Krishna Mukunda Murari: ముకుందకు టెస్ట్ పెట్టిన కృష్ణ.. అడ్డంగా దొరికిన మురారి.. కథలో సూపర్ ట్విస్ట్
సరికొత్త కాన్సెప్టులతో కార్యక్రమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే:మురారికి నిజం చెప్పేసిన తర్వాత ముకుంద సంతోషంగా ఇంటికి వస్తుంది. ఆమెను చూసి కాలు నొప్పి తగ్గిపోయిందని కృష్ణ సంతోషిస్తుంది. మురారి మాత్రం ముకుంద ఇచ్చిన షాక్‌తో అయోమయంలో ఉండిపోతాడు. ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోతాడు. కృష్ణ కాఫీని తీసుకొచ్చి ఆదర్శ్‌కు ఇవ్వగా దాన్ని ముకుందతో కలిసి షేర్ చేసుకుంటాడు. ఇక, రేవతి.. మధు మాటలను గుర్తు చేసుకుని డైలమాలో ఉంటుంది. ముకుంద మనసు మార్చి ఆదర్శ్‌తో కలిపాలని మురారి ప్లాన్ చేస్తాడు. ఆదర్శ్ మాత్రం శోభనం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు.

నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...:నిజం చెప్పిన ముకుంద గురించి మురారి ఆలోచిస్తుంటాడు. 'ఆదర్శ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ముకుంద ఆలోచనలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అసలు తను ఎందుకు ఇలా ఆలోచిస్తుంది' అనుకుంటాడు. కృష్ణ కూడా ముకుంద ప్రవర్తన గురించి ఆలోచిస్తూ 'శోభనం నిజంగా తప్పించుకోవాలని చూసిందా? లేదంటే నేను పొరపాటు పడుతున్నానా? ఇప్పుడు కాఫీ షేర్ చేసుకున్నారు. రోజురోజుకీ అనుమానం పెరిగిపోతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా సెట్ రైట్ చేయాలి' అని అనుకుంటుంది.
కృష్ణ వచ్చే సరికి మురారి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే ఆమె చెక్కిలిగింతలు పెడుతుంది. దీంతో ఆమె 'ఏంటి నీ పిచ్చి పనులు? నీ పిచ్చి చేష్టలు మానవా' అని అరిచేస్తాడు. దీంతో కృష్ణ ఏడుస్తూ ఎందుకంత సీరియస్ అయ్యారని అడుగుతుంది. దీంతో ఏదో ఆలోచిస్తూ అరిచాను సారి అంటాడు. దీనికామె 'ఏంటి సీరియస్‌గా ఆలోచిస్తున్నారు? ఇంతకముందు ఇలాగే ఆలోచనలోకే వెళ్లారు. డిస్ట్రబ్ చేస్తే ఇలాగే అరిచారు. మళ్ళీ అలాగే చేస్తున్నారేంటి' అని నిలదీస్తుంది. అప్పుడు మురారి శోభనం గురించి ఆలోచిస్తున్నా అంటూ కవర్ చేసుకుంటాడు.
మురారి మాటలకు కృష్ణ 'శోభనం గురించి అయితే నా కొంగు పట్టుకుని తిరుగుతారు కానీ ఇలా సీరియస్‌గా ఆలోచిస్తారా' అని నిలదీస్తుంది. అప్పుడు మురారి 'టిఫిన్ గురించి ఆలోచిస్తున్నా నాకు ఇష్టమైన ఉల్లిపాయ దోస పెట్టావా. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను నువ్వు చక్కలిగిలి పెట్టావని కోపం వచ్చింది' అని అంటాడు. దీంతో రేపు చేస్తానని చెప్తుంది. కృష్ణ వెళ్లిపోయిన వెంటనే మురారి 'ముకుందని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది ఇంట్లో తెలిసి సీరియస్ కాకుండా ఏదో ఒకటి చేయాలి' అని డిసైడ్ అవుతాడు.
మధు బయటకు వెళ్తుండడంతో రేవతి ఆపి చీవాట్లు పెడుతుంది. దీంతో అతడు 'జరగని వాటి గురించి ఆలోచించడం ఎందుకు? ముకుంద పాల గ్లాసు పట్టుకుని శోభనం గదిలోకి వెళ్తుందని అనుకుంటున్నారా? అసలు జరగదు. ముహూర్తం పెట్టేటప్పుడు తన మొహం చూడలేదా? తర్వాత ఏదైనా షాక్ ఇస్తే మీరు తట్టుకోలేరని అనేసి వెళ్ళిపోతాడు' అంటాడు. దీంతో రేవతి కంగారు పెరుగుతుంది. ముకుంద రొమాంటిక్ సాంగ్‌కి డాన్స్ వేస్తుంది. కృష్ణ అది చూసి 'పొద్దుపొద్దునే ఏంటి ఇంత హుషారుగా ఉంది? ఖచ్చితంగా ఇది శోభనం గురించి అయితే కాదు. ఇంకేదో విషయం ఉంది. ముకుంద మారిపోయిందని అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది ఏంటి? అసలు ఆదర్శ్ అంటే ఇష్టం లేదా లేదంటే ఇంకా మురారి మీద ఇష్టం పోలేదా' అనుకుంటుంది.

