Krishna Mukunda Murari: ఆదర్శ్‌పై ముకుంద ప్రేమ.. నమ్మేసిన మురారి, కృష్ణ.. అసలు విషయం ఏంటంటే!
ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఏం జరిగిందంటే
ధ్వజస్తంభం గంట ఊడిపడడంతో కృష్ణ బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు ముకుంద వాళ్లు వచ్చి 'ధ్వజస్తంభం కాబట్టి గంట ఊడిపోయింది. దాని గురించి ఆలోచించడం అనవసరం. ఇప్పుడు మన బాధ పోయి సంతోషంగా ఉండాలంటే ప్రసాదం తినాలి' అని ఆదర్శ్ కొబ్బరి కాయ కొడతాడు. అంతలోనే అతడి చేయి నలిగిపోతుంది. కానీ, ముకుంద మాత్రం ఏం పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ అతడిని పిలిచి ఆదర్శ్ చేయి నలిగిపోయింది చూడమని చెప్తుంది. వెంటనే ముకుంద ఆదర్శ్ ప్లేస్‌లో మురారి ఉన్నట్టు ఊహిస్తుంది.

అప్పుడు మురారి అనుకుంటూ 'చూసుకోవాలి కదా.. చూడు ఎలా నలిగిపోయిందో. గంట పడిపోయినప్పుడే ఏదో కీడు జరుగుతుందని మనసు శంకించింది' అని బాధపడుతుంది. అప్పుడు మురారి 'ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ల మీద పెద్దమ్మ ఎందుకు డౌట్ పడింది' అంటాడు. అప్పుడే ముకుంద హాస్పిటల్‌కు వెళ్దామా అని ఆదర్శ్‌ను ఆత్రంగా అడుగుతుంది. దీంతో కృష్ణ 'అంత ప్రేమ దాచుకుని బయట పడవే' అని అంటుంది. అప్పుడు ముకుంద తేరుకుని ఆదర్శ్ చేతిని వదిలేస్తుంది. కానీ, కృష్ణ మాత్రం నువ్వే అసలైన మెడిసిన్ అంటుంది.
తనకు గాయం అవగానే ముకుంద చూపించిన ప్రేమను తలుచుకుని ఆదర్శ్ పొంగిపోతూ ఉంటాడు. కారులో వెళ్తుండగా రోడ్డు పక్కన పువ్వులు కనిపిస్తే కృష్ణ ఆపమంటుంది. దీంతో ఎందుకని ముకుంద అడగ్గా.. పువ్వుల కోసం అని చెప్తుంది. దీంతో ఆదర్శ్ కూడా కిందకు దిగుతానని అంటాడు. దీంతో మురారి వాళ్లు వద్దనగా.. 'మీ లేడీస్‌ను మీరు చూసుకుంటే సరిపోతుందా? మా లేడీస్‌ను కూడా మేము చూసుకుంటాం' అని అంటాడు. దీంతో మురారి వాళ్లు 'అబ్బా నీకు వేలు నలిగింది కదా వద్దులే కూర్చో' అని వెళ్లిపోతారు.
ఆదర్శ్ మాటలతో ముకుంద మరింత టెన్షన్ పడుతుంది. అంతలోనే పువ్వులు తీసుకు వచ్చిన కృష్ణ వాటిని ఆదర్శ్ చేతిలో ఉంచి ముకుందకు పెట్టమని చెప్తుంది. దీంతో అతడు రోడ్డు మీద ఎందుకు అనగా.. పెట్టాల్సిందే అని పట్టుబడుతుంది. అప్పుడు అతడు పువ్వులు పెడుతుండగా.. ముకుంద వద్దు నేనే పెట్టుకుంటా అంటుంది. దీంతో ఏమైందని కృష్ణ అడగ్గా.. 'తనకు ఇబ్బందిగా ఉంటే వద్దులే. నాకేం ఇబ్బంది మీకు ఇబ్బంది అవుతుందేమో చేతికి దెబ్బ తగిలింది కదా' అని కవర్ చేస్తుంది. దీంతో మొగుడును బాగా చూసుకుంటున్నావని కృష్ణ అంటుంది.
ఆ తర్వాత ముకుంద 'నా జీవితంలో ఉండాలన్నా.. నా జడలో పూలు పెట్టాలన్నా.. అది నువ్వే కావాలి మురారి. అలాగని ఇప్పుడు కాదని తప్పించుకోలేను. నిన్ను ఊహించుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు' అని మనసులో అనుకుంటుంది. ఆదర్శ్‌కు బదులు మురారి అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటుంది. అప్పుడు అతడు తలలో పూలు పెడతాడు. దీంతో ఈ సీన్ పెద్దత్తయ్య చూస్తే బాగుండేదని కృష్ణ అంటే చూడక్కర్లేదు విషయం తెలిస్తే చాలు అని మురారి అంటాడు. తర్వాత మురారి సంతోషంగా కృష్ణ తలలో పూలు పెడతాడు.

గుడి నుంచి అందరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్తారు. అందరూ ఏం తింటారని కృష్ణ హడావుడి చేస్తుంది. అప్పుడు ముకుంద ఏం తింటే ఆదర్శ్ కూడా అదే తింటాడని మురారి అంటాడు. దీనికి ముకుంద 'మనకు ఇష్టమైన వాళ్లు ఏం తినాలని అంటే అదే ఇష్టంగా తింటాం' అని మురారి అడుగుతాడు. ముకుంద మాత్రం అడిగింది మురారిగా ఊహించుకుని అవును మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది. తర్వాత రెస్టారెంట్‌లో పని చేసే వ్యక్తి వచ్చి మురారిని పలకరించి ముకుంద వైపు చూపించి మేడమ్ అనబోతుంటే కృష్ణ ఆపుతుంది. ఏసీపీ సర్ మేడమ్‌ను నేనే అంటుంది.
