Krishna Mukunda Murari: ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ, మురారి.. మారిపోయిన ముకుంద.. భవానీ కనిపించకపోవడంతో!

ఇండియా వ్యాప్తంగా ఎన్నో భాషల్లో వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మురారితో తీసుకున్న ఫొటో, ఆదర్శ్ ముఖం మడతపెట్టి ఉన్న ఫొటోలు ముకుంద కబోర్డులో ఉంటాయి. వాటిని ఆదర్శ్ చూసి ఆమెపై అనుమానపడతాడు. తర్వాత మురారి, కృష్ణ డెకరేషన్ చేస్తుంటారు. అప్పుడు తన ఉంగరం పోవడం గుర్తు చేసుకుని కృష్ణ బాధ పడగా మురారి ఓదార్చుతాడు. తర్వాత ఆమెకు మురారి ప్రపోజ్ చేస్తాడు. ఫొటో దిగడానికి జంటలను రమ్మంటే ముకుంద వద్దంటుంది. దీంతో మధు రెచ్చగొట్టగా ఒప్పుకుంటుంది. కానీ, ఆదర్శ్ కనిపించకపోవడంతో ఫొటోలు చూశాడేమో అనుకుంటుంది. మధు వెళ్లి ఆదర్శ్‌ను ప్రశ్నించగా కోప్పడతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode February 14th

ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ, మురారి:భవానీ దేవి ఇంట్లో వాలెంటైన్స్ డే కాంపిటీషన్ మొదలు అవుతుంది. అప్పుడు ముకుంద 'ఆదర్శ్ ఫోటోలు చూసే ఉంటాడు. అందుకే ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు' అని భయపడుతుంది. తర్వాత నందినీ ఇంతకీ సర్‌ప్రైజ్ ఏంటని అడగ్గా.. కృష్ణ, మురారి 'అదేంటో మాకు కూడా తెలియదు. అవును మొత్తం కాన్సెప్ట్ మధు చెప్తాడు' అనే సరికి అంతా షాక్ అవుతారు. అప్పుడు మధు 'నా టాలెంట్ చూపించడానికి టైమ్ వచ్చింది' అంటాడు. దీనికి ఆదర్శ్ ముందు కాన్సెప్ట్ ఏంటో చెప్పమంటే.. ఇప్పుడే చెప్తే ఏముంది అప్పటికప్పుడు చెప్తాను అంటాడు.

రొమాంటిక్ డ్యాన్స్‌తో టెన్షన్:ఆ తర్వాత మధు 'ప్రోగ్రామ్‌లో ముందుగా డ్యాన్స్ చేయాలి. ఏ పాటకు చేస్తారు' అని కృష్ణ వాళ్లను అడిగితే జలజల పాతం పాట అని చెప్తారు. అయితే ఈ పాటకు ఆదర్శ్ వాళ్లు డాన్స్ చేస్తారని మధు చెప్పడంతో ముకుంద టెన్షన్ పడుతుంది. దీంతో అదేంటి కృష్ణ వాళ్ళు డాన్స్ చేస్తామని అన్నారు కదా అంటే.. మధు 'ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తే ఏం బాగుంటుంది? పక్కన వాళ్లు చేస్తేనే రొమాంటిక్‌గా ఉంటుంది' అంటాడు. అప్పుడు ముకుంద 'డ్యాన్స్ అనుకుంటే మళ్ళీ రొమాంటిక్ డ్యాన్స్ చేయాలా' అని టెన్షన్ పడగ.. మధు ఆమె దొరుకుతుందని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode February 14th

క్షమించు ఆదర్శ్ అంటూనే:ముకుంద, ఆదర్శ్ డ్యాన్స్ చేస్తుంటారు. అప్పుడు ఆమె ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకుని ఇరగదీస్తుంది. దీంతో వాళ్లను చూసి మధు షాక్ అవుతాడు. అంతేకాదు, 'ఆదర్శ్ అంటే ఇష్టం లేదు సరిగా డ్యాన్స్ చేయదని అనుకుంటే ఇంత బాగా చేసింది ఏంటి' అనుకుంటాడు. ముకుంద మాత్రం 'నన్ను క్షమించు ఆదర్శ్. నువ్వు నాతో కలిసి డ్యాన్స్ చేశావేమో కానీ.. నేను ప్రతి క్షణం మురారిని తలుచుకుంటూ చేశా' అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత మధు 'ఇప్పుడు ముకుంద సెలెక్ట్ చేసే సాంగ్‌కు కృష్ణ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు' అని చెప్తాడు.

