Krishna Mukunda Murari: కృష్ణ ఉంగరం మాయం.. బయటపడ్డ ముకుంద నిజస్వరూపం.. రసవత్తరంగా నేటి ఎపిసోడ్

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శనివారం ఏం జరిగిందంటే:రెస్టారెంట్‌లో ఫుడ్ తింటుండగా ముకుందను ఆపిన కృష్ణ.. ఆదర్శ్ ప్లేట్‌లోనే తినమని అంటుంది. అప్పుడామె ఇబ్బంది పడుతుండగా.. ఆదర్శ్ కవర్ చేస్తాడు. తర్వాత కృష్ణ పెట్టిన పువ్వులు వాడిపోవడంతో ఇంకాస్త భయపడుతుంది. దీంతో మురారి వచ్చి ఆమెకు ధైర్యం చెప్తాడు. ముకుంద, ఆదర్శ్ బంధాన్ని బయటపెట్టేందుకు మధుకర్ మరోసారి మందు పార్టీ ఏర్పాటు చేస్తాడు. అతడు ఆదర్శ్‌ను ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. దీంతో మురారి, ఆదర్శ్ కలిసి మధుకు ఫుల్లుగా మందు తాగిపిస్తారు. అనంతరం మురారి, ఆదర్శ్‌కు కృష్ణ డ్రంక్ టెస్ట్ చేస్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode February 12th

థ్రిల్ ఫీలయ్యేలా కాన్సెప్టు:మురారి వాళ్లు మందు తాగారో లేదో టెస్ట్ చేసేందుకు కృష్ణ వాళ్లు ప్రయత్నిస్తారు. కానీ, అతడు మాత్రం పోలీసు తెలివి చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నందినీ.. మధు వస్తే తెలుస్తుందని అంటుంది. దీంతో మురారి 'మధు రాలేని పరిస్థితిలో ఉన్నాడు. వాలెంటైన్స్ డే పనుల మీద పంపించాం' అని అబద్దం చెప్తాడు. అప్పుడు ముకుంద 'వాలెంటైన్స్ డే కాన్సెప్ట్ ఏంటి? ఎవరు పార్టిసిపెట్ చేస్తున్నారు' అని అడుగుతుంది. దీనికి కృష్ణ 'కాన్సెప్ట్ సర్‌ప్రైజ్. రేపటి వరకు ఓపిక పట్టాల్సిందే. మా సర్‌ప్రైజ్‌కు థ్రిల్ అవుతారు' అని చెప్తుంది.

ముకుందలో కొత్త టెన్షన్:కృష్ణ చెప్పిన దానికి ముకుంద టెన్షణ్ పడుతుంది. దీంతో కృష్ణ 'ముకుంద నువ్వేం టెన్షన్ పడకు. రేపు మేము ఇచ్చే సర్‌ప్రైజ్ మీ ప్రేమకు పరీక్ష అనుకో. అందులో మీరిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతారు. మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది' అని అంటుంది. దీనికి రేవతి 'అది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్? మీకే ఫస్ట్ ప్రైజ్ రావచ్చు ఏమో కదా' అంటుంది. దీంతో కృష్ణ 'మాది ఏముంది.. పాత జంట. ముకుంద వాళ్లది కొత్త జంట. వాళ్ల ప్రేమకు, అన్యోన్యతకు పెద్దత్తయ్య ఫ్లాట్ అయిపోతుంది' అని చెప్తుంది. దీంతో ముకుంద సర్‌ప్రైజ్ ఏముంటుందా అని ఆలోచనలోపడుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode February 12th

ఆదర్శ్‌ను అడగడంతో:గదిలోకి వచ్చిన తర్వాత ముకుంద 'సర్‌ప్రైజ్ అంటుంది మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో.. ఎందులో ఇరికిస్తుందో.. ప్రేమకు పరీక్ష అంటుంది అంటే ఆదర్శ్‌తో క్లోజ్‌గా ఉండాలి. ఇందులో నుంచి ఎలాగైన తప్పించుకోవాలి. కృష్ణ ఏం చేయబోతుందో తెలుసుకోవాలి' అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్ వస్తే కృష్ణ ప్లాన్ చేసిన సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా? మురారి ఏం చెప్పలేదా అని అడుగుతుంది. దీనికతడు 'మురారిని అడిగితే సస్పెన్స్ అంటున్నాడు. అయినా అదేంటో రేపు ఫంక్షన్లో తెలిసిపోతుంది కదా ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు' అంటాడు.

