Krishna Mukunda Murari: ట్విస్ట్ ఇచ్చిన పంతులు.. ముకుందను బుక్ చేసేలా కృష్ణ ప్లాన్.. !

ఇండియా వ్యాప్తంగా ఎన్నో భాషలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
కారులో వెళ్తుండగా ముకుందను టెస్ట్ చేయాలని కృష్ణ అనుకుంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆదర్శ్ భుజం మీద పడుకోమని చెప్తుంది. మరోవైపు, ఆదర్శ్ విషయంలో ముకుంద తప్పు చేస్తుందని మధు, రేవతి మాట్లాడుకుంటారు. కృష్ణ మాత్రం ముకుంద ప్రవర్తన గురించి అయోమయానికి గురి అవుతుంటుంది. అదే సమయంలో అనుమానాలను వ్యక్తం చేస్తుంది. తర్వాత ఆదర్శ్‌తో మాట్లాడుతూ ముకుందకు కాలు నొప్పి లేదని నోరు జారి తర్వాత కవర్ చేస్తుంది. ఇక, ఇంటికి వచ్చిన తర్వాత ముకుంద, ఆదర్శ్‌కు శోభనం జరిపించాలని కృష్ణ ఏర్పాట్లు చేస్తుంది.

 Krishna Mukunda Murari Serial Today Episode February 23rd

ముకుందలో అనుమానాలు
ముకుంద తన ఫోన్‌లో మురారి ఫొటోలు చూస్తూ.. 'బయటకి వెళ్ళి ఆదర్శ్‌కు నిజం చెప్పేద్దామని అనుకుంటే అక్కడ శోభనం ఏర్పాట్లు చేశారు. ఎవరో చేసి నేను చేశానని నా మీద పెట్టారు. అసలు చేసింది ఎవరు? సర్‌ప్రైజ్ ఇద్దామని చేశారా? నామీద అనుమానంతో చేశారా? ఏం చేసినా ఆ టైమ్‌లో ఏదో ఐడియా వచ్చి తప్పించుకున్నాను. లేదంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేది. నా వల్ల కాదు.. మురారి, ఆదర్శ్‌కు అంతా చెప్పేస్తాను' అని అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్.. ముకుంద కోసం జ్యూస్ పట్టుకుని వస్తాడు. అంతలో ఆమె ఫోన్‌లో ఫోటో చూస్తూ ఉంటుంది.

ముకుందపై ఆదర్శ్ ప్రేమ
జ్యూస్ తీసుకు వచ్చిన ఆదర్శ్.. ముకుందతో 'సాయంత్రంలోపు తగ్గకపోతే హాస్పిటల్‌కు వెళ్దాం. నీకు ఏం కావాలన్నా ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వు. క్షణాల్లో నీ కాళ్ళ దగ్గర ఉంటాను. రాత్రి జరిగిన దానికి బాధపడకు. నేనేమీ డిసప్పాయింట్ అవలేదు. రాత్రి ఏమి జరగపోయిన మనం కలిసి ఉండాలనే ఆలోచన నీకు వచ్చింది చూడు అది చాలు నాకు' అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ముకుంద 'ఒక మనిషి ప్రేమ ఇంతలా బాధ కలిగిస్తుందని జీవితంలో మొదటి సారి అనుభవంలోకి వస్తుంది. తొందరగా ఈ బాధ నుంచి నాకు విముక్తి కలిగించు' అని దేవుడిని వేడుకుంటుంది.

రేవతిని ప్రశ్నించిన కృష్ణ
కృష్ణ.. రేవతి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. అప్పుడామె ముకుందకు ఎలా ఉందని అడుగుతుంది. దీనికి క‌ృష్ణ 'బాగానే ఉంది కానీ పెద్దత్తయ్య ఎన్నో సార్లు ఊరు వెళ్లారు. మరి ఈ సారి నాకు మాత్రమే ఎందుకు బాధ్యత అప్పగించారు' అని అడుగుతుంది. దీంతో రేవతి 'ఎందుకంటే నీ మీద నమ్మకం ఉంది' అని చెప్తుంది. అప్పుడు కృష్ణ 'అది కాదు ఏదో కారణం ఉంది. ముకుంద వాళ్ళు అంత బాగా చేసినా ప్రైజ్ మాకే ఇచ్చారు. బాధ్యత కూడా నాకే ఎందుకు అప్పగించారు నేను కనిపెట్టాలి' అంటుంది. దీంతో రేవతి 'అక్కకు ముకుంద మీద అనుమానం ఉంది తను మారింది అంటే అసలు నమ్మడం లేదు' అంటుంది.

