Krishna Mukunda Murari: నిజం చెప్పేసిన ముకుంద.. ట్విస్ట్ ఇచ్చిన ఆదర్శ్.. మురారికి కృష్ణ సర్‌ప్రైజ్
ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.
అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే: ఎవరికీ తెలియకుండా కృష్ణ.. ముకుంద పేరు మీద రిసార్టులో రూమ్స్ బుక్ చేస్తుంది. కానీ, అవి ఎవరు చేశారో తెలియక ఆమె టెన్షన్ పడుతుంది. అప్పుడే దేవ్.. ముకుందకు ఫోన్ చేస్తాడు. కృష్ణే వాటిని బుక్ చేసిందని చెప్తాడు. అంతేకాదు, ఆమెను చంపడానికి ప్లాన్ చేస్తానని అంటాడు. కానీ, ముకుంద మాత్రం వద్దని చెప్తుంది. ఇక, రేవతి దగ్గర మధుకర్.. ముకుంద మారలేదని, ట్రిప్ నుంచి వచ్చే సరికి ఓ విషయం తెలుస్తుంది అంటాడు. దీంతో ఆమె భయపడుతుంది. అప్పుడు మధుతో చెప్పి బాధపడగా.. అతడు ముకుంద తప్పు చేస్తే ఆమెను చంపేస్తానని చెబుతాడు.

మందు తాగేసిన ముకుంద: మందు తాగే లోపు ఆదర్శ్ ఫోన్ వస్తే పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు అతడి మందు గ్లాస్‌ను ముకుంద తీసుకు వెళ్తుంది. అలాగే, ఇదే కరెక్ట్ టైమ్ నిజం చెప్పాలని ముకుంద అనుకుంటుంది. మురారి.. కృష్ణను బంగారం అని పిలిచేసరికి షాకై 'ఒక పెగ్గు పడగానే తింగరి కాస్త బంగారం అయిపోయింది' అంటుంది. అప్పుడు మురారి 'జీవితంలో మరచిపోలేని గిఫ్ట్ ఇస్తానని చెప్పావ్ కదా అది ఏంటి' అని అడుగుతాడు. కాసేపు ఆగితే మీకే తెలిసిపోతుందని కృష్ణ చెప్తుంది. తర్వాత ధైర్యం తెచ్చుకోవడం కోసం ముకుంద ఆదర్శ్‌కు తీసుకెళ్లిన మందు తాగుతుంది.

నిజం చెప్పేసిన ముకుంద: ముకుంద మందు తాగడం చూసి కృష్ణ వాళ్లు ఆశ్చర్యపోతారు. తర్వాత ఆదర్శ్ ఫోన్ మాట్లాడి తిరగబోతుంటే ముకుంద ఆపుతుంది. అంతేకాదు, 'నీతో ఒక విషయం చెప్పాలి. తప్పక చెప్తున్నాను. మురారి మాట కాదనలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నాకు మన పెళ్లి ఇష్టం లేదు. ఇప్పటికే కాదు.. ఎప్పటికీ మీ మీద ఇష్టం కలగదు. మీ భార్యగా ఉండలేక మీకు సంతోషాన్ని ఇవ్వలేక ఈ బతుకు నేను బతకలేను. మీరు తప్పుగా అనుకున్న పర్వాలేదు. మీరు ప్లీజ్ ఇంకొక పెళ్లి చేసుకోండి. ఆ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి' అంటూ నిజాన్ని అతడికి చెప్పేస్తుంది.
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఆదర్శ్: తర్వాత ముకుంద 'సారీ నేను మిమ్మల్ని రమ్మనలేదు. నా మౌనాన్ని ఇష్టంగా అర్థం చేసుకుని మిమ్మల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా రూమ్స్ నేను బుక్ చేయలేదు. కృష్ణ వాళ్ళే చేసినట్టు ఉన్నారు. నన్ను ఒక పీడ కల అనుకుని మర్చిపోండి' అని చెప్తుంది. కానీ, ఆదర్శ్ చెవిలో బ్లూటూత్ ఉండటం వల్ల ముకుంద చెప్పింది ఏదీ అతడికి వినిపించదు. చెవిలో నుంచి వాటిని తీసి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి ముకుంద షాక్ అవుతుంది. ఇంతసేపు నేను చెప్పింది వినలేదు ఇప్పుడు మాత్రం ఏమైంది మళ్ళీ చెప్తానని అనుకుంటుంది. అంతలో మురారి వాళ్లు వస్తారు.

