అది చూసి భవానీ దేవికి కోపం వస్తుంది. అప్పుడే ముకుంద కూడా ఆమెను రెచ్చగొడుతుంది. అప్పుడు మురారి దోషిని కనిపెట్టి మురారిని ఈ ఇంటికి శాశ్వతంగా తీసుకొస్తా అంటాడు. ఇందుకోసం పరిమళ సాయంతో స్కెచ్ ఆర్టిస్టుతో బొమ్మ గీయించాలని అనుకుంటాడు. అప్పుడు ముకుందలో టెన్షన్ పెరుగుతుంది. కానీ, పరిమళకు కనపడకుండా దేవ్ జాగ్రత్త పడతాడు. వీళ్ల ప్రవర్తన చూసి మధుకర్‌కు సందేహం వచ్చి కృష్ణకు చెప్పగా.. ఆమె మాత్రం దేవ్ మంచోడని అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode December 29th

మురారి పనిక కృష్ణ సంతోషం:కృష్ణను మురారి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడామె 'పరిమళకు ఎమర్జెనీ ఆపరేషన్ ఉండకపోతే తను వచ్చేది. స్కెచ్ గీయించి ఈపాటికి అసలు దోషి ఎవరో తెలిసిపోయేది' అని అంటుంది. తర్వాత మురారి మందు తీసుకొచ్చి కృష్ణ కాలికి రాసి మసాజ్ చేస్తాడు. దీంతో కృష్ణ మురిసిపోతుంది. నేను చాలా అంటే చాలా అదృష్టవంతురాలినని సంతోషపడుతుంది. తర్వాత మురారితో 'ఇందాక మీరు దేవ్ అన్నయ్యది ఓవర్ యాక్షన్ అని, ఎందుకో నమ్మాలని అనిపించడం లేదని అన్నారు కదా. నాకు నమ్మాలని అనిపించలేదు' అని చెబుతుంది.

ఆదర్శ్‌ను తీసుకు రావాలని:కృష్ణ మాటలకు మురారి 'ముకుంద ఒక్కతే మారితే చాలు.. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మంచివాళ్లే' అని అంటాడు. దీనికామె 'ముకుంద మారాలంటే ఆదర్శ్ రావాలి. ఈ కేసులో మీరు నిర్దోషులని నిరూపించడం అయిపోయిన తర్వాత ఆదర్శ్‌ను వెతికి పట్టుకుంటాను' అని చెప్తాడు. మరోవైపు, దేవ్ కోసం ముకుంద ఎదురు చూస్తుంటుంది. అంతేకాదు, ప్రతి క్షణం టెన్షన్‌తో చస్తూ బతకాల్సి వస్తుందని అనుకుంటుంది. అంతలోనే దేవ్ అక్కడకు వస్తాడు. దీంతో ఎందుకు లేటుగా వచ్చావని అతడిని ముకుంద ప్రశ్నిస్తుంది.

నాన్న అని ఎందుకు అనాలి:ముకుంద అడిగిన ప్రశ్నకు దేవ్ 'శ్రీనివాసరావు ఫోన్ చేశాడు' అని చెప్తాడు. దీనికామె పేరు పెట్టి పిలుస్తావే నాన్న అనలేవా అని తిడుతుంది. దీంతో దేవ్ 'నాన్నగా ఏం చేశాడు? నువ్వు మురారి కోసం ఏడుస్తూ కూర్చుంటే మందు తాగుతూ ఉన్నాడు. అప్పుడు ఇంట్లో కూర్చోకుండా నిన్ను లాగి పెట్టి కొట్టి ఇంటికి తీసుకెళ్లాలి. ఆదర్శ్‌ను వెతికి నీతో కాపురం చేయించాలి. భవానీ మేడమ్‌ను నిలదీసి ప్రేమించుకున్నారు కదా. పెళ్లి చేయమని ఉంటే.. ఇప్పుడు చేసే పెళ్లి ఏదో అప్పుడే చేసేది కదా. ఇప్పుడు చెప్పు శ్రీనివాసరావును నాన్న అని ఎలా అనాలి' అని ఫైర్ అవుతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode December 29th