అనుమానం పోతుంది అని:మధు అడగ్గానే ముకుంద.. కృష్ణ వాళ్లకు రొమాంటిక్ సాంగ్ వద్దని మామూలు పాట చెప్తుంది. కానీ, మధు మాత్రం రొమాంటిక్‌దే సెలెక్ట్ చేస్తాడు. అలాగే, 'భర్త తాగి ఇంటికి వస్తే భార్య ఎలా స్పందిస్తుందో చేయాలి' అని చెప్తాడు. దీంతో మురారి 'మందు తాగినట్టు యాక్ట్ చేయడం కష్టం' అనగా 'అంత వద్దు ఇక్కడ మీ గురించి అందరికీ తెలుసులే అని మధు అంటాడు. ఇక ముందుగా ముకుంద వాళ్ళను పర్ఫామెన్స్ చేయమని చెప్తాడు. 'డ్యాన్స్ అంటే ఎలాగో చేశాను. ఇప్పుడు ఇది చేస్తే అత్తయ్యకు నామీద ఉన్న అనుమానం పోతుంది' అనుకుంటుంది.

వాళ్లను మెచ్చుకున్న మధు:కాన్సెప్టు ప్రకారం ఆదర్శ్ తాగి వచ్చినట్టు నటిస్తాడు. ముక్కు బంగారం అని పిలుస్తూ యాక్టింగ్ చేస్తాడు. అప్పుడు ముకుంద 'మీకు తాగాలని ఉంటే ఇంట్లోనే తాగమని చెప్పాను కదా. మీకోసం ఇంట్లోనే మందు తెచ్చి పెట్టాను' అంటుంది. దీంతో ఆదర్శ్ 'ఇంత అందంగా ఎలా పుట్టావ్ ముక్కు బంగారం' అనడంతో ఏం కావాలి అంటుంది. అప్పుడు ఆదర్శ్ 'ఇంట్లో మందు ఉందని అన్నావ్ కదా. అది కాస్త ఇస్తావా' అంటే ఆమె తెచ్చినట్లు అతడు తాగినట్లు యాక్ట్ చేస్తాడు. అప్పుడు మధు 'ఇలా అర్థం చేసుకునే భార్యలు ఉంటే గొడవలే ఉండవు' అని మెచ్చుకుంటాడు.

Krishna Mukunda Murari Serial Today Episode February 14th

కృష్ణ, మురారి మరోలా చేసి:మురారి, కృష్ణ వంతు వస్తుంది. మురారి తాగి వచ్చినట్టు నటిస్తాడు. మురారి తూలి పడబోతుంటే కృష్ణ పట్టుకున్నట్టే పట్టుకుని వెంటనే వదిలేస్తుంది. ఆ వెంటనే 'ఇంట్లో నుంచి గెంటేయలేదు సంతోషించు' అని అంటుంది. తర్వాత అన్నం పెట్టమని అడిగితే తినేశానని చెప్తుంది. అలా ఇద్దరూ చాలా ఫన్నీగా నటిస్తుంటారు. తర్వాత మురారి 'ఎవరైనా మొగుడు తాగి వస్తే తిండి పెట్టి పడుకోబెడతారు. నువ్వు ఏంటే ఇలా ఉన్నావు' అని అంటాడు. దీంతో కృష్ణ మందు తాగి వస్తే ఇలాగే ఉంటుందని కౌంటర్ ఇస్తుంది. దీంతో మురారి ఆకలేస్తుంది బతిమలాడతాడు.

భవానీనే నిర్ణయించాలని:మురారి మాటలకు కృష్ణ 'ఏం కాదులే మీకు బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ లేదు' అనేస్తుంది. దీంతో మురారి 'ఇలా టార్చర్ పెడితే ఎవడూ జన్మలో మందు తాగడు' అంటాడు. ఇలా టాస్క్ ముగిసిన వెంటనే అందరూ సూపర్‌గా ఉందని మెచ్చుకుంటారు. కానీ మధు మాత్రం 'ఎవరు బాగా చేశారో డిసైడ్ చేయాల్సింది పెద్ద పెద్దమ్మ' అంటాడు. కానీ, భవానీ దేవి మాత్రం అక్కడ కనిపించదు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X