ప్రేమనే గెలిపిస్తుందని:ఆదర్శ్ మాటలకు ముకుంద 'టెన్షన్ ఏం లేదు.. తెలిస్తే ప్రిపేర్ అవ్వచ్చు కదా' అని కవర్ చేస్తుంది. అప్పుడు ఆదర్శ్ 'మనమే గెలుస్తామని కృష్ణ అంటుంది కదా. తనకు మన మీద ఉన్న నమ్మకం మనకు మన మీద ఉండకపోతే ఎలా? నీ మీద నాకు అంతులేని ప్రేమ ఉంది. నీకు కూడా నా మీద ప్రేమ ఉంది. అది ఈరోజు తెలిసింది కదా. మన మధ్య ఉన్న ప్రేమ నిజమైతే అదే మనలని గెలిపిస్తుంది' అని చెప్తాడు. దీంతో ముకుంద 'ఆ ప్రేమ నిజమయితే కదా గెలవడానికి. కాదు కాబట్టి ఒడిపోతాం. అప్పుడు అందరికీ నామీద అనుమానం వస్తుంది' అనుకుంటుంది.

భర్త స్థానంలో మురారి:ఆ తర్వాత ఆదర్శ్ 'ఏం ఆలోచిస్తున్నావ్ ముకుంద? మన ప్రేమ నిజం అయినప్పుడు మన ప్రేమ మనల్ని గెలిపిస్తుందా లేదా' అని అడుగుతాడు. దీంతో ముకుంద అవును అంటుంది. కానీ మనసులో 'ఏం జరిగినా ఫేస్ చేయాల్సిందే. తప్పించుకునే దారి లేదు. ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకోవడమే' అనుకుంటుంది. మరోవైపు మురారి చాప నేల మీద వేసుకుని పడుకోబోతుంటే కృష్ణ వచ్చి వద్దని సీరియస్ అవుతుంది. తనని రెచ్చగొట్టదని కాసేపు యాక్టింగ్ చేస్తుంది. అనంతరం వెళ్లి మురారి కాళ్ళ మీద పడుతుంది. దీంతో అతడు హగ్ చేసుకుంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode February 12th

మాయమైన ఉంగరం:అందరూ ఫోన్లు చూస్తూ బిజీగా ఉన్నప్పుడు మధు వచ్చి 'వాలెంటైన్స్ డే కదా సెలెబ్రేషన్స్ ఉన్నాయన్నారు. ఆ సందడి లేదు. కనీసం ఒకరికొకరు ఐలవ్యూ అయినా చెప్పుకున్నారా' అని అడుగుతాడు. అంతలోనే కృష్ణ కాఫీ పట్టుకుని వస్తుంది. అప్పుడు నందిని కృష్ణ చేతిని చూసి రింగ్ ఏదని అడుగుతుంది. తన చేతికి రింగ్ లేకపోవడం చూసిన కృష్ణ భయపడుతుంది. చివరి సారిగా ఎప్పుడు చేతికి చూసుకున్నావని ముకుంద అడుగుతుంది. పొద్దున చూసుకున్నప్పుడు ఉన్నాను ఉంది ముగ్గు వేశాను ఆ తర్వాత ఏ పని చేయలేదని అంటుంది.

ముకుందలో ఆశలు:కృష్ణ ఉంగరం పోవడంతో అందరూ వెతుకుతారు. అప్పుడు కృష్ణ ఏడుస్తుండగా మురారి ధైర్యం చెప్తాడు. అంతలో ముకుంద 'మురారికి కృష్ణ వేలికి తొడగమని నేనే కదా ఇచ్చాను. అది ప్రేమికుల రోజు చేజారిపోయింది అంటే.. నేను నా ప్రేమ మీద ఆశలు పెంచుకోవచ్చని అర్థమా? మురారి కృష్ణకు చెందిన వాడు కాదు నావాడు అని అనుకోవాలా? ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయ్ ఏంటి? కృష్ణకు నావల్ల అన్యాయం జరగకూడదు' అనుకుంటుంది. తర్వాత ఆమెను అంతా ఓదార్చుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X