Krishna Mukunda Murari: షాకింగ్ న్యూస్ చెప్పిన భవానీ.. ముకుంద మంచిది కాదని.. కథలో ఫుల్ ట్విస్టులు
చాలా భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:వాలెంటైన్స్ డే కాంపిటీషన్ మొదలైన తర్వాత సర్‌ప్రైజ్ ఏంటా అని అంతా ఆసక్తిగా చూస్తారు. అప్పుడు మురారి, కృష్ణ అదేంటో మధు చెప్తాడని ట్విస్ట్ ఇస్తారు. అనంతరం మధు వచ్చి తనకు నచ్చినట్లు ఆటలు ఆడిస్తాడు. ముకుంద నిజస్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశ్యంతో టాస్కులు ఇస్తాడు. కానీ, ఆమె మాత్రం ఆదర్శ్‌ను మురారిగా ఊహించుకుని అన్నీ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి కూడా సక్సెస్‌ఫుల్‌గా టాస్కులు కంప్లీట్ చేసుకుంటారు. ఎవరు గెలిచారో చెప్పే బాధ్యత భవానీదే అని అంటారు. కానీ, ఆమె మాత్రం ఇంట్లో కనిపించదు.

విజేతను ప్రకటించిన భవానీ:కృష్ణ వాళ్లు చేసిన టాస్కును అందరూ మెచ్చుకుంటారు. అప్పుడు నందినీ మాత్రం తాగి వచ్చినంత మాత్రాన ఇలా చేస్తారా? అది కరెక్ట్ కాదు అంటుంది. దీంతో మధు 'అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు పెద్ద పెద్దమ్మ' అంటాడు. అప్పుడే భవానీ గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వస్తుంది. తర్వాత ఆమె ఇద్దరు కొడుకుల్ని బాగా చేశారని మెచ్చుకుంటుంది. కానీ, బెస్ట్ కపుల్ కృష్ణ, మురారి అని అనౌన్స్ చేసి గిఫ్ట్ వాళ్ళకు ఇస్తుంది. తర్వాత 'ఏయ్ తింగరి నువ్వు ఇలాగే తింగరి వేషాలు వేస్తూ మీ ఇద్దరూ కలకాలం కలిసి ఉండాలి' అని దీవిస్తుంది.
షాకింగ్ న్యూస్ చెప్పిన తల్లి:మురారి వాళ్లకు అందరూ కంగ్రాట్స్ చెప్తారు. అప్పుడు ఆదర్శ్ ఫీల్ అయ్యావా అని ముకుందను అడగ్గా.. 'అలా ఏం లేదు ఎవరికి ఇస్తే ఏంటి' అని అంటుంది. కానీ మనసులో మాత్రం 'నాకు తెలుసు. అత్తయ్యకు అంత త్వరగా నా మీద ఇంప్రెషన్ పోదని' అనుకుంటుంది. అప్పుడు భవానీ 'అందరికీ ఒక సీరియస్ విషయం చెప్పాలి' అంటుంది. దీంతో ముకుంద తన గురించి చెప్తారేమోనని టెన్షన్ పడుతుంది. కానీ భవానీ తాను అమెరికా వెళ్తున్నట్టు చెప్తుంది. దీంతో కృష్ణ 'ఇంత సడెన్‌గా ఎందుకు? ఎప్పుడు బయల్దేరుతున్నారు' అనగా.. రేపే అని చెబుతుంది.
మురారికి పోస్టింగ్ ఇస్తారని:ఆ తర్వాత భవానీ 'ఈ విషయం ముందే చెప్పాలని అనుకున్నా కానీ.. నా గురించి ఆలోచించి మీరు ప్రోగ్రామ్ మీద దృష్టి పెట్టరని చెప్పలేదు. ఇక అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఏం చేయాలో చెప్తాను అప్పుడు చేద్దువులే ఆదర్శ్. మురారికి పై అధికారులతో మాట్లాడాను. వన్ వీక్‌లో పోస్టింగ్ వస్తుంది. కృష్ణ మీ చిన్నాన్నతో మాట్లాడాను. వన్ వీక్‌లో వస్తారు. రాగానే హాస్పిటల్ పనులు చూసుకోమని చెప్పాను. నువ్వు కూడా చూసుకో. నేను ఉండటం లేదు కదా. నా స్థానంలో ఇక నుంచి నువ్వు ఉండాలి' అని రేవతికి చెప్తుంది. అప్పుడు ముకుంద నాకేం చెప్పరా అంటుంది.

