Krishna Mukunda Murari: కృష్ణను చంపాలని ప్లాన్.. దేవ్ ఎంట్రీతో కథలో ట్విస్ట్.. ముకుందకూ ప్రాణ హాని
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మురారి ఫొటోను చూసుకుంటూ ముకుంద ఆలోచిస్తుంటుంది. అలాగే, ఆదర్శ్‌కు ఎలాగైనా నిజాన్ని చెప్పేయాలని అనుకుంటుంది. అంతలోనే ఆదర్శ్ రావడంతో ఆ ఫొటోలను దాచేస్తుంది. అప్పుడు అతడు బ్యాగ్ చెక్ చేయబోతుంటే అడ్డుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, ముకుంద వాళ్లు జంటలుగా బయటకు వెళ్తారు. అప్పుడు ముకుంద.. ఆదర్శ్ పక్కన కూర్చోడానికి ఇబ్బంది పడి ముందు సీటులోకి వెళ్లిపోతారు. దీంతో మురారి వాళ్లు వెనక్కి వచ్చి రొమాన్స్ చేస్తుంటారు. వాళ్లను అలా చూసి ముకుంద అసూయ పడుతుంది. తర్వాత మురారి తలనొప్పి డ్రామా ఆడతాడు.

ముకుంద పేరుతో రూమ్స్:వెకేషన్‌కు వచ్చిన కృష్ణ, ముకుంద జంటలు రిసార్టుకు చేరుకుంటారు. అక్కడికి వెళ్లగానే రిసెప్షన్‌లో రూమ్స్ కావాలని అడుగుతారు. అప్పుడు అక్కడి సిబ్బంది 'మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఆల్రెడీ రెండు సూట్ రూమ్స్ బుక్ అయ్యాయి. ఎవరో ముకుంద పేరు మీద బుక్ చేశారు. డబ్బులు కూడా కట్టేశారు' అని చెప్తారు. దీంతో అందరూ షాక్ అవుతారు. ముకుందే నిజంగా బుక్ చేసిందని అంతా అనుకుంటారు. కానీ ఆమె మాత్రం 'అసలు నేను బుక్ చేయకుండా రూమ్స్.. నా పేరు మీద ఎలా బుక్ అయ్యాయి' అని ఆలోచనలో పడిపోతుంది.
బుక్ చేసింది కృష్ణ అంట:అసలు రూమ్స్ ఎలా బుక్ అయ్యాయని ముకుంద ఆలోచిస్తుంటుంది. అప్పుడు కృష్ణ 'తన పేరు మీద రూమ్స్ ఎలా బుక్ అయ్యాయా అని ఆలోచిస్తుంది. నేనే బుక్ చేశానని తెలియదు పాపం. ఇంకా ముందు ముందు థ్రిల్ అయ్యే మ్యాటర్స్ చాలా ఉన్నాయి' అని మనసులో అనుకుంటుంది. మరోవైపు రేవతి దగ్గరకి మధు వచ్చి డౌట్ అంటాడు. తర్వాత ముకుంద పనిగట్టుకుని వాళ్ళని బయటకి ఎందుకు తీసుకెళ్లింది అని అడుగుతాడు. వాళ్ళు ఏదో సరదాగా వెళ్లారు అందులో ఏముందని రేవతి అంటుంది.
ముకుందపై మధు డౌట్:ఆ తర్వాత మధు 'ముకుంద ఎప్పుడైనా ఇంత హుషారుగా ఉండటం చూశావా? ఆదర్శ్ వచ్చినప్పుడు కూడా ఇలా లేదు. ముకుంద ఇంత సడెన్‌గా యాక్టివ్ అవడం వెనుక ఏదో కారణం ఉంది. వాళ్లు తిరిగి వచ్చాక ఒక వార్త చెప్తారు. నా అనుమానం నిజం అయితే అది నెగటివ్ అవుతుంది లేదంటే పాజిటివ్ అవుతుంది' అని చెప్తాడు. దీంతో రేవతి 'అక్కకు తన మీద కోపం పోకపోవడానికి కారణం తను మారలేదని కాదు.. తను చేసిన పనుల వల్ల అయినా నువ్వు ఎందుకు తనని నమ్మడం లేదు' అని అడుగుతుంది.

