Krishna Mukunda Murari: భవానీని ఒప్పించిన మురారి.. ముకుందకు మరో షాక్.. కృష్ణ మాటలతో దేవ్‌కు భయం
ఎప్పటికప్పుడు కొత్త షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఏం జరిగిందంటే: కృష్ణ కాలుకు మురారి మసాజ్ చేసుకుంటూ ఆమెతో ప్రేమగా మాట్లాడతాడు. దీంతో ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. అదే సమయంలో ముకుంద కోసం ఆదర్శ్‌ను ఇంటికి తీసుకు వస్తానని మురారి హామీ ఇస్తాడు. ముకుంద, దేవ్ మధ్య తండ్రి గురించి చర్చ వస్తుంది. అప్పుడు అతడను నాన్నను తిడతాడు. అదే సమయంలో ఎలాగైనా కేసు నుంచి తప్పించుకోవాలని వాళ్లిద్దరూ ప్లాన్ చేసుకుంటారు. అనంతరం ముకుంద చేసిన సహాయం గురించి భవానీ దేవి.. మురారికి చెప్తుంది. దీంతో అతడు కేసు తేలిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇస్తాడు.

నేనే చంపేసి జైలుకు వెళ్తా: దేవ్, కృష్ణతో నందినీ 'మురారి పిలిపించే ఆర్టిస్ట్ బాగా బొమ్మలు వేస్తాడు. పరిమళ చెప్పిన పోలికలతో బొమ్మ ఖచ్చితంగా గీస్తాడు. ఊహాజనిత చిత్రాలు గీయడంలో ఎక్స్‌పర్ట్' అని అంటుంది. దీంతో దేవ్ 'ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. వాడు ఎవడో తెలిస్తే నేనే వాడిని చంపి జైలుకి వెళ్తాను.. చిన్నాన్నని బయటకి తీసుకొస్తా' అంటాడు. అప్పుడు కృష్ణ 'అన్నయ్య మీకెందుకు శ్రమ? ఏసీపీ సర్ వాడి ఎముకల్లో సున్నం కూడా లేకుండా కొట్టేస్తారు' అంటుంది. దీనికి రేవతి, నందినీ కూడా వంత పాడడంతో దేవ్ ముఖం భయంతో మాడిపోతుంది.
నిర్దోషి అని నిరూపిస్తానని: మురారి వెళ్తుంటే ముకుంద అడ్డు వస్తుంది. దీంతో తప్పుకో అంటాడు. దీనికామె అడ్డు తప్పుకోవాల్సింది కృష్ణ అంటుంది. అప్పుడు మురారి 'కృష్ణ ఇలా అడ్డు రాదు' అంటాడు. ఆ సమయంలో ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు. దీంతో ముకుంద.. కృష్ణ చిన్నాన టాపిక్ తీసుకురాగా.. అతడు నిర్దోషి అని నిరూపిస్తానని మురారి అంటాడు. అప్పుడామె 'చట్టం చేతుల్లోకి తీసుకుని అతన్ని నిర్దోషిని చేయాలని చూస్తున్నావా? ఇంత చీప్‌గా ఎలా' అంటుంది. దీంతో మురారికి కోపం వచ్చి ఫైర్ అవుతాడు.
నేనేదీ మర్చిపోలేదు అని: ఆ తర్వాత ముకుంద 'అసలు నీకు మాటలో నిలకడ లేదు. నన్ను ప్రేమించాను అన్నావు.. కృష్ణ కనిపించగానే ఫ్యామిలీ గౌరవం అని కట్టుకథ చెప్పి తనని పెళ్లి చేసుకున్నావు. నన్ను వెర్రిదాన్ని చేశావు' అంటుంది. దీంతో మురారి 'అవును వెర్రిదానివే. పెళ్ళైన వాడి వెనుక పడుతున్నావు' అంటాడు. దీనికామె షటప్ అనగా 'దీని వెనుక ఎవరు చెప్తే చేశానో మర్చిపోయావా? నేనేది మర్చిపోలేదు. తండ్రి చనిపోయి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నువ్వు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఆదర్శ్‌ను పెళ్లి చేసుకోమని చెప్పా. నువ్వు రాజీ పడతావు అనుకున్నా' అంటాడు.
