Krishna Mukunda Murari: శోభనాలకు పెట్టుడు ముహూర్తం.. పెద్ద షాకిచ్చిన భవానీ.. రసవత్తరంగా నేటి ఎపిసోడ్

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఏం జరిగిందంటే:ముకుంద, ఆదర్శ్‌ను ఉంగరాలు మార్చుకోవాలని కృష్ణ షాక్ ఇస్తుంది. దీంతో ఆదర్శ్ సంతోషంగా ఉండగా.. ముకుంద మాత్రం డల్‌గా ఉంటుంది. దీంతో తనకు ఇష్టం లేదని మధు అందరి ముందే అంటాడు. అందుకు తగ్గట్లుగానే ఆదర్శ్ ఉంగరం తొడిగే ప్రయత్నం చేయగా.. ముకుంద వెనక్కి లాక్కుంటుంది. దీంతో అందరికీ సందేహం వస్తుంది. అప్పుడు ఆమె తెలివిగా కృష్ణ, మురారిలను ఉంగరాలు మార్చుకోమంటుంది. దీంతో వాళ్లు మార్చుకుంటారు. తర్వాత ఆదర్శ్‌కు ఈ విషయంపై సారీ చెప్పగా.. అతడు మాత్రం ఆమెకు మద్దతుగా మాట్లాడతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode February 2nd

ఏదో ఒకటి చేయాలంటూ:రింగ్‌ల విషయంలో ముకుంద చెప్పిన మాటలను ఆదర్శ్ పూర్తిగా నమ్మేస్తాడు. అప్పుడామె 'ఇక్కడ అత్తయ్య వాళ్లను నమ్మించడం కోసం ఈయనను రప్పించాను. కానీ నేను అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాడు. దీన్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఎక్కువ రోజులు ఆదర్శ్‌ను దూరంగా ఉంచలేను. ఏడో ఒకటి చేయాలి' అనుకుంటుంది. అంతలోనే కృష్ణ రింగ్ చూసుకుని మురిసిపోతుంటే మురారి వచ్చి అడుగుతాడు. ముకుంద మీతో నా వేలికి ఉంగరం తొడిగించిందంటే తను మారింది అనొచ్చు కదా అని అతడితో చెబుతుంది.

రింగ్ అందుకే పెడతారు:కృష్ణ మాటలకు మురారి సపోర్ట్ చేస్తాడు. అప్పుడామె 'కానీ పెద్దత్తయ్యకు ముకుంద మీద నమ్మకం కలిగిందో లేదో అని అనుమానంగా ఉంది' అంటుంది. దీంతో మురారి 'ఇంత జరిగిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటుంది? మన శోభనం అయిపోయాక పూర్తిగా నమ్మకం వచ్చేస్తుంది. పెళ్లిలో ఉంగరం ఎందుకు తొడుగుతారో తెలుసా? ఉంగరానికి ఎక్కడ గ్యాప్ ఉండదు. ఈ ఉంగరం లాగే భార్యాభర్తలు కూడా గ్యాప్ లేకుండా కలిసి మెలిసి ఉండాలని అర్థం. ఈ ఉంగరం లాగే సంసారం కూడా స్మూత్ గా సాగిపోవాలని కోరుకుంటూ అలా చేస్తారు' అని చెప్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode February 2nd

నా కొడుకు ఏమైపోతాడు:ముకుంద ప్రవర్తన గురించి భవానీ 'ముకుంద నిజంగానే కృష్ణ మీద అభిమానంతో చేసిందా? లేదంటే ఆదర్శ్‌తో రింగ్ పెట్టించుకోవడం ఇష్టం లేక అలా చేసిందా? కృష్ణ మీద లేనిపోని అభిమానం చూపిస్తుంది. అసలు తనను ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని చూస్తుంటే రోజురోజుకీ అనుమానం పెరుగుతుంది కానీ నమ్మకం కలగడం లేదు. నా డౌటే నిజం అయితే ఎన్నో ఆశలతో తిరిగి వచ్చిన నా కొడుకు అసలు ఏమైపోతాడు. ముకుంద మారలేదని తెలిస్తే ఉంటాడా? ఈ సారి వెళ్తే జన్మలో కనిపిస్తాడా? కృష్ణ జీవితంలో ఏ సమస్యలు మొదలవుతాయో' అనుకుంటుంది.