తప్పించుకోడానికి ప్లాన్ వేసి:దేవ్ మాటలకు ముకుంద 'ఇప్పుడు ఆ గొడవ ఎందుకు జరగాల్సింది చూడు' అంటుంది. దీంతో దేవ్ 'పరిమళ వస్తే రానివ్వు. వాడు నా బొమ్మ గీస్తాడు అంటావా? సినిమాల్లో చూడటమే కానీ నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా ' అని అడుగుతాడు. దీనికి ముకుంద వేస్తారంటుంది. అప్పుడు దేవ్ 'సరే అయితే రూమ్ దాటి బయటకి వెళ్లను' అనే సరికి.. 'నువ్వు ఇక్కడ ఉన్న నీ బొమ్మ అక్కడ ఉంటుంది కదా' అంటుంది. దీంతో మురారిని రాకుండా ఆపమని ముకుందకు సలహా ఇస్తాడు. అంతేకాదు, వాడు మంచోడే కానీ మగాడు అది గుర్తు పెట్టుకొ అని హెచ్చరిస్తాడు.

తీసుకు రావడం తప్పైంది:నందూతో మాట్లాడుతున్న సమయంలో రేవతి 'ఆర్టిస్ట్ వస్తే కేసు సాల్వ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మురారి.. కృష్ణ మెడలో తాళి కట్టేస్తాడు' అని చెప్తుంది. అంతలోనే మురారి రావడంతో 'భవానీ అక్క పిలుస్తుంది. అయినా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. కృష్ణ నాకు కోడలు కావాలి' అని తేల్చి చెబుతుంది. అప్పుడే భవానీ గతంలో జరిగిన విషయాలు మొత్తం గుర్తు చేసుకుంటుంది. అప్పుడే 'మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడం తప్పైంది. నాకు ఈ తలనొప్పి ఉండేది కాదు, మురారికి గతం గుర్తుకు వచ్చేది కాదు' అనుకుంటుంది.

ముకుంద అందుకే ఇష్టం:మురారి రాగానే భవానీ 'నీకు ఈ పెద్దమ్మ చేదు అయిపోయింది కదా. చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచి పెద్దవాడిని చేశాను' అంటుంది. దీంతో మురారి ఎందుకు ఏడుస్తున్నారు అనగా.. 'కొన్ని రోజులుగా చేస్తుంది ఇదే కదా. నువ్వు చాలా మారిపోయావు' అంటుంది. దీంతో నేను మారలేదు అర్థం చేసుకోండి అంటాడు. దీనికి భవానీ 'నువ్వు చనిపోయావని చెప్పి అనాథ శవం పంపిస్తే గుండె పగిలేలా ఏడ్చాను. ముకుంద నువ్వు బతికి ఉన్నావని చెప్పిన తర్వాత నిన్ను హాస్పిటల్‌లో చూసేసరికి నా ప్రాణం తిరిగి వచ్చింది' అంటుంది. దీంతో మురారి మిమ్మల్ని బాధ పెట్టినోడిని వదలను అంటాడు. ఆ తర్వాత భవానీ నిన్ను కాపాడిందనే ముకుంద అంటే ఇష్టం అంటుంది. దీనికి మురారి కేసు సాల్వ్ కాకపోతే మీకోసం ముకుందను చేసుకుంటా అంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode December 29th

మీరు తప్పు చేయకూడదు:తర్వాత మురారి 'శుక్రవారం రోజు మీరు ఒడిపోకూడదనే నా ప్రయత్నం. అందుకే నేను ప్రయత్నిస్తున్నా' అంటాడు. దీనికి భవానీ 'నేను గెలవడం ఏంటి' అంటుంది. అప్పుడు 'అవును పెద్దమ్మ.. ఇందులో కృష్ణ తప్పు లేదని తెలిస్తే మీరు గెలిచినట్టు. అందుకే కృష్ణ వాళ్ళ మీద అనుమానాన్ని ఇప్పుడే పోగొట్టుకోండి. తర్వాత తప్పు లేదని తెలిస్తే మీరు కృష్ణని ఫేస్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో మిమ్మల్ని నిలబెట్టలేను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆర్టిస్ట్ వస్తాడు స్కెచ్ వేస్తాడు. అందులో ఉన్నోడిని పట్టుకుంటాను' అంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X