Krishna Mukunda Murari: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ.. ముకుంద మైండ్ బ్లాక్.. భవానీ ఏం చేయబోతుంది?

జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

మంగళవారం ఏం జరిగిందంటే:కృష్ణకు కీడు శంకించడంతో పంతులు చెప్పినట్లు దేవుడి ముందు కర్పూరం వెలిగిస్తుంది. కానీ, అది కూడా ఆరిపోవడంతో కంగారు పడుతుంది. కానీ, పంతులు ఆమెకు ధైర్యం చెప్పి.. మనసులో మాత్రం ఆమెకు ప్రమాదం జరగబోతుందని అనుకుంటాడు. ఇక, డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని ఆదర్శ్ అడగడంతో ముకుంద తనకు కాంపిటీషన్‌లో పాల్గొనడం ఇష్టం లేదన్న నిజం చెప్పేస్తుంది. అంతేకాదు, అందులో పాల్గొనవద్దని అతడిని బ్రతిమాలుతుంది. ఇక, గుడిలో జరిగింది మొత్తం కృష్ణ.. మురారికి చెబుతుంది. దీంతో అతడు ఆమెను ధైర్యంగా ఉండమని ఓదార్చుతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode February 7th

ఆదర్శ్‌ను ప్రశ్నించిన మధు:ఆదర్శ్ ముకుంద మాటల గురించే ఆలోచిస్తూ ఉండగా మధు చూస్తాడు. అప్పుడు 'తనకు కూడా నాకులాగా ముకుంద మీద డౌట్ వచ్చి ఉంటుంది. పాపం ఎక్కడో ప్రశాంతంగా ఉంటున్న వాడిని వెతికి మరీ తీసుకొచ్చింది. కృష్ణ పిచ్చి కానీ ముకుంద ఎందుకు మారుతుంది. తొండ మ్యాటర్ ఇంకా తెలియలేదు ఒకసారి కదలించి చూద్దాం' అని ఆదర్శ్‌ను పలకరిస్తాడు. అప్పుడు ఏమైందని అడగ్గా.. ఏం లేదని అంటాడు. దీంతో మళ్ళీ తొండ గురించి అడగడంతో 'తొండ గుడ్డులో నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మ పెట్టిన గుడ్డులో నుంచి' అని ఆదర్శ్ వెళ్లిపోతాడు.

బ్యాడ్ న్యూస్ చెప్పిన గోపీ:మురారికి గోపి ఫోన్ చేసి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ క్యాన్సిల్ అయిందని చెప్తాడు. అప్పుడే కృష్ణ వచ్చి ఏమైందని అడిగితే విషయం చెప్తాడు. అంతేకాదు, 'దీన్ని అడ్డం పెట్టుకుని ముకుంద వాళ్లను గెలిపించి పెద్దమ్మ మనసు మార్చవచ్చు అనుకున్నా' అంటాడు. విషయం తెలిసి షాకైన కృష్ణ.. తర్వాత సంతోషంగా అరుస్తుంది. దీంతో మురారి ఏమైంది తింగరి మొత్తం బుర్ర పోయిందా అని అంటాడు. దీనికామె 'గోపి పెట్టిన కాంపిటీషన్‌లో ముకుంద వాళ్లు గెలుస్తారనే గ్యారెంటీ లేదు. మనం చాలా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ మనమే ఎరేంజ్ చేద్దాం' అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode February 7th

కృష్ణ అలా.. ముకుంద ఇలా:ఆ తర్వాత కృష్ణ 'మన ఇంట్లో ఉన్న కపుల్స్‌తో కాంటెస్ట్ పెడదాం. అప్పుడు వాళ్లను గెలిపించడం మన చేతుల్లోనే ఉంటుంది. ముకుంద, ఆదర్శ్ ఒకరిమీద ప్రేమ మరొకరు బయట పెట్టుకునే విధంగా క్లోజ్‌గా మూవ్ అయ్యేలా చేయవచ్చు. పెద్దత్తయ్య అనుమానం పటాపంచలు అవుతుంది' అని చెప్తుంది. దీంతో కృష్ణ ఐడియా సూపర్‌గా ఉందని మురారి మెచ్చుకుంటాడు. మరోవైపు ముకుంద 'అత్తయ్యకు ఏ మాత్రం డౌట్ రాకుండా మాట్లాడు' అని ఆదర్శ్‌కు చెప్తుంది. దీంతో అతడు తల్లి దగ్గరకు వెళ్లగా.. ఏం చేస్తావని అడుగుతుంది. దీంతో ఆలోచించలేదు అంటాడు.

