Krishna Mukunda Murari: ప్రభాకర్‌కు బెయిల్.. భవానీ ఊహించని నిర్ణయం.. కృష్ణ - మురారి శోభనం కోసం!

ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

బుధవారం ఏం జరిగిందంటే:తన గదిలో ఉన్న కృష్ణ ఫొటోలను చూసుకుంటూ మురారి మురిసిపోతూ ఉంటాడు. అంతేకాదు, 'ఇన్నాళ్ళూ ఏదో ఒక కారణంతో దగ్గర కాలేకపోయాము. ఇప్పుడు ఏ అడ్డు లేదు. నువ్వు అన్నట్టు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెళ్దాం' అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కృష్ణ కాఫీ పట్టుకుని వస్తుంది. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ముహూర్తం పెట్టించమని అమ్మని అడిగేస్తానని అంటాడు. దీనికి కృష్ణ 'ఈ బిల్డప్ నాముందే. అత్తయ్య ముందు అడగలేరు' అని అంటుంది. దీంతో నీకోసం ఏదైనా చేస్తానని మురారి చెప్తాడు.

Krishna Mukunda Murari Serial Today Episode January 11th

ఆదర్శ్‌ను తీసుకురావాలని:ఆ తర్వాత మురారి ముకుందను ఇంట్లోనే ఎందుకు ఉండమన్నావు అని ప్రశ్నిస్తాడు. దీంతో కృష్ణ 'తన స్థానంలో ఉండి ఆలోచించి అలా చేశాను. పెళ్లి చేసుకున్న వాడు పెళ్లి రోజే వెళ్ళిపోయాడు. ప్రేమించిన వాడు ఎదురుగానే ఉన్నా దక్కలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని ఒంటరిగా వదిలేస్తే ఎలా' అంటుంది. దీనికి మురారి అందుకని మనం ఏం చేస్తామని అంటాడు. అప్పుడామె 'ఎందుకు చేయలేము? ఆదర్శ్‌ను తీసుకొచ్చి తనని కలపాలి. వాళ్ళు కాపురం చేసేలా చేయాలి' అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది.

కృష్ణను అక్కడే ఉంచాలని:నిద్రలేచి కిందకు దిగి వస్తున్న మధుకర్.. ఎదురుగా ఉన్న భవానీకి గుడ్ మార్నింగ్ చెప్తాడు. దీంతో అతడిని ఏ పని చేయట్లేదని తిడుతుంది. అంతలోనే ముకుంద కాఫీ తీసుకువస్తుంది. అప్పుడు భవానీ 'మధు నువ్వు ఖాళీగా ఉండే పని అయితే మీ అత్తగారి ఇంటికి ఇల్లరికం వెళ్లిపో. ఇంట్లో ఎవరు ఖాళీగా ఉండటం ఇష్టం లేదు' అని సీరియస్‌గా చెప్తుంది. అప్పుడే కృష్ణ, మురారి వస్తారు. రేవతి ఏదో ఆలోచిస్తుంటే ఏంటి ఆలోచిస్తున్నారని కృష్ణ అడుగుతుంది. దీనికి రేవతి 'కృష్ణ ఔట్ హౌస్‌లో ఎందుకు? ఇక్కడే ఉంచమని చెప్పాలి' అని మనసులో అనుకుంటుంది.

కృష్ణను ఇంటికి రమ్మనాలి:భవానీ దగ్గరకు వెళ్లిన ముకుంద ఆమె కాళ్లు పట్టుకుని 'నాదొక రిక్వెస్ట్. దయచేసి కాదనొద్దు. చేయని నేరానికి కృష్ణ ఇంట్లో నుంచి ఔట్ హౌస్‌లోకి మారింది. తనకు ఈ ఇంట్లో ఉండటానికి అన్ని హక్కులు ఉన్నాయి. కావాలంటే నేను ఔట్ హౌస్‌లో ఉంటా' అంటుంది. అప్పుడు రేవతి 'ఇదేంటి నేను చెప్దామని అనుకున్నది ముకుంద చెప్పేస్తుంది. నిజంగా తను మారిపోయిందా' అనుకుంటుంది. అప్పుడు మురారి 'అవును పెద్దమ్మా.. ముకుంద అన్నదాంట్లో నిజం ఉంది. కృష్ణ అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది' అని అంటాడు.