ముకుంద ఊహల్లో డాన్స్ చేస్తూ ఊగుతూ ఉంటుంది. కృష్ణ వచ్చి ఆమెను పిలుస్తుంది. వెంటనే ఊహలో నుంచి బయటకి వచ్చేస్తుంది. అప్పుడు ముకుంద 'నిజ జీవితంలోనే కాదు.. ఊహాలో కూడా మురారి నా పక్కన ఉండకుండా చేస్తున్నావు' అని తిట్టుకుంటుంది. తనకు కాస్త బద్ధకంగా ఉందని బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేయమని కృష్ణ అడుగుతుంది. ముకుంద హుషారుగా చేస్తానని చెప్తుంది. అప్పుడు కృష్ణ 'ఇప్పుడు నువ్వు ఏసీపీ సర్‌కు ఇష్టమైన ఉల్లిపాయ దోస వేస్తే ఆయన అంటే ఇంకా ఇష్టం ఉన్నట్టు, ఆదర్శ్‌కు ఇష్టమైన ఉప్మా పెసరట్టు వేస్తే నువ్వు మారినట్టు. శోభనం జరగడం కూడా ఇష్టం ఉన్నట్టు' అని మనసులో అనుకుంటుంది. కృష్ణ దీర్ఘ ఆలోచనలో ఉంటే మురారి వచ్చి కదిలించి ఏంటి సీరియస్‌గా ఆలోచిస్తున్నావని అడుగుతాడు.
మురారి అడగడంతో ఈరోజు టిఫిన్ ముకుంద చేస్తుందని కృష్ణ చెప్తుంది. దీంతో ముకుంద ఎలాగైనా ఉల్లి దోస చేయకుండా ఆపాలని అనుకుంటాడు. వెంటనే కిచెన్‌లోకి వెళ్లగా 'ఎంతవరకు వచ్చాయి నీ ప్రయత్నాలు? శోభనం ఆపేస్తున్నావ్ కదా. ఆదర్శ్‌ను ఇంట్లో నుంచి పంపించేస్తున్నావ్ కదా. నీకు ఉల్లిపాయ దోస అంటే ఇష్టం కదా ఈరోజు నాకు వేసే ఛాన్స్ వచ్చింది. దాంట్లో మన ప్రేమని కలిపి మరింత ఇష్టంగా చేస్తున్నా' అంటుంది. ఇదంతా కృష్ణ వింటుంది. ఆ తర్వాత మురారి 'నువ్వు వేయాల్సిన పని లేదు వెళ్లిపో' అని అంటాడు.
ఆ తర్వాత ముకుంద 'నువ్వు ఎప్పుడు ఇంతే నీ ఇష్టం ప్రకారం ఆదర్శ్‌ను పెళ్లి చేసుకున్నాను. అదే నా ఇష్ట ప్రకారం మనం పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాట్లు పడే అవకాశం వచ్చేది కాదు కదా. ప్రతిరోజు నీకు నా చేతులతో తినిపించేదాన్ని కదా' అంటుంది. దీంతో ముకుందను మురారి తోసేస్తాడు. అప్పుడామె 'ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఈ శోభనం ఆపి ఆదర్శ్‌ను పంపించేయ్. కృష్ణకు ఎలాగూ సర్ది చెప్పి మనం ఒకటి అయిపోదాం' అనేసరికి మురారి నోరు మూయమంటూ చేయి లేపుతాడు.

అనంతరం మురారి 'పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి. నువ్వు మారావు అనుకుని పొరపాటుపడ్డాను కానీ.. నువ్వు ఇంత కూడా మారలేదు' అంటాడు. దీంతో ముకుంద 'నేను మారలేదు మురారి.. నేను మారానని ఎప్పుడు చెప్పాను. నీమీద ఇష్టం, ప్రేమ మారలేదు. జస్ట్ మౌనంగా ఉన్నాను. నువ్వు నా ముందు ఉంటే చాలని అనుకుని నీమీద ప్రేమని గుండెల్లో దాచుకున్నాను. కానీ ఈ మౌనం నన్ను మరొక మనిషికి దగ్గర చేసి నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తే అది నా వల్ల కాదు. ఈ మౌనం వీడి నచ్చింది జరగాలని డిమాండ్ చేస్తున్నా' అంటుంది.
ముకుంద మాటలకు మురారి 'తప్పు చేస్తున్నావ్ ముకుంద.. ఈ కుటుంబం నీ చుట్టూ ఉన్న జీవితాలు ఏమవుతాయో ఆలోచించకుండా తప్పు చేస్తున్నావు' అంటాడు. అప్పుడామె 'నేనేం తప్పు చేయడం లేదు మురారి. ప్లీజ్ తప్పు చేస్తున్నా అనొద్దు. నా ప్రేమ కోసం పోరాటం చేస్తున్నా. నా ప్రేమ బతికించుకోవడానికి ఆరాట పడుతున్నా. ఇంత చెప్తున్నా అర్థం కావడం లేదా? నేను ఏ తప్పు చేయడం లేదు. ఇప్పుడు నేను ఉల్లిపాయ దోస వేస్తే నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నానని తెలిసిపోతుందని అనుకుంటున్నావా' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











