Krishna Mukunda Murari: కృష్ణ జీవితంలో మరో కీడు.. నిజం చెప్పేసిన ముకుంద.. కథలో ఊహించని మలుపులు

ఈ మధ్య కాలంలో కొత్త కొత్త షోలు ప్రారంభం అవుతున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఏం జరిగిందంటే:కృష్ణ, మురారి బైక్ మీద వెళ్తుండగా వాళ్లకు ఓ అబ్బాయి అడ్డుగా వస్తాడు. అతడి పరిస్థితిని తెలుసుకుని వాళ్లు సహాయం చేస్తారు. ఇంట్లో కృష్ణ పూజ చేస్తుండగా హారతి కర్పూరం కింద పడి ఫ్లోర్ కాలిపోతుంది. అది జరిగిన తర్వాత ఆమె కంగారు పడుతూ ఉండగా.. మురారి ధైర్యం చెప్తాడు. ఇక, కృష్ణ వాళ్లు గుడికి వెళ్తుండగా ఆదర్శ్ వాళ్లను కూడా తీసుకెళ్లమంటారు. కానీ, ముకుంద మళ్లీ తప్పించుకుంటుంది. అనంతరం పంతులుతో కృష్ణ వరుసగా జరుగుతున్న అశుభాల గురించి చెప్తుంది. దీంతో ఆయన మురారి జాతకం అడిగి తీసుకుని.. ఆమెకు ఓ మంత్రం చెబుతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode February 6th

కృష్ణ జీవితంలో మరో కీడు:పంతులు చెప్పినట్లుగా కృష్ణ దేవుడి ముందు హారతి కర్పూరం వెలిగించి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటుంది. అయితే, ఒక్కసారిగా ఆ హారతి ఆరిపోతుంది. దీంతో కృష్ణ భయం మరింత పెరుగుతుంది. గాలికి దీపం ఆరుతుంది కానీ కర్పూరం ఆరుతుందా అని కృష్ణ కంగారు పడుతుంది. దీంతో పంతులు 'భయపడకమ్మ ఏదో చిన్న పరీక్ష కోసం కర్పూరం వెలిగించమని చెప్పాను. కానీ ఇది కీడు అని చెప్పలేదు' అని అంటాడు. కానీ, మనసులో మాత్రం 'నీ జీవితంలో ఏదో కీడు జరగబోతుందని చెప్పి నిన్ను ఇంకా భయపెట్టలేను' అని అనుకుంటాడు.

జీవితం మలుపు తిరుగుద్ది:పంతులు చెప్పిన మాటలను నమ్మని కృష్ణ 'మీరు ఏదో దాస్తున్నారు. పంతులు ఇది దేనికి సంకేతం? ఏదో జరుగుతుంది చెప్పండి' అని అడుగుతుంది. దీనికాయన 'దేవుడి రాసిన రాతను ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. భారం దేవుడి మీద వేస్తే ఆయన చూసుకుంటారు' అని సర్ది చెప్తాడు. కానీ కృష్ణ మాత్రం మనసుకి సర్ది చెప్పుకోలేకపోతుంది. మనసులో వాటి గురించే ఆలోచిస్తూ దిగులుగా వెళ్తుంది. అప్పుడు పంతులు 'ఈ సంకేతాలు చూస్తే వీళ్ల దాంపత్య జీవితానికి ఏదో ఆపద కలగబోతుందని అనిపిస్తుంది. ఈమె జీవితం ఏ మలుపు తిరగబోతుందో' అనుకుంటాడు.

ముకుందకు భర్త ప్రపోజ్:బెస్ట్ కపుల్ కాంపిటీషన్ గురించి ముకుంద ఆలోచిస్తూ 'ఈ మనిషితో ఒక ఇంట్లో ఒకే గదిలో ఉండటం నరకంగా ఉంది అంటే.. కాంపిటీషన్ పేరుతో అందరి ముందు క్లోజ్‌గా ఉండి డాన్స్ చేయడం నా వల్ల కాదు. ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుండగా ఆదర్శ్ వస్తాడు. ఆ వెంటనే గులాబీ పూలు చేతిలో పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని ఐలవ్యూ అని ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ముకుంద షాకై చూస్తుంది. దీంతో ఆదర్శ్ రెస్పాన్స్ లేదేంటి ఐలవ్యూ టూ చెప్పు అని అడుగుతాడు. ఆ తర్వాత ఆదర్శ్ మళ్ళీ హ్యాపీ వాలంటైన్స్ డే అని చెప్పినా ఆమె పట్టించుకోదు.

