Krishna Mukunda Murari: ముకుందపై కృష్ణకు డౌట్.. మురారితో బిడ్డను కనాలని కోరిక.. గుడిలో ఊహించని ఘటన
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఏం జరిగిందంటే
ముకుంద, ఆదర్శ్ నిజంగానే అన్యోన్యంగా ఉంటున్నారో లేదో తెలుసుకునేందుకు కృష్ణ వాళ్లను తమతో పాటే బయటకు రావాలని అడుగుతుంది. అప్పుడు ముకుంద.. మురారితో కలిసి వెళ్లొచ్చు అని ఓకే అంటుంది. ఆ తర్వాత ముకుంద ఆదర్శ్ నిజంగా సరిగా ఉంటున్నారా అని కృష్ణ.. మురారిని అడుగుతుంది. దీంతో ఎందుకు ఆ డౌట్ వచ్చింది అనగా.. 'నాకు కాదు పెద్దత్తయ్యకు వచ్చిన అనుమానం నిజమేనని నా అనుమానం. లేకపోతే ఊరికే పెద్దత్తయ్యకి అంత అనుమానం ఎలా వస్తుంది. 'నిజమే కానీ మనకి అలా అనిపించడం లేదుగా. మనం సరిగా పరిశీలించడం లేదేమో ఇప్పుడు బయటకి వెళ్తున్నాం కదా. అక్కడ అబ్జర్వ్ చేద్దాం' క్లారిటీ వస్తుంది అంటుంది.

అందరూ కలిసి కారులో వెళ్తుండగా ముకుంద, ఆదర్శ్ సైలెంట్‌గా ఉంటారు. అప్పుడు కృష్ణ 'ఇద్దరూ ఏ సంబంధం లేనట్టు ఎవరికి వాళ్ళు ఉన్నారు. పెద్దత్తయ్య అనుమానం నిజమేనా? ముకుంద మారలేదా? మరి ఆదర్శ్‌కు ఏమైంది? తనైనా మాట్లాడొచ్చు కదా' అనుకుంటుంది. తర్వాత ఆమె 'కారు ఇంటికి పోనివ్వండి సరదాగా మాట్లాడుకోకుండా మూతులు ముడుచుకుని కూర్చున్నారు' అంటూ మురారికి సైగలు చేస్తుంది. దీంతో మురారి కూడా అవును ఏం మాట్లాడరు ఏంటి అంటాడు.
ఆ తర్వాత కృష్ణ 'మనం ఏదో పార్టీ అని గోల చేయడం వల్ల బలవంతంగా బయటకి వచ్చారు. మనతో రావడం ఇష్టం లేదని అర్థం అయింది' అంటుంది. దీంతో ఆదర్శ్ అదేం లేదు అని చెప్తాడు. అప్పుడు ముకుంద 'ఏదో ఒకటి మ్యానేజ్ చేయాలి. లేదంటే డౌట్ వస్తుంది' అని మనసులో అనుకుంటుంది. అంతలోనే కృష్ణ 'ఏసీపీ సర్ క్యాబ్ డ్రైవర్ అయినట్టు.. మీరేదో క్యాబ్ షేర్ చేసుకున్నట్టు కూర్చున్నారు' అని కౌంటర్ వేస్తుంది. అప్పుడు ముకుంద 'మాట్లాడటానికి ఏం లేదు. నా ఫేవరెట్ సాంగ్ వస్తుంటే వింటున్నాను' అంటూ కవర్ చేస్తుంది.

ముకుంద అనగానే కృష్ణ 'యవ్వనంలో ఉన్న రెండు జంటలు షికారుకు వెళ్తుంటే.. ఎవరైనా ఈ పాత పెట్టుకుంటారా? మంచి ఊపున్న పాట పెట్టుకోవాలి' అని సాంగ్ మారుస్తుంది. అప్పుడు ముకుంద పాటల టేస్ట్ విషయంలో మురారి నేను ఒకటే అంటుంది. దీంతో కృష్ణ ముఖం వాడిపోతుంది. తర్వాత గుడి దగ్గరకు వెళ్లిన వెంటనే కృష్ణ మరోసారి వాళ్లపై అనుమానం వ్యక్తం చేస్తుంది. భార్యభర్తకు భేదాభిప్రాయాలు ఉంటే ఎలా అంటుంది. దీంతో మురారి 'ఇష్టాలు వేరైనంత మాత్రన అలా అనుకోకూడదు' అంటాడు.
కృష్ణ, మురారి రాకపోయే సరికి వాళ్లు తమను కలపడానికి ఎంతో కష్టపడుతున్నారని ముకుంద, ఆదర్శ్ ఆనుకుంటారు. అప్పుడు ఆదర్శ్ కూడా ముకుంద తనను ప్రేమిస్తుందని నమ్ముతాడు. అనంతరం రెండు జంటలు కలిసి దేవుడిని దర్శించుకోడానికి లోపలికి వెళ్తారు. అప్పుడు పంతులు ముకుంద, కృష్ణలను పిల్లా పాపలతో ఉండాలని దీవిస్తాడు. కానీ, ముకుంద మాత్రం మురారితో తాను పిల్లల్ని కంటే బాగుంటుందని అనుకుంటుంది. అప్పుడు పంతులు ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరతాయని చెప్తాడు.

మురారి, కృష్ణ మనసులో కోరికలు చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగానే ధ్వజస్తంభానికి ఉన్న గంట కింద పడుతుంది. దీంతో కృష్ణ ఇంకా భయపడుతుంది. ఆ తర్వాత ఆదర్శ్ కొబ్బరి కాయ కొడుతుండగా గాయం అవుతుంది. కానీ, ముకుంద మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటుంది. దీంతో కృష్ణ వచ్చి ఆమెకు విషయం చెప్పడంతో ఆదర్శ్‌ను మురారి అనుకుని ఊహించుకుంటూ చేయి పట్టుకుంటుంది. ఇలా నిన్నటి ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