కృష్ణలో డౌట్లు పెంచేస్తూ
ఆ తర్వాత రేవతి 'నువ్వు ముకుంద మంచిదని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నావ్ తప్ప.. ఒక్కసారైన అక్క ఎందుకు అనుమానిస్తుందో ఆలోచించావా? ఆదర్శ్ ముకుందని కలపాలని నీ ఉద్దేశం మంచిదే. కానీ ఆదర్శ్ తిరిగి వచ్చాక వాళ్ళు ఒక్కటి అయ్యారని సంతోషించకుండా ఇంకా ముకుంద మీద అనుమానంతో ఎందుకు ఉంది అది ఆలోచించు. ముకుంద మారిపోయిందంటే నువ్వు నమ్ముతున్నావా? ఎక్కడ ఇంత అనుమానం రాలేదా' అని అడుగుతుంది. దీంతో కృష్ణ 'ఈ ట్రిప్‌కు వెళ్లకపోయి ఉంటే అసలు అనుమానం వచ్చేది కాదు. రేపు తేలుస్తాను అసలు పెద్దత్తయ్య అనుమానం నిజమో కాదో' అనుకుంటుంది.

 Krishna Mukunda Murari Serial Today Episode February 23rd

ముకుందకు కృష్ణ ప్రశ్న
పంతులు ఇంటికి రావడంతో కృష్ణ 'ఆయనను నేనే రమ్మన్నాను. పెద్దత్తయ్య ముహూర్తం పెట్టమంటే పది రోజులు ఆగమన్నారు కదా. ఇప్పుడు ఆ అయిపోయింది. అందుకే ముహూర్తం పెట్టించడానికి రమ్మన్నాను. శోభనానికి మంచి ముహూర్తం పెట్టండి' అని అంటుంది. దీంతో ముకుంద టెన్షన్ పడుతూ 'కాలు బెణికిందని అక్కడ తప్పించుకుంటే ఇక్కడ ఇంటికి రాగానే ముహూర్తాలు పెట్టిస్తున్నారు' అని టెన్షన్ పడుతుంది. దీంతో కృష్ణ 'నీ కంగారు ఎందుకు? ఈ శోభనం తప్పించాలని చూస్తున్నావా? లేదంటే ముహూర్తం తప్పించాలని చూస్తున్నావా' అని ప్రశ్నిస్తుంది.

మూడు నెలలు దూరం
శోభనం ముహూర్తం అనగానే ముకుంద 'రాత్రి బయట కాబట్టి తప్పించుకున్నాను. ఇప్పుడు ఇంట్లో ఎలా తప్పించుకోవాలి. ఊపిరి తీసుకొనివ్వకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ టెన్షన్లు ఏంటి' అని టెన్షన్ పడుతుంది. అప్పుడామెను మధు ఫొటో తీస్తాడు. పంతులు అన్నీ చూసి ఒక జంటకు మాత్రమే ముహూర్తం ఉందని అంటాడు. తర్వాత ఆదర్శ్, ముకుందకు అని చెప్తాడు. దీంతో ముకుంద భయపడిపోతుంది. ఇక, మురారి వాళ్లకు మాత్రం మూడు నెలలు ముహూర్తం లేదని చెప్తాడు. దీంతో అతడు డీలా పడిపోతాడు. ఆ తర్వాత ముకుంద ఏదేదో చెప్పబోతుండగా కృష్ణ లైట్ తీసుకుంటుంది.

అబద్దం చెప్పించింది
వాస్తవానికి మురారి వాళ్లకు కూడా శోభనం ముహూర్తం ఉంటుంది. కానీ, కృష్ణ కావాలనే ముకుంద వాళ్లకు రేపు ముహూర్తం పెట్టమని పంతులును అడుగుతుంది. అంతేకాదు, కుటుంబం మంచి కోసమే చేస్తున్నానని ఆయనను ఒప్పిస్తుంది. అందుకే ఒకరికే ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ 'శోభనానికి ఏర్పాట్లు చేయిస్తున్నా. రిసార్ట్‌లో చెడగొట్టినట్టే ఈ సారి కూడా చెడగొడితే ఆదర్శ్ అంటే ఇష్టం లేదు. ఇంకా ఏసీపీ సర్ గురించి ఆలోచిస్తున్నట్టే. ముకుంద ఏమైంది నీకు? నువ్వు మారిపోయావు అనుకుంటే మళ్ళీ ఎందుకు నీ మనసులో పాడు ఆలోచనలు వస్తున్నాయి' అనుకుంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X