Krishna Mukunda Murari Serial Today Episode February 6th

వాళ్ల గురించి అనవసరం:ఆదర్శ్ తీరుకు షాకైన ముకుంద ఏమైందని అడగ్గా.. కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్తాడు. అంతేకాదు, 'ఎలాగైనా మనమే గెలవాలని ఇంట్లో వాళ్ళు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మనమే గెలవాలి. మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా చూశాను. ఒకసారి ట్రై చేద్దామా' అని ఆదర్శ్ అడుగుతాడు. దీంతో ముకుంద 'ఇప్పుడు నాకు డాన్స్ ప్రాక్టీస్ చేసే మూడ్ లేదు. అసలు నాకు ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపెట్ చేయాలని లేదు' అంటుంది. దీంతో ఆదర్శ్ షాక్ అవుతాడు. వెంటనే ఆమెను అర్థం చేసుకున్నట్లుగా మాట్లాడతాడు.

నిజం చెప్పిన ముకుంద:ఆ తర్వాత ఆదర్శ్ 'మనం ఆల్రెడీ బెస్ట్ కపుల్. మనమే గెలుస్తాం' అంటాడు. దీనికామె 'నాకు గెలుపు అవసరం లేదు. అసలు నాకు కాంపిటీషన్‌లో పార్టిసిపెట్ చేయాలని లేదు. అందరి ముందు అలా చెప్పలేక మిమ్మల్ని కారణంగా చూపించాను' అంటుంది. దీంతో ఆదర్శ్ 'ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఏమైంది నీకు? నువ్వు మారావాని చెప్తేనే కదా నేను వచ్చాను. ఒక్క విషయం చెప్పు నువ్వే కృష్ణ మురారిని పంపించావ్ కదా. మన మధ్య దూరం చెరిగిపోయిందని అనుకుంటే మళ్ళీ ఎందుకు దూరం పెంచుతున్నావ్? నా పక్కన డాన్స్ చేయడం ఇష్టం లేదా' అంటాడు.

సర్ధి చెప్పిన ముకుంద:ఆదర్శ్ నిలదీయడంతో 'అదేం లేదు.. నేను అందరి ముందు డాన్స్ చేయలేను. అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. మన కృష్ణ ఉంది తనకి ఈ కొత్త పాత ఉండదు. డాన్స్ ఏమైనా చేస్తుంది కానీ నేను అలా కాదు' అంటూ సర్ధి చెప్తుంది. దీంతో ఆదర్శ్ 'బయటకి వెళ్దామని అంటే డస్ట్ అలర్జీ అంటావ్.. కాంపిటీషన్ అంటే అందరి ముందు చేయలేను అంటావు. కానీ ఇవేవి అందరి ముందు చెప్పవు. అక్కడ సైలెంట్‌గా ఉండి నా ముందు చెప్తే ఎలా. ఇప్పుడు కాంపిటీషన్‌కు వెళ్ళమని చెప్తే ఏమనుకుంటారో ఏమో' అంటాడు. దీంతో ఏదో ఒకటి చేయమని బ్రతిమాలుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode February 6th

కృష్ణలో మరింత భయం:కృష్ణ ఇంట్లో డల్‌గా ఉండడంతో మురారి 'గుడికి వెళ్ళి పంతులును కలిశావు కదా ఇంకెందుకు టెన్షన్' అని అడుగుతాడు. దీనికామె 'ఇంట్లో దీపం ఆరిపోతే గుడిలో ఏకంగా హారతి కర్పూరం కూడా ఆరిపోయింది' అని చెప్తుంది. దీంతో మురారి ధైర్యం చెప్తాడు. అప్పుడు కృష్ణ 'పంతులు దేవుడి మీద భారం వేయమని ధైర్యం చెప్పి పంపించారు' అని చెప్తుంది. దీంతో మురారి 'మనం భార్యాభర్తలుగా ఉంటామని అనుకున్నామా? ముకుందని ప్రేమించాను తనను ఆదర్శ్‌కు ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అగ్రిమెంట్ రాసుకున్నాం విడిపోవాలని అనుకున్నాం. కానీ అది జరగలేదు కదా. సంతోషంగా ఉందామని అనుకుంటే సమస్యలు కష్టాలు వచ్చాయి' అని చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X