Krishna Mukunda Murari: నిజం చెప్పాలని ముకుంద డిసైడ్.. సర్‌ప్రైజ్ చేసిన భవానీ.. లెటర్ చూసి ఎమోషనల్
ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే: వాలెంటైన్స్ డే కాంపిటీషన్‌లో ఎవరు గెలిచారన్న దానిపై ఉత్కంఠ ఉన్నప్పుడు భవానీ వచ్చి.. కృష్ణ, మురారి విజయం సాధించారని చెప్తుంది. అంతేకాదు, వాళ్లకు ఓ గిఫ్టును కూడా ఇస్తుంది. అనంతరం తాను అమెరికాకు వెళ్లిపోతున్నట్లు ఇంట్లో వాళ్లకు చెప్తుంది. అంతేకాదు, అందరికీ కొన్ని గుడ్ న్యూస్‌లు చెప్తుంది. కానీ, ముకుందకు చెప్పకపోవడంతో ఆమె నిరాశ చెందుతుంది. తర్వాత కృష్ణ వాళ్లు తమకు ప్రైజ్ ఇవ్వడంపై నిరాశగా ఉండగా రేవతి వచ్చి సర్ధి చెప్తుంది. ఇక, ముకుందతో కశ్మీర్‌కు వెళ్లిపోదాం అని ఆదర్శ్ అనడంతో ఆమె మాత్రం ఒప్పుకోదు.

స్వర్గం అయిన వద్దు అంటూ: ముకుందతో ఆదర్శ్ ఇద్దరం కశ్మీర్ వెళ్లిపోదామని అడుగుతాడు. దీనికామె ఎందుకు అంటుంది. దీంతో ఆదర్శ్ 'అక్కడి వాతావరణంలో మనం ఇద్దరం గడపాలి. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నువ్వు అక్కడికి రావాలి. ఆ అందాలు, ప్రశాంతత చూస్తే అసలు వదిలిపెట్టవు' అని చెప్తాడు. దీనికామె 'నా మురారి ఉన్న చోట నాకు ప్రశాంతత. తను లేని ప్రదేశం స్వర్గం అయినా సరే ప్రశాంతతను ఇవ్వదు' అని మనసులో అనుకుంటుంది. అప్పుడు ముకుంద 'అక్కడ బాగుంటుంది కానీ.. ఇక్కడ ఇంత మంచి ఇల్లు, అయిన వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్తాము' అంటుంది.
ముకుంద నిజం చెప్పాలని: తర్వాత ముకుంద 'మీకు అక్కడ జాబ్ కూడా లేదు కదా. అత్తయ్య వచ్చిన తర్వాత ఇక్కడే ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు' అని చెప్తుంది. దీంతో ఆదర్శ్ 'అదేదో అక్కడ కూడా చేసుకోవచ్చు. మనసుకు నచ్చిన మనిషితో కలిసి బతకడం స్వర్గం. అదే మనిషితో స్వర్గంలాంటి ప్రదేశంలో బతికితే అది మహా స్వర్గం' అంటాడు. దీనికామె 'రోజు రోజుకీ ఈయన నామీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటున్నారు. బయటకి తీసుకెళ్లి నిజం చెప్పాలి' అని ముకుంద డిసైడ్ అవుతుంది.

