Krishna Mukunda Murari: నిజం మొత్తం చెప్పేసిన ముకుంద.. కృష్ణకు షాకిచ్చిన మురారి.. ఇదెక్కడి ట్విస్ట్!
ఈ మధ్య కాలంలో కొత్త కొత్త షోలు వస్తున్నాయి. అయినా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే: శోభనం ముహూర్తం లేకపోవడంతో మురారి నిరాశగా ఉంటూ కృష్ణపై సీరియస్ అవుతుంటాడు. దీంతో ఆమె అతడికి సర్ధి చెప్పి కూల్ చేస్తుంది. ఇక, ముకుంద మాత్రం ఎలాగైనా శోభనం ఆపేందుకు భవానీకి నిజం చెప్పాలని అనుకుంటుంది. అది కుదరకపోవడంతో మురారితోనైనా చెప్పాలని నిర్ణయించుకుంటుంది. మధుకర్ తీసిన ముకుంద ఫొటోలను రేవతికి చూపించి అనుమానాలు నిజమే అని చెప్తాడు. ఇక, ముకుంద ఫోన్‌లో 'నా మొగుడు' అని ఉన్న కాంటాక్ట్ నెంబర్ మురారిదే అని కృష్ణకు తెలిసిపోతుంది.

పేరు మార్చేసిన ముకుంద: కృష్ణకు డౌట్ రావడంతో తన ఫోన్‌లో మురారి పేరును ముకుంద మార్చేస్తుంది. అప్పుడు ఆమెను చెక్ చేయడానికి కృష్ణ వచ్చి చీరలు కట్టుకుని చూపించమని పంపుతుంది. దీంతో ముకుంద తన మొబైల్‌ను అక్కడే పెట్టేసి వెళ్లిపోతుంది. అప్పుడు కృష్ణ 'ఇప్పుడు ఏపీసీ సర్ ఫోన్ నుంచి కాల్ చేస్తాను. మురారి అని వస్తుందో నా మొగుడు అని వస్తుందో చెక్ చేయాలి. ఏసీపీ సర్ నా మొగుడు అని ముకుందకు కలలో కూడా ఆ ఆలోచన రాకూడదు' అని టెన్షన్ పడుతూనే కాల్ చేస్తుంది. అప్పుడు ముకుంద ఫోన్లో మురారి అని పడుతుంది. దీంతో నేను భయపడినట్టు ఏమి లేదు అని కృష్ణ ఊపిరి పీల్చుకుంటుంది.
అది కనిపెట్టిన ముకుంద: ముకుంద వచ్చేసరికి కృష్ణ ఉండదు. ఫోన్లో మురారి మిస్డ్ కాల్ చూసుకుంటుంది. అప్పుడు 'ఇందాక ఫోన్లో నా మొగుడు అని చూసేసరికి కృష్ణకి డౌట్ వచ్చింది. అది చెక్ చేసుకోవడానికి చీర వంకతో ఇక్కడికి వచ్చింది. నేను పేరు మార్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే మొత్తం బయట పడిపోయేది. ఎవరికి అనుమానం వచ్చినా పరవాలేదు కానీ.. కృష్ణకు అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండాలి' అని అనుకుంటుంది. తర్వాత మురారిని కృష్ణ 'ముకుంద ఫోన్‌కు ఎందుకు కాల్ చేశారు' అని నిలదీస్తుంది. ఏదో అలవాటు ప్రకారం ఫోన్ చేశానని చెప్తాడు. కానీ, కృష్ణ మాత్రం నమ్మదు.

ముకుంద అంటేనే ఇష్టం: ఆ తర్వాత మురారి 'ఇంతవరకు వచ్చిన తర్వాత నీ దగ్గర దాచాలని అనుకోవడం లేదు. నేను ముకుందని మర్చిపోలేకపోతున్నాను. ఆదర్శ్ ప్రేమ కోసం నా ప్రేమను త్యాగం చేసి తనను వదిలేశాను. నిన్ను పెళ్లి చేసుకున్నాక ముకుందకు చోటు లేదు అనుకున్నాను. కానీ మొదటి ప్రేమ అంత త్వరగా మర్చిపోలేను. ఎంత వదిలేద్దామని అనుకుంటున్నా అవడం లేదు. అసలు నువ్వు పక్కన ఉన్నా నీలో కూడా ముకుంద కనిపిస్తుంది. ఈ విషయం చెప్పలేక నిజం దాచుకోలేక ఎంత నలిగిపోయానో నాకు మాత్రమే తెలుసు. ముకుందకి కూడా తెలుసు. అందుకే ఫోన్ మాట్లాడుతున్నాం' అంటాడు. దీంతో కృష్ణ వెక్కి వెక్కి ఏడుస్తుంది.
మురారికి సారీ చెప్పింది: ఏడుస్తున్న కృష్ణ దగ్గరకు వచ్చిన మురారి 'ఒక్క దెబ్బ వేశానంటే బుర్రకి పట్టిన చెద అంతా వదిలిపోతుంది. నా మీద నీకు అనుమానమా? నీ ఫోన్ ఎక్కడ ఉంది? ఎక్కడ వదిలేశావ్ తెలియదు కదా. ఇక్కడే ఉంది ముందు నీకే ఫోన్ చేశాను. ఇక్కడే ఉంది కావాలంటే చెక్ చేసుకో. నీ ఫోన్ ఇక్కడ ఉంది నీతో మాట్లాడాలి మరి ఎవరికి చేయాలి? నువ్వు ముకుంద దగ్గరకి వెళ్ళావ్ కాబట్టి తనకి చేశాను' అని చెప్తాడు. కృష్ణ వెంటనే మురారిని హగ్ చేసుకుని సారి చెప్తుంది. తర్వాత మురారి వాకింగ్‌కు వస్తే ముకుంద వచ్చి పిలుస్తుంది. నువ్వు ఏంటి ఇక్కడ ఆదర్శ్ ఎక్కడ తను రాలేదా అని అడుగుతాడు. ముకుంద ఏడుస్తుంది.

