Krishna Mukunda Murari: ముకుంద ముందే రొమాన్స్.. ఆమె బ్యాగ్‌లో ఫొటో.. ఆదర్శ్‌లో మొదలైన అనుమానం

ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:ముకుందను కశ్మీర్ వెళ్లిపోదాం అని ఆదర్శ్ అడుగుతాడు. కానీ, ఆమె మాత్రం మురారికి దూరం అవుతానన్న ఉద్దేశ్యంతో వద్దని అంటుంది. కానీ, ఆదర్శ్ ఆమెపై ప్రేమను వ్యక్త పరుస్తూ ఉండడంతో ఎలాగైనా నిజం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత భవానీ దేవి ఇచ్చిన గిఫ్టును, ఆమె రాసిన లెటర్‌ను చూసి కృష్ణ మురిసిపోతుంది. అయితే, అది తనకు మాత్రమే కాదని, ముకుందకు కూడా అని కృష్ణ అనడంతో రేవతి ఆమెపై సీరియస్ అవుతుంది. కానీ, ముకుంద మాత్రం ఆ లెటర్‌ను కృష్ణ కోసమే రాసిందని చెప్పి తప్పించుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode February 17th

మురారిని తోసేసిన కృష్ణ:కృష్ణను ప్రేమగా దగ్గరకు తీసుకుని మురారి ముద్దు పెట్టుకోబోతాడు. కానీ, అతడిని పక్కకు తోసేస్తుంది. అంతేకాదు, దేనికైనా ముహూర్తం ఉంటుందని చెబుతుంది. దీంతో మురారి 'ఈ ముహూర్తాలు నాకు సెట్ అయ్యేలా లేవు. మనకు శోభనం జరగదు ఏమో' అంటాడు. దీంతో కృష్ణ 'అలా ఏం జరగదు.. వచ్చే ముహూర్తానికి మన శోభనం' అని చెప్తుంది. దీంతో మురారి ఆరోజు ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తాడు.

ఆదర్శ్‌కు నిజం చెప్పాలి:మురారితో గతంలో తీసుకున్న సెల్ఫీలను చూసుకుంటూ ముకుంద మురిసిపోతుంటుంది. అప్పుడామె 'ఎలాగైనా నిజం చెప్పేస్తాను. ఆదర్శ్‌లో నిన్ను చూస్తూ ప్రతి క్షణం మ్యానేజ్ చేయడం నావల్ల కాదు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే పరీక్షలు తట్టుకోలేక ఎక్కడ అందరి ముందు ఓపెన్ అయిపోతానో. అది ఏ గోడవకు దారి తీస్తుందోనని చెప్పేస్తాను. పెద్ద మనసుతో అర్థం చేసుకుంటాడు' అని అనుకుంటుంది. ఆదర్శ్ అప్పుడే ముకుందని పిలుస్తాడు. దీంతో టెన్షన్ పడుతూ ఫోటోస్ బ్యాగ్‌లో పెట్టేస్తుంది. అతడు క్లిప్ పెట్టడం కోసం బ్యాగ్ ఓపెన్ చేయబోతాడు.

కంటపడకూడదు అని:ఆదర్శ్ బ్యాగ్ ఓపెన్ చేయబోతుంటే కంగారుగా వద్దు పెట్టొద్దని అంటుంది. దీంతో ఏమైంది క్లిప్ బ్యాగ్‌లో పెడతాను అంటే అంతగా రియాక్ట్ అవుతున్నావని అంటాడు. అది తీసుకెళ్లడం లేదని చెప్పి బ్యాగ్ జిప్ వేసేస్తుంది. అప్పుడు ఆదర్శ్ 'అది మామూలుగా కూడా చెప్పొచ్చు కదా. అంత కంగారు ఎందుకు? ఈ బ్యాగ్‌లో ఏదో పాము ఉన్నట్టు అరిచావే' అంటాడు. అప్పుడు ముకుంద 'పాము కాటేసినా ఏం కాదు కానీ.. ఈ ఫోటోస్ చూస్తే నా జీవితమే ప్రమాదంలో పడుతుంది. నేను నా నోటితో నీకు నచ్చజెప్పే వరకు ఇవి నీ కంట పడకూడదు' అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode February 17th