శోభనానికి ముహూర్తాలు:భవానీ ఆలోచిస్తుండగా రేవతి వచ్చి 'పంతులు వచ్చి శోభనానికి ముహూర్తం లేవని చెప్పిన దగ్గర నుంచి మీలో మార్పు వచ్చింది. అందుకని పంతులుతో మాట్లాడి పెట్టుడు ముహూర్తం పెట్టించనా? రేపు ముహూర్తం ఉంది. మీరు సరే అంటే మురారి వాళ్లకు, ఆదర్శ్ వాళ్లకు కార్యం జరిపించేస్తాను' అని చెప్తుంది. దీంతో భవానీ 'పది పదిహేను రోజుల్లో ముహూర్తం ఉందని అన్నారు కదా.. మళ్ళీ పెట్టుడు ముహూర్తం పెట్టించడం దేనికి' అని కోపంగా అడుగుతుంది. దీంతో రేవతి ఇది అందరూ మామూలుగా చేసేదే కదా అని ఆమెకు సర్ది చెప్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode February 2nd

ఓపిక పట్టలేవా అంటూ:రేవతి మాటలకు భవానీ 'పది రోజులు ఓపిక పట్టలేవా? కావాలంటే మురారి వాళ్లకు పెట్టు. ఆదర్శ్ వాళ్లకు వద్ధు. పిల్లలకు లేని తొందర నీకెందుకు' అని ప్రశ్నిస్తుంది. దీనికామె 'పెళ్లై ఏడాది అవుతున్నా పిల్లలు లేరు. భార్యాభర్తలుగా ఒకటి కాకపోతే జీవితం ఏముంటుంది' అంటుంది. అప్పుడు భవానీ 'భార్యాభర్తలు కావాలని నువ్వు ఆలోచిస్తున్నావ్. శోభనం జరిగితే వాళ్ళ జీవితం అంధకారం అవుతుందేమోనని నేను భయపడుతున్నాను. ఆదర్శ్ అంటే ఇష్టం లేకుండా ముకుంద ఎన్నాళ్ళు నాటకం ఆడుతుంది. శోభనం రోజు బయట పడుతుంది కదా. అదే జరిగితే ఆదర్శ్ శాశ్వతంగా ఇంటికి దూరం అవుతాడు. అలా జరగకూడదని నేనే కావాలని ముహూర్తం లేదని శోభనాన్ని పొడిగిస్తున్నాను అది నికేలా చెప్పాలి' అని మనసులోనే బాధ పడుతుంది.

కృష్ణ వాళ్లను ఒప్పించు:భవానీ మాటలతో రేవతి 'పిల్లల కోసం మాత్రమే కాదు.. మీ గురించి ఆలోచించి కూడా శోభనం కోసం జరిపిద్దాం' అంటుంది. దీనికామె 'అయినా నన్ను ఒప్పించడం కాదు.. వెళ్ళి కృష్ణ వాళ్ళను ఒప్పించు. పెట్టుడు ముహూర్తం కోసం మంచి ముహూర్తానికి ఆదర్శ్ వాళ్ళకి జరిపిస్తాను' అని చెప్తుంది. తర్వాత భవానీ 'ముకుంద మనసులో ఏముందో తెలిసే వరకు.. మురారి తన మనసులో లేడని ఆదర్శ్‌ను ఇష్టపడుతుందని తెలిసే వరకు శోభనానికి ముహూర్తం పెట్టేదె లేదు' అని నిర్ణయించుకుంటుంది. దీంతో రేవతి దిగాలుగా కూర్చుని బాధ పడుతూ ఉంటుంది.

కృష్ణకు కూడా షాకిచ్చి:రేవతిని మురారి వాళ్లు అడగ్గా ఆమె భవానీ అన్న మాటలను చెప్తుంది. దీంతో ఆమెను ఒప్పిస్తానని కృష్ణ వెళ్తుంది. అప్పుడు భవానీ 'ఏంటి రేవతి రికమండేషన్ తీసుకొచ్చావా? రేవతి మాట్లాడిన విషయమే నువ్వు మాట్లాడేటట్టు అయితే వద్దు' అని తేల్చి చెప్తుంది. అప్పుడు కృష్ణ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. దీంతో భవానీ 'నాకు ఎలాంటి అనుమానాలు లేవు వాళ్ళు ఎప్పటికీ కలిసి సంతోషంగా ఉండాలనే ఈ కార్యం వద్దని చెప్తున్నాను ఏ ముహూర్తాన పెళ్లి చేశానో అప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శోభనానికి పెట్టుడు ముహూర్తం పెట్టిస్తే ఏదైనా జరగరానిది జరిగితే భరించే ఓపిక నాకు లేదు. ఆ ముహూర్తం మీకు సరిపోతుందని అంటే మీరు ఏర్పాటు చేసుకోండి' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X