నా ప్రాణం తీస్తున్నారు: ముకుంద ఏడుస్తుండడంతో మురారి కంగారు పడి ఆదర్శ్ గురించి అడుగుతాడు. అప్పుడామె 'ఆదర్శ్ పేరుతో ఎందుకు నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. నీ కళ్ళ ముందు నేను ప్రాణాలతో ఉండటం ఇష్టం లేదా' అని ప్రశ్నిస్తుంది. దీనికి మురారి 'ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ ఏమైంది నీకు' అని అడుగుతాడు. దీంతో ముకుంద 'మొత్తం నువ్వే చేశావ్.. నాకు ఇష్టం లేని జీవితంలోకి నన్ను నెట్టేశావ్. నన్ను బతుకుతున్న శవంలా మార్చేశావు. మనసులో లేని మనిషితో బతుకు పంచుకోవడం నరకంగా ఉంటుంది. ఆ నరకంలో నుంచి బయట పడదామని అనుకునే ప్రతిసారి తిరిగి అదే నరకంలోకి నెడతున్నారు' అని ఏడుస్తుంది.
మనసు చంపుకున్నాను: తర్వాత ముకుంద 'మీరు ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? చెప్పకూడదు అనుకున్నా కానీ నా వల్ల కావడం లేదు. తెగించి చెప్తున్నా ఆదర్శ్ అనే పేరు నా జీవితంలో ఉండకూడదు. అసలు తను నా ఎదురుగా ఉండకూడదు' అంటుంది. దీంతో మురారి 'ఏం మాట్లాడుతున్నావ్? నీకు ఆదర్శ్ అంటే ఇష్టమే కదా మనసు మార్చుకున్నావ్ కదా' అని అడుగుతాడు. అప్పుడు ముకుంద 'లేదు నేను మనసు మార్చుకోలేదు. మనసు చంపుకుని బతుకుతున్నా. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నా మనసులో ఉంది నువ్వే. నేను ప్రేమించేది నిన్నే. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా.. నాతో లేకపోయినా.. కృష్ణతో నా ఎదురుగా ఉంటున్నా ఎందుకు ప్రాణాలతో ఉన్నానో తెలుసా? కనీసం నిన్ను చూస్తే బతికే అవకాశం ఉందని' అని వివరిస్తుంది.
నేను ప్రాణాలతో ఉండను: అనంతరం ముకుంద 'ఇంకా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆ అవకాశం ఎక్కడ దూరం అవుతుందో, ఇంట్లో నుంచి తరిమేస్తారోననే భయంతో నా మనసు చంపుకున్నాను కానీ నేను ఇంత కూడా మారలేదు. నువ్వే ఉన్నావ్ నా మనసులో, నా ఆలోచనలో నువ్వే ఉన్నావ్. నీకు ఆ విషయం అర్థం కాలేదు. ఆదర్శ్ కోసం తహతహలాడుతున్నానని ఎక్కడో ప్రశాంతంగా ఉన్న మనిషిని తెచ్చి నా పక్కన పడేశారు. అతనికి ప్రేమ పంచలేక, ప్రేమలేదని చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. ఇంక నా వల్ల కాదు. నువ్వు ఏం చేస్తావో ఏం చెప్పి పంపిస్తావో నాకు అనవసరం. ఆదర్శ్ నా కళ్ళ ముందు ఉండకూడదు. నేను చెప్పింది చేయకుండా ఇంట్లో ఎవరికైనా చెప్తే నేను ప్రాణాలతో ఉండను. నీ కళ్ళెదురుగా నా ఊపిరి వదిలేస్తాను తర్వాత నీ ఇష్టం. రేపు రాత్రికి శోభనం ఆ గదిలోకి నేను పాల గ్లాసుతో అడుగుపెడితే నేను ప్రాణాలతో బయటకి రాను' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