మురారి శోభనం కోసం:రేవతి మాటలకు మధు 'ఎందుకంటే తన ప్రవర్తన అలా ఉంది. అందరూ ఉన్నప్పుడు ఒకలా.. ఎవరూ లేనప్పుడు మరోలా ఉంటుంది. ఈరోజు ముకుందలో ఒకరకమైన తెగింపు కనిపించింది. కావాలంటే నువ్వే చూడు. వాళ్ళు తిరిగి వచ్చాక తెలుస్తుంది' అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మురారి మళ్లీ శోభనం అంటూ సరదా పడుతుంటాడు. కృష్ణ మాత్రం అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు అంటుంది. దీంతో మురారి 'అసలు మనం బయటకి వెళ్లము ఈ గదిలోనే ఉంటాం తాళం కూడా లేదు. నేనే తాళం వేసి కిటికీలో నుంచి బయటకి విసిరేశాను' అని చెప్పేసరికి కృష్ణ బిత్తరపోతుంది. తర్వాత రూమ్ బాయ్ రావడంతో చెప్తుంది. దీంతో ఇంకోటి తెస్తానంటాడు.
కృష్ణను దేవ్ చంపాలని:ముకుందకు దేవ్ ఫోన్ చేస్తాడు. అప్పుడు 'ఏంటి నీ మొగుడితో శోభనం చేసుకోవడానికి వచ్చావా' అని అడుగుతాడు. దీనికామె 'పళ్ళు రాలిపోతాయి. నేను తనని మొగుడు అనుకోవాలి కదా. అప్పటికి ఎప్పటికీ ఈ ముకుంద మనసు మారదు. ఇక్కడ నా వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. నా పేరు మీద ఎవరో రూమ్స్ బుక్ చేశారు' అని చెప్తుంది. దీంతో దేవ్ 'ఇంకెవరూ ఆ కృష్ణ చేసింది. నీ జీవితానికి కృష్ణ పెద్ద అడ్డు. తనని తొలగిద్దామని అనుకుంటే అసలు కుదరడం లేదు' అంటాడు. దీంతో ముకుంద అది కుదిరే పని కాదు ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేదంటుంది.
అలాంటి పని చేయొద్దు:ముకుందతో దేవ్ 'నువ్వు ఇలాగే ఆలోచిస్తావ్ కానీ నీ లొకేషన్ పంపించు. వీలుంటే కృష్ణను చంపేస్తాను' అంటాడు. దీంతో ముకుంద 'ప్రాణాలు తీయడం లాంటి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు. నాకు అడ్డు పడకుండా ఉంటే చాలు కృష్ణ చాలా మంచిది' అని అంటుంది. అంతలో ఆదర్శ్ రావడంతో షాక్ అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నవని అడుగుతాడు. తన అన్నయ్యతో మాట్లాడుతున్నానని చెప్తుంది. కృష్ణ గురించి చెప్తున్నావ్ కదా తను చెడ్డదని మీ అన్నయ్య అనుకుంటున్నాడా? అని అడుగుతాడు. అదేం లేదు అని కవర్ చేస్తుంది.

రేవతి భయం.. ముకుంద:రేవతి.. మధు చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. ముకుంద ఇంకా మురారిని మర్చిపోలేదా? అదే జరిగితే నా బిడ్డల పరిస్థితి ఏంటి? ఇప్పుడిప్పుడే అంతా చక్కబడుతుందని అనుకుంటే మళ్ళీ చిక్కులు పడుతున్నాయా? అని ఆలోచిస్తూ ఉండగా మధు వస్తాడు. అతడి ముందు తన భయం బయటపెడుతుంది. దీంతో మధు నా అనుమానం నిజం అయితే ఆ ముకుందని బతకనివ్వను అంటాడు. ఇక, ముకుంద మందు తాగైనా ధైర్యంగా ఆదర్శ్‌కు నిజం చెప్పాలని అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