ముకుందకు భవానీ షాక్:ముకుంద అడగ్గానే భవానీ 'నీకు చెప్పేది ఏముంది? నువ్వు మారడం నిజమే కదా. ఇన్నాళ్ళూ ఆదర్శ్ కోసం ఎదురుచూడటం నిజమే కదా. అయితే వాడితో హ్యాపీగా ఉండు. నేను చేయాల్సింది చేశాను కదా. ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది? ఏం చేయాలన్నా చెప్పాలన్నా ఇక మీరు మీరు చూసుకోండి' అని చెప్తుంది. దీంతో ముకుంద మొహం మాడిపోతుంది. తర్వాత కృష్ణ మాత్రం పరుగున వెళ్లి భవానీని హగ్ చేసుకుని బాధ పడుతుంది. అనంతరం భవానీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో మిగిలిన వాళ్లు కూడా తమ తమ గదుల్లోకి వెళ్లిపోతారు.
రేవతిపై కోప్పడిన కృష్ణ:ముకుంద వాళ్లు మంచిగా చేసినా తమకు గిఫ్ట్ రావడంతో కృష్ణ, మురారి కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రేవతి అక్కడకు వస్తుంది. అప్పుడామె కూడా వాళ్లను పొగడడంతో కృష్ణ 'కొడుకు కోడల్ని చూసి మురిసిపోవడం తప్ప వేరే పని లేదా అత్తయ్య? ముకుంద వాళ్ళు అంత బాగా చేసినా కూడా వాళ్లకు ఇవ్వకుండా మాకు ఇచ్చారు. ముకుంద మీద కోపంతో నాకు ఇచ్చారని మేము అనుకుంటుంటే మీరు బాగా జరిగిందని అంటారు ఏంటి' అని అడుగుతుంది. దీంతో రేవతి వాళ్లకు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది.
ముకుంద మంచిది కాదు:రేవతి 'నీ మొహం మీరు బాగా చేశారు కాబట్టి ఇచ్చింది. మీ పెద్దమ్మ అంత పిచ్చిది ఏం కాదు. నువ్వు భార్యగా బాగా నటించావని ఇచ్చింది' అంటుంది. అప్పుడు కృష్ణ 'నేను తాగొచ్చిన భర్తను బయటే పడుకోబెట్టాను కానీ.. ముకుంద ఇంట్లో కూర్చోబెట్టి మందు పోసి అన్నం కూడా తినిపించింది కదా. తాను మంచి భార్య కదా' అని అడుగుతుంది. దీనికి రేవతి 'మంచితనం అంటే తప్పును ప్రోత్సహించడం కాదు. ముకుంద భర్తకు ఇంట్లోనే మందు పోసింది. కానీ, నువ్వు అలవాటు మాన్పించే ప్రయత్నం చేశావు. అక్కకు ఇదే నచ్చింది' అని వివరిస్తుంది.

కశ్మీర్ వెళ్లిపోదాం అంటూ:ముకుందతో సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఆదర్శ్ ఆనందిస్తూ ఉంటాడు. అంతలోనే ఆమె వస్తుంది. అప్పుడామెతో ఆదర్శ్ 'ఇందాక స్కిట్ లో చేసింది నిజం చేయవా నీ చేత్తో మందు పోస్తే తాగాలని ఉంది' అంటాడు. దీనికామె 'అత్తయ్య మెప్పు కోసం మురారిని ఊహించుకుని అలా నటించాను కానీ ఈయన అందులో ప్రేమ వెతుక్కున్నారు. ఇప్పటికే ఒకసారి నావల్ల మనసు గాయపడి ఇంటికి దూరం అయ్యారు. ఇప్పుడు ఇది నిజం కాదని తెలిస్తే ఏమైపోతారో' అనుకుంటుంది. తర్వాత అతడు పిలిచి కశ్మీర్ వెళ్లిపోదాం అంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











