Krishna Mukunda Murari: కృష్ణ కోసం ముకుంద త్యాగం.. భవానీ నిర్ణయంపై ఉత్కంఠ.. ఈ ఎపిసోడ్‌లో ఏమైందంటే!
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఏం జరిగిందంటే:దేవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. దీంతో కృష్ణ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత ఔట్ హౌస్‌కు వెళ్లి జరిగిన విషయం మొత్తం శకుంతలకు చెప్తుంది. దీంతో అందరూ ఆనందంగా ఉంటారు. అనంతరం ముకుందను భవానీ ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటుంది. అప్పుడామె ఎంత చెప్పినా వినిపించుకోదు. ఆ సమయంలోనే ముకుందకు కృష్ణ అండగా నిలుస్తుంది. ముకుందను క్షమించమని అడుగుతుంది. కానీ, భవానీ దేవి మాత్రం అస్సలు వినిపించుకోదు. అయినా కృష్ణ మాత్రం ఆమె వైపు మాట్లాడడంతో అందరూ షాక్‌లో ఉండిపోతారు.

అండగా నిలిచిన కృష్ణ:ముకుంద తరపున మాట్లాడిన కృష్ణతో భవానీ 'తప్పు చేయని మిమ్మల్నే ఇంతగా శిక్షించిన నేను.. ముకుందను ఎలా వదిలేస్తాను? తను ఏ తప్పు చేయదని పోనీ నువ్వు పూర్తి బాధ్యత తీసుకుంటావా? చేస్తే నువ్వు బాధ్యత వహిస్తానని చెప్పగలవా' అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో అక్కడున్న వాళ్లంతా వద్దు అన్నట్లుగా సైగలు చేస్తారు. కానీ, కృష్ణ మాత్రం 'తీసుకుంటాను.. బాధ్యత తీసుకుంటాను. తనను క్షమించండి' అంటుంది. దీంతో భవానీ దేవి సరే అని లోపలికి వెళ్లిపోతుంది. అలా బాధపడుతున్న ముకుందను కృష్ణ ఓదార్చుతూ మాట్లాడుతుంది.

కృష్ణ కోసం ముకుంద:తనకు అండగా నిలబడిన కృష్ణ కోసం ముకుంద కూడా ముందుకు వస్తుంది. ఇందుకోసం భవానీ దేవి దగ్గరకు వచ్చి 'చేయని నేరానికి కృష్ణ ఔట్ హౌస్‌లో ఉంది. తను ఈ ఇంట్లో ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కావాలంటే నేను ఔట్ హౌస్‌లో ఉంటా' అని చెప్తుంది. అప్పుడు మురారి కూడా 'అవును పెద్దమ్మ ఇక కృష్ణ అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది' అని అంటాడు. కానీ భవానీ మాత్రం ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