శోభనం ఏర్పాట్లతో షాక్: చాన్స్ మిస్ అవడంతో ముకుంద 'మంచి అవకాశం మిస్ చేసుకున్నాను. తొందరపడి చెప్పాను. ఇప్పుడు మళ్లీ ఎలా చెప్పాలి? పైగా ఇప్పుడు తనతో ఒంటరిగా ఒకే గదిలో ఉండాలి ఎలా చెడగొట్టాలి' అని అనుకుంటుంది. ఆదర్శ్ గదికి వచ్చి చూసేసరికి బెడ్ మొత్తం పూలతో అలంకరించి ఉంటుంది. అప్పుడతను 'ముకుంద ఈ ట్రిప్ ప్లాన్ చేసింది ఇందుకా? నేను తను నన్ను ప్రేమిస్తుందో లేదోనని అనవసరంగా అనుమానించాను. తప్పుగా అర్థం చేసుకున్నాను' అని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ముకుంద కూడా గదిలోకి వచ్చి బెడ్ చూసి షాక్ అవుతుంది.
నువ్వేంటే అర్థమైంది: బెడ్ చూసిన తర్వాత ముకుంద 'ఇదంతా ఎవరు చేశారు? నా పేరు మీద రూమ్స్ బుక్ చేయడమే కాకుండా శోభనానికి కూడా ఏర్పాట్లు చేశారు. బాగా ఇరుక్కుపోయాను' అనుకుంటుంది. అంతలో ఆదర్శ్ డార్లింగ్ చాలా థాంక్యూ అని హగ్ చేసుకోబోతుంటే గట్టిగా అరిచి ఆగమంటుంది. దీంతో అతడు షాక్ అవుతాడు. తర్వాత ఆదర్శ్ 'ముకుంద నిన్ను అపార్థం చేసుకున్నాను. నేనంటే నీకు ఇష్టం లేదని అనుకున్నాను. కానీ నీ ఇష్టాన్ని ఇంత గొప్పగా చూపిస్తావని అనుకోలేదు. నువ్వు ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది' అనగా.. తాను చేయలేదని ముకుంద చెప్తుంది.

మురారి ఫుల్ ఖుషీగా: ఆదర్శ్ - ముకుంద అలా ఉంటే.. కృష్ణ మాత్రం తన గదిలో కూడా శోభనం ఏర్పాట్లు చేస్తుంది. అది చూసి మురారి ఫుల్ ఖుషీ అయిపోతాడు. ఆ తర్వాత రూమ్స్ బుక్ చేసిన విషయం అతడికి చెప్పేస్తుంది. ఆ ఆనందంలో ఒక పెగ్ మందు తాగాలని అనుకుంటాడు. వెంటనే ఆదర్శ్ రూమ్‌కు వెళ్లి తెచ్చుకోవాలని చూస్తాడు. అంతలోనే ముకుంద 'ఆదర్శ్ బయటకి వెళ్ళాడు. లోపలికి వచ్చాక తప్పించుకోవడం కష్టం. దేవ్ ఏదో చేస్తానని అన్నాడు. లొకేషన్ కూడా పంపించాను. తను ఏదైనా చేస్తే బాగుండు' అని అనుకుంటుంది.
తప్పించుకున్న ముకుంద: ముకుంద కంగారుకు తగ్గట్లే ఆదర్శ్ వచ్చి ఆమె చేతిని పట్టుకుంటాడు. దీంతో గట్టిగా అరుస్తూ ఒక సర్‌ప్రైజ్ ఉందని మళ్లీ కవర్ చేస్తుంది. ఆ తర్వాత అతడిని అక్కడే ఉండమని ఓ ఫొటో ఫ్రేమ్ తీసుకు వస్తానని వెళ్లిపోతుంది. అంతలోనే అక్కడకు మురారి వాళ్లు వస్తారు. వచ్చి ముకుంద గురించి అడుగుతారు. దీంతో ఫొటో తీసుకు రావడానికి వెళ్లిందని చెప్తాడు. అప్పుడు కృష్ణ 'చూశావా ముకుందకి నీ మీద ఎంత ప్రేమ ఉందో' అంటుంది. ముకుంద మాత్రం ఒంటరిగా నిలబడి కంగారు పడుతూ ఉంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