పెళ్లి ఎందుకు అంటూనే: అనంతరం మురారి 'ఆదర్శ్ అంటే ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అప్పుడే ఎదురు తిరగొచ్చు కదా. నీ వల్ల ఒకడి జీవితం ఎటూ కాకుండా పోయింది. నీ వల్ల ఎంతో ఇష్టంగా పెంచుకున్న కొడుకు దూరం అయ్యాడు. దీనికి కారణం ఎవరు నువ్వు కాదా? నేను అగ్రిమెంట్ అని మొహం మీదే చెప్పాను. నువ్వు ఆదర్శ్‌తో ఇష్టం లేదని నాకు చెప్పావా? లేదు కదా వాడు నిన్ను ఎంత ప్రేమించాడో నీకు తెలియదు. ఇక చాలు ఇలాంటి ఆలోచనలు మానేయ్' అని హెచ్చరిస్తాడు. దీంతో ముకుంద ఎదురు తిరగ్గా కేసు తేలాక చూద్దాం అని సర్ధి చెప్తాడు.
ఆదర్శ్‌ను భర్తగా చూడాలి: ముకుంద మాటలకు మురారి 'నేను ఈ కేసులో గెలవకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. అదే గెలిస్తే ఆదర్శ్‌ను భర్తగా అంగీకరించాలి గుర్తు పెట్టుకో' అని వెళ్ళిపోతాడు. ఆ మాటకి ముకుంద షాక్ అవుతుంది. అనంతరం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. కానీ, భవానీ దేవి మాత్రం రాదు. కృష్ణ వచ్చి ఆమె గురించి అడగ్గా.. కొంతమంది ఉంటే పెద్దత్తయ్య రారాని తెలియదా ఏంటని ముకుంద మాట్లాడుతుంది. అవుతున్న గొడవలు చాలు ఇక సైలెంట్‌గా ఉండమని నందిని అంటుంది. మురారి వచ్చి పెద్దమ్మను తీసుకు వస్తా అని పైకి వెళ్తాడు.
కృష్ణ నిర్ధోసి అని తేలుస్తా: డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న దేవ్ 'ఇంట్లో అందరూ భవానీ మేడమ్ జవదాటరని చెప్పింది కానీ.. ఇక్కడ ఎవరికి వాళ్ళు తగ్గేదెలే అన్నట్టు ఉన్నారు' అని అనుకుంటాడు. తర్వాత మురారితో 'సోమవారం పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ఉంది. ముకుందను కూడా తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నా' అని చెప్తాడు. దీనికి ముకుంద 'దేవ్ శుక్రవారం పెళ్లి పెట్టుకుని నన్ను నీతో రమ్మంటావ్ ఏంటి' అంటుంది. తర్వాత పరిమళ వస్తుంది.. ఆరోజే దోషి ఎవరో తేలుతుంది అంటాడు. అంతేకాదు, కృష్ణ నిర్దోషి అని నిరూపిస్తాను అని కూడా ముకుందతో చెబుతాడు.
భవానీని ఒప్పించిన మురారి: మురారి వచ్చి భోజనానికి రమ్మని పిలవగా.. భవానీ ఆకలి లేదంటుంది. దీంతో మురారి నాకు యాక్సిడెంట్ జరగకముందు ఎలా ఉండేవాళ్ళం చెప్పండని అడగ్గా.. 'అలాంటి రోజులు రావు కదా. ఆలోచించి ఏమి ప్రయోజనం ఉండదు. నీకు గతం గుర్తు లేకపోవడానికి ప్రభాకర్ కారణం అని తెలిసి కోపంతో అతన్ని జైలుకి పంపించాను. కానీ నువ్వు అప్పుడు కూడ కృష్ణ వెనుక తిరుగుతుంటే నీకు గతం గుర్తుకు రాకపోతే బాగుండని అనుకున్నా. వాళ్ళతో నువ్వు ఉండటం నాకు ఇష్టం లేదు నచ్చడం లేదు' అని భవానీ అంటుంది. దీంతో కృష్ణ నిర్దోషి అన్నది నిరూపిస్తానని అంటాడు. తర్వాత భోజనానికి తీసుకొస్తాడు. అంతకు ముందే కృష్ణకు భవానీ పక్కన కూర్చోమని చెప్తాడు. తర్వాత రచ్చ జరుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