కృష్ణ - మురారి శోభనంతో:ముకుంద చెప్పగానే భవానీ దేవి 'రేవతి.. కృష్ణ ఏర్పాట్లు ఏవో నువ్వే చూడు' అంటుంది. దీంతో సంతోషంతో పొంగిపోతూ అందరినీ హగ్ చేసుకుంటుంది. భవానీ దగ్గరకి వెళ్లి కూడా హగ్ చేసుకోబోతుంటే 'ఈ తింగరి వేషాలు వేయొద్దని చెప్పాను' అని సీరియస్ అవుతుంది. అప్పుడు రేవతి 'ముకుంద మారింది అన్నీ సమస్యలు తొలగిపోయినట్టే. ఇక, కృష్ణను ఇంటికి తీసుకొచ్చి వాళ్ల శోభనం చేస్తే చేతిలో ఏడాది తిరిగే లోపు చిన్న తింగరి పిల్ల ఉంటుంది' అని మురిసిపోతుంది. ఆ తర్వాత శకుంతల దగ్గరకి వెళ్లి దీని గురించి మాట్లాడాలని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode January 11th

శోభనం కోసం ఆరాటంగా:రేవతి వెళ్లి శకుంతలతో శోభనం గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మురారి వచ్చి శకుంతలను కూడా తమతో పాటు వచ్చేయమని అడగ్గా.. ఆమె రానని అంటుంది. అంతలోనే ముకుంద వచ్చి శకుంతలతో కలిసి ఉంటానని చెప్తుంది. తర్వాత అందరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటారు. ఆ తర్వాత ముకుంద యాక్టింగ్ చేస్తుందని వాళ్లు మాట్లాడుకుంటారు. ఇవన్నీ అయిన తర్వాత 'అమ్మని ముహూర్తాల గురించి అడుగుతా' అని కృష్ణకి చెవిలో చెప్తాడు. దీనికామె సిగ్గుపడడంతో మురారి కవర్ చేస్తాడు.

ప్రభాకర్‌ బెయిల్ కోసం:భవానీ లాయర్ సుందరాన్ని పిలిపిస్తుంది. అప్పుడు అతడితో 'ప్రభాకర్ గురించి మాట్లాడటం కోసం మిమ్మల్ని పిలిపించాను. అతని వ్యక్తిత్వం అర్థం చేసుకోలేకపోయాను. తన కూతురు కోసం నేను అంత పెద్ద నింద వేసినా మౌనంగా వెళ్లాడే తప్ప ఎదురు చెప్పలేదు. అతను బెయిల్ మీద బయటకి రావడం కాదు అసలు తన మీద కేసే లేకుండా చూడాలి' అని చెప్తుంది. దీంతో లాయర్ 'మర్డర్ కానీ యాక్సిడెంట్ కానీ చేయనట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి త్వరగానే బయటకి వచ్చేస్తాడు' అని చెప్తాడు. దీంతో భవానీ వీలైనంత త్వరగా చేయమని అడుగుతుంది.

నేటి ఎపిసోడ్‌లో ఇలా:ఈరోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో... కృష్ణను తీసుకుని మురారి బైక్ మీద వెళ్తుండగా.. ఆమెకు చలి పెడుతుంది. దీంతో వణికిపోతూ ఉండగా సడన్ బ్రేక్ వేస్తాడు. అప్పుడామె మురారిని గట్టిగా పట్టుకుంటుంది. అలా ఇద్దరూ రొమాన్స్ పండిస్తారు. ఆ తర్వాత రేవతి 'కృష్ణ అగ్రిమెంట్ బంధం శాశ్వతం చేద్దామని చెప్పారు కదా' అని అడుగుతుంది. దీనికి భవానీ 'త్వరలోనే ముహూర్తం పెట్టిద్దాం' అంటుంది. దీంతో రేవతి సంతోషిస్తుంది. ఈరోజు ఎపిసోడ్‌‌పై పూర్తి సమాచారం అప్‌డేట్ చేస్తాము.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X