వెయిటర్ మాటలకు ముకుంద 'అతడికి కూడా నేను మురారి జంటగా కనిపిస్తున్నాం. మరి భగవంతుడికి ఎందుకు జంటగా చేయలేదు? అసలు ఆదర్శ్ నన్ను ఎందుకు ప్రేమించాలి? ఆదర్శ్ మురారి బ్రదర్స్ ఎందుకు అవాలి? తన కోసం మురారి నన్ను ఎందుకు త్యాగం చేయాలి? నాకు ఇచ్చిన మాట పక్కన పెట్టి కృష్ణను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు మాకు కృష్ణ కదా అడ్డు. లేదంటే మమ్మల్ని ఆపే వాళ్లు ఎవరు? ఇప్పుడు ఆ అడ్డం కూడా తొలగించలేని పరిస్థితి ఏర్పడింది' అని మనసులో అనుకుంటుంది.
ఫుడ్ వచ్చిన తర్వాత ఆదర్శ్ చేతికి దెబ్బ తగలడం వల్ల తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీంతో మురారి తినిపించనా అని అడుగుతాడు. నువ్వు కాదు పెళ్ళాం తినిపించాలని కృష్ణ అంటుంది. ముకుందను తినిపించమని చెప్తుంది. దీంతో ముకుంద ప్రతిసారి ఎందుకు మనసుకి నచ్చని పనులు చేసేలా చేస్తావని దేవుడిని తిట్టుకుంటుంది. ఆ తర్వాత ఆదర్శ్‌ను మురారిగా ఊహించుకుని తినిపిస్తుంది.
అనంతరం ముకుంద 'నన్ను క్షమించు ఆదర్శ్. నాకు మురారి మీద ఉన్న ప్రేమ అంతా నీ మీద ఉన్నట్టు భ్రమ కల్పిస్తున్నాను. నిన్ను దారుణంగా మోసం చేస్తున్నాను' అని మనసులో బాధపడుతుంది. కానీ, ఆమె ప్రేమగానే తినిపిస్తుందని అనుకుని కృష్ణ, మురారి సంతోషిస్తారు. అప్పుడు కృష్ణ 'వీళ్లను ఇక టెస్ట్ చేయాలసిన అవసరం లేదు. పెద్దత్తయ్యకు మనమే అర్థం అయ్యేలా చెప్పాలి' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.
శనివారం ఎపిసోడ్‌లో ఇలా
రెస్టారెంట్‌లో ఫుడ్ తింటుండగా ముకుందను ఆపిన కృష్ణ.. ఆదర్శ్ ప్లేట్‌లోనే తినమని అంటుంది. అప్పుడామె ఇబ్బంది పడుతుండగా.. ఆదర్శ్ కవర్ చేస్తూ తన ప్లేట్‌లోనే తినమని కవర్ చేస్తాడు. తర్వాత కృష్ణ పెట్టిన పువ్వులు వాడిపోవడంతో ఇంకాస్త భయపడుతుంది. దీంతో మురారి వచ్చి ఆమెకు ధైర్యం చెప్తాడు. అనంతరం వాళ్లిద్దరూ కలిసి ముకుంద, ఆదర్శ్ మారిపోయినట్లు భవానీ ముందు నిరూపించాలని అనుకుంటారు. అంతేకాదు, వాళ్లు అన్యోన్యంగా ఉన్నట్లు నిరూపించేలా గేమ్స్ ఆడించాలని అనుకుంటారు.
రూమ్‌లో ఒంటరిగా ఉన్న ముకుంద ఆదర్శ్‌కు ఫుడ్ తినిపించిందని ఊహించుకుని బాధపడుతుంది. నిజం చెప్పేస్తే ఇంట్లో స్థానం లేకుండా పోతుందేమో అని భయపడుతుంది. అంతలోనే ఆదర్శ్ వచ్చి నన్ను క్షమించావు కదా అంటాడు. అనంతరం ఆమెపై ప్రేమను వ్యక్తం చేస్తూ మాట్లాడతాడు. కానీ, ముకుంద మాత్రం అతడితో ఇబ్బందిగానే ఉంటుంది.
ఆ తర్వాత ముకుంద, ఆదర్శ్ బంధాన్ని బయటపెట్టేందుకు మధుకర్ మరోసారి మందు పార్టీ ఏర్పాటు చేస్తాడు. కానీ, ఆదర్శ్ తాగడానికి ఇబ్బంది పడుతుంటాడు. చివరికి ఎలాగైనా అతడిని ఒప్పించి తాగేందుకు కూర్చోబెడతారు. అప్పుడు 'బయటకు వెళ్లినప్పుడు కారులో ఎవరు ఎక్కడ కూర్చున్నారు? నిజంగానే నీకు దెబ్బ తగిలింగా? ముకుంద నిజంగానే నీకు తినిపించిందా' అని అడుగుతాడు. దీంతో మురారి, ఆదర్శ్ కలిసి మధుకు ఫుల్లుగా మందు తాగిపిస్తారు.
అనంతరం మగవాళ్లంతా మందు తాగుతున్నారని నందినీ అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో ముకుంద, కృష్ణ తమ భర్తలు తాగరని అంటారు. అప్పుడు నందినీ వాళ్లు ఎక్కడ ఉన్నారో వెతకాలని అంటుంది. అంతలోనే మురారి, ఆదర్శ్ తాగి వస్తుంటారు. ఇక, వాళ్లు తాగారో లేదో టెస్ట్ చేసేందుకు కృష్ణ ఊదమంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