శోభనం వాయిదా వేయిద్దాం: కృష్ణ తన చిన్నాన్నను కలుద్దామని మురారితో అంటుంది. దీంతో అతడు చూద్దాంలే అనడంతో గొడవ పడుతుంది. దీంతో మురారి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు కృష్ణ 'సరే అయితే మీరు చేయాల్సింది మీరు చేయండి.. నేను చేయాల్సింది నేను చేస్తాను. పెద్దత్తయ్యకు ఫోన్ చేసి ఏదో ఒక కారణం చెప్పి ఇంకొక నెల రోజులు మన శోభనం వాయిదా వేయిస్తాను' అంటుంది. దీంతో మురారి షాక్ అవుతాడు. దీంతో 'అలా మాత్రం చేయొద్దు. ఎప్పుడూ నా దగ్గర గిఫ్ట్ తీసుకోవడమే కానీ ఎప్పుడైనా నాకు గిఫ్ట్ ఇచ్చావా' అనగా త్వరలోనే ఇస్తాను అని సిగ్గు పడుతూ వెళ్లిపోతుంది.
కృష్ణపై కోప్పడిన రేవతి: అందరూ హాల్లో ఉంటే కృష్ణ వాళ్లు వస్తారు. అప్పుడు రేవతి అక్క ఇచ్చిన గిఫ్ట్ ఏంటని అడుగుతుంది. దీంతో కృష్ణ 'చూడలేదు.. ముకుంద వాళ్ళ గురించి ఆలోచిస్తూ మర్చిపోయాం' అని చెప్తుంది. దీంతో రేవతి 'పక్కవాళ్ళ గురించి ఆలోచించడం మానేసి.. కాస్త మీ గురించి ఆలోచించుకోమని నీ పెళ్ళానికి చెప్పు' అంటూ మురారికి కోపంగా చెబుతుంది. తర్వాత కృష్ణ గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చి 'పెద్దత్తయ్య ఈ గిఫ్ట్ మాకు ఇచ్చినా... మనందరికీ ఇచ్చినట్టే' అని ముకుంద వాళ్లతో అంటుంది. దీంతో రేవతి ఇది జన్మలో మారదని తిడుతుంది.

అమ్మైతే చూడాలనుంది:భవానీ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను తీసి చూడగా.. అందులో ఓ చంటి పాప బొమ్మ ఉంటుంది. అది చూసి కృష్ణ ఎమోషనల్ అవుతుంది. అందులో ఉన్న లెటర్‌లో 'తింగరి నీలో ఒక అమ్మ ఉంది. నువ్వు నిజంగా ఒక అమ్మవు అయితే చూడాలని ఉంది. అలాగే నేను వెళ్ళాక ఈ ఇంటికి ఇన్‌ఛార్జ్ నువ్వే నా బాధ్యతలు అన్నీ నువ్వే తీసుకోవాలి. నేను తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉన్న సమస్యలు ఒక అమ్మలా నువ్వే పరిష్కరించాలి' అని రాస్తుంది. దీంతో నందని ఇంతకు అమ్మవి ఎప్పుడు అవుతావని అడుగుతుంది. దీంతో కృష్ణ ఆ గిఫ్ట్ ముకుందకు కూడా అని అంటుంది.
తప్పించుకున్న ముకుంద: కృష్ణ మాటకు ముకుంద 'మళ్ళీ నా దగ్గరకి వచ్చింది. ఇలాగే ఉంటే శోభనం పెట్టి పిల్లలని కనమనేలా ఉన్నారు. వెంటనే ఆదర్శ్‌కు నిజం చెప్పాలి. ఇక్కడ చెప్పడం కష్టం బయటకి ఎక్కడికైనా ప్లాన్ చేయాలి' అని మనసులో అనుకుంటుంది. తర్వాత ముకుంద 'పెద్దత్తయ్య ఇది నీకోసం మాత్రమే తింగరి. ముందు నువ్వే బిడ్డని కనాలి' అని తప్పించుకుంటుంది. దీంతో కృష్ణ 'నన్ను ఇంత ప్రేమగా తింగరి అని పిలిచావ్.. నీలో మార్పుకు ఇదే నిదర్శనం' అని అంటుంది. తర్వాత ముకుంద 'ఆది వచ్చాక ఎటైనా ట్రిప్‌కు వెళ్దాం అనుకుంటున్నా' అంటుంది.
ఆదర్శ్ అలా.. కృష్ణ ఇలా: ముకుంద చెప్పడంతో ఆదర్శ్ 'అందరితో కలిసి బయటకి వెళ్ళడం ఇష్టం లేదు.. డస్ట్ అలర్జీ అన్నది కదా. ఇప్పుడు తనే బయటకి వెళ్దామని ప్రపోజల్ పెట్టింది. ఫోటో విషయంలో నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? ముకుంద మనసులో నిజంగా నాకు చోటు ఉందా' అని మనసులో అనుకుంటాడు. మరోవైపు, భవానీ మాటలను తలచుకుని కృష్ణ మురిసిపోతూ ఉంటుంది. అంతేకాదు, తనకు పెత్తనం అప్పజెప్పడంతో గర్వంగా ఫీల్ అవుతుంది. అప్పుడు మురారి ఆమెతో రొమాంటిక్‌గా మాట్లాడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