అలా థ్రిల్ ఉండదని:తర్వాత ఆదర్శ్ 'అంతా ఒకేనా? ఇప్పుడు మనం వెళ్తున్న ట్రిప్ నీకు ఇష్టమేనా' అని ముకుందను అడుగుతాడు. దీనికామె 'అదేమీ లేదు ఈ ట్రిప్‌కు వెళ్దామని చెప్పింది నేనే కదా' అంటుంది. అంతలోనే మురారి వాళ్ళు బ్యాగ్ పట్టుకుని వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారని ఇంట్లో వాళ్లు అడిగితే.. ఏమో మాకు తెలియదు ముకుంద ప్లాన్ చేసిందని కృష్ణ చెప్తుంది. అప్పుడు మధు 'ఇంత హడావుడిగా ఎందుకు వెళ్తున్నారో కారణం తెలుసుకోవచ్చా' అని అడుగుతాడు. దీనికి మురారి 'ముందే బుక్ చేసుకుని వెళ్తే థ్రిల్ ఏముంటుంది' అంటాడు. తర్వాత వెళ్లిపోతారు.

భారం దించేసుకోవాలి:ముకుంద 'ఆదర్శ్‌కు ఈ విషయం ఎలా చెప్పాలి? ఎక్కడో ప్రశాంతంగా బతుకుతున్న మనిషిని తీసుకొచ్చి ఇష్టం లేదని చెప్తే చాలా బాధపడతాడు. కానీ తప్పదు ప్రతిక్షణం తనని మోసం చేస్తూ నన్ను నేను మోసం చేసుకోలేను. ఎలాగైనా ఈ ట్రిప్ అయిపోయే లోపు చెప్పి మనసులో భారం దించుకోవాలి' అని అనుకుంటుంది. తర్వత ఆదర్శ్ ముకుందకి తగులుతూ ఉంటే ఈ మనిషితో పక్కన కూర్చోవడం ఇబ్బందిగా ఉంది అనుకుని కారు ఆపమని చెప్తుంది. కారు దిగి 'ఎప్పుడు మీరే ముందు కూర్చుంటారా మేము కూర్చోవద్దా' అని కృష్ణ వాళ్లను అడుగుతుంది.

వాళ్లను చూసి అసూయ:ముకుంద అడగ్గానే మురారి వాళ్లు వెనక్కి వస్తారు. దీంతో ఆదర్శ్ డ్రైవింగ్ చేస్తుంటాడు. మురారి ఏమో కృష్ణతో ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటుండగా.. ముకుంద మాత్రం 'ఇప్పుడు హ్యాపీగా ఉంది. మిర్రర్‌లో హ్యాపీగా మురారిని చూసుకోవచ్చు' అని అనుకుంటుంది. తర్వాత థాంక్యూ ముకుంద అవుటింగ్‌కు ప్లాన్ చేసినందుకని కృష్ణ చెప్తుంది. అప్పుడు ముకుంద 'ఇది ప్లాన్ చేసింది మీకోసం కాదు.. నాకోసం ఆదర్శ్‌కు నిజం చెప్పడం కోసం' అని మనసులో అనుకుంటుంది. తర్వాత మురారి, కృష్ణ క్లోజ్‌గా ఉంటే చూసిన ముకుంద 'నాకు ఎందుకు అసూయ పుడుతుంది? నాకు అలాంటి ఫిలింగ్స్ కలగకూడదు. నాకు కావలసింది ఆదర్శ్‌కు దూరంగా ఉండటమే' అనుకుంటుంది. తర్వాత వాళ్లను అనవసరంగా పంపాను అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode February 17th

మురారి అల్లాడిపోతూ:మురారి తలనొప్పి అబద్ధం అని ఆదర్శ్ అనుకుంటాడు. అప్పుడతను 'నేనేమీ కావాలని చెప్పడం లేదు. నిజంగానే తలనొప్పిగా ఉంది. కావాలంటే నువ్వు రిటర్న్‌లో నువ్వు వెనుక సీట్‌లో కూర్చో. ముకుంద తలనొక్కుతుంది' అని చెప్తాడు. అప్పుడు ముకుంద 'మురారి పాపం ఎంతసేపు అలా తలనొప్పితో ఉంటాడు. మందుల షాప్ లో బామ్ తీసుకుని రాయవచ్చు కదా' అంటాడు. తర్వాత బామ్ తీసుకుని కృష్ణ అతడి తలపై రాస్తుంది. దీంతో మురారి మంటతో విలవిలలాడుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X