ఆ మాట చెప్పగానే హ్యాపీగా:ఆదర్శ్ మాటకు భవానీ 'సరే నువ్వు ఏం చేయాలో చెప్పొచ్చా. అయితే ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు చేయడానికి సిద్ధంగా ఉండు' అంటుంది. దీంతో పక్కనే ఉన్న ముకుంద 'ఏం చెప్తారు నా గురించి పూర్తిగా తెలిసిపోయిందా? నన్ను దోషిగా నిలబెట్టి బయటకి పంపించాలని చూస్తున్నారా' అని మనసులో అనుకుంటుంది. అప్పుడే మురారి వాళ్లు వస్తే 'బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ఎంత వరకు వచ్చింది? ముకుంద డాన్స్ ఇరగదీసేస్తుంది' అని నందినీ అంటుంది. దీంతో ప్రోగ్రామ్ రద్దైందని మురారి చెప్పడంతో ముకుంద సంతోషిస్తుంది.

బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మురారి:మురారి చెప్పడంతో మధు 'ప్రోగ్రామ్ ఉంటుంది.. మీ రెండు జంటలు పార్టిసిపెట్ చేస్తే చూసి ఎంజాయ్ చేయాలని అనుకున్నా. కానీ షాక్ ఇచ్చి డిసప్పాయింట్ చేశావు' అంటాడు. దీంతో కృష్ణ 'అంత అవసరం లేదు.. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా ఎంజాయ్‌మెంట్‌కు ఢోకా లేదు. అక్కడ గోపి చేసిన ప్లాన్ క్యాన్సిల్ అయింది కానీ అది మనం హ్యాండోవర్ చేసుకుందాం' అని చెప్తుంది. దీంతో ఆదర్శ్ ఏంటని అడగ్గా.. మురిరా 'అవును కానీ అక్కడ కాదు. వాలెంటైన్స్ డేన మన ఇంట్లో ఉన్న జంటలతో మనం కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం' అని చెప్పి ముకుందకు షాకిస్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode February 7th

భవానీలో మరింత డౌట్:ఆ తర్వాత కృష్ణ 'ఈ కాంపిటీషన్‌లో గెలిచిన వాళ్లకు పెద్దత్తయ్య గిఫ్ట్ ఇస్తారు. ఆదర్శ్ గెలిస్తే బిజినెస్ పెట్టిస్తుంది' అని ప్రకటిస్తుంది. అయినా ముకుంద డల్‌గానే ఉంటుంది. దీంతో భవానీ 'కాంపిటీషన్ క్యాన్సిల్ అవగానే ముకుంద ముఖం వెలిగిపోయింది. మళ్ళీ అదే ఇంట్లో చేస్తామని అనగానే మాడిపోయింది. దీని బట్టే అర్థమైంది ఆదర్శ్ తన పక్కన ఉండటం ఇష్టం లేదని. ఈ విషయం నాకు అర్థమైంది. కానీ ఇంట్లో ఎవరికీ ఎందుకు అర్థం కావడం లేదు. కృష్ణ గమనిస్తే మొహం మీదే అడిగి కడిగేస్తుంది. కానీ ముకుంద మారిందనే భ్రమలో ఉంది' అనుకుంటుంది.

ఎంజాయ్ చేసేందుకు:మురారి వాళ్లు ఆదర్శ్ వాళ్లతో కలిసి బయటకు వెళ్దాం అంటారు. దీంతో ముకుంద 'మురారితో రావడానికి సిద్ధం' అంటుంది. ఆ వెంటనే ఉత్సాహంగా రెడీ అవుతుంది. కానీ, 'ఇంట్లో ఎలాగో మ్యానేజ్ చేస్తున్నాను కానీ బయట మ్యానేజ్ చేయడం ఎలా? కృష్ణతో మురారి క్లోజ్‌గా ఉంటాడు. వాళ్లను చూసి ఆదర్శ్ నాతో క్లోజ్ ఉండటానికి ట్రై చేస్తాడు. దూరం పెడితే కృష్ణ వాళ్ళకు అనుమానం వస్తుంది. అదే జరిగితే ఇంట్లో చోటు లేనట్టే. వాళ్ళకి అనుమానం రాకుండా నాకు ఇబ్బంది లేకుండా ఎలా మ్యానేజ్ చేయాలి' అని అనుకుంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X