Krishna Mukunda Murari: శుభవార్త చెప్పిన భవానీ.. ప్రామిస్ చేసిన ముకుంద.. మురారికి ఐలవ్యూ చెప్పడంతో!

జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

గురువారం ఏం జరిగిందంటే : జైల్లో ఉన్న ప్రభాకర్‌కు శకుంతల ఫోన్ చేస్తుంది. అప్పుడామె 'జైల్లో ఏదో లొల్లి పెట్టుకున్నావంట కదా. ఎందుకలా చేస్తున్నావ్? ఇప్పుడు అల్లుడు గారు ఫోన్ ఇప్పించబట్టి నీతో మాట్లాడుతున్నా' అని తిడుతుంది. దీంతో ప్రభాకర్ ఆమెకు సర్ధి చెప్పడంతో పాటు కాల్ కట్ చేసేస్తాడు. అంతలోనే అక్కడకు ముకుంద వాళ్లు వస్తారు. ఆ తర్వాత మురారి 'మామయ్య త్వరలోనే బయటకు వచ్చేస్తాడు' అని చెబుతాడు. అనంతరం ముకుంద సంక్రాంతి పండుగను అందరం కలిసి జరుపుకుందాం అని అంటుంది. అంతేకాదు, తానే దగ్గరుండి ఏర్పాట్లు చేస్తానని అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode January 12th

ముకుంద మీద వాళ్లకు డౌట్ : ముకుంద తీరును చూసి మధుకర్ సందేహం వస్తుంది. ఆమె అలా వెళ్లిపోగానే ముకుందతో జాగ్రత్తగా ఉండమని మధుకర్, రేవతి.. శకుంతలకు చెబుతారు. అంతేకాదు, ముకుంద మారలేదని, అందరి ముందూ కావాలనే నటిస్తుందని అంటారు. అప్పుడు మధు 'మీరు తన ముందు అనుమానంగా ఉండొద్దు. మామూలుగానే ఉండండి. లేదంటే తనకి డౌట్ వస్తుంది' అని చెబుతాడు. ఇదే విషయాన్ని సుమలత కూడా ప్రసాద్‌ను అడగ్గా.. తనకు కూడా అనుమానం ఉందని, కాకపోతే ఈసారి మళ్లీ తప్పు చేయదని అనిపిస్తుందని వివరిస్తాడు.

ఆదర్శ్‌ను తీసుకు రావాలని : కృష్ణ, మురారి బైక్ మీద ఓ వ్యక్తిని కలిసేందుకు వెళ్తారు. అక్కడ వాళ్లు అతడిని కలుస్తారు. అప్పుడు కృష్ణ 'ఆదర్శ్ ఆచూకీ గురించి ఎలాగైనా తెలుసుకుని మాకు చెప్పండి' అని అడుగుతుంది. అప్పుడాయన 'ఆదర్శ్‌కు ప్రమోషన్ వచ్చింది. తన పని చేసే ప్రదేశం కూడా మారింది. ఇప్పుడు ఆదర్శ్ ఎక్కడున్నాడో తెలియదు' అని అంటాడు. దీంతో వీలైనంత త్వరగా ఆదర్శ్ గురించి చెప్పమని కృష్ణ అతనికి చెప్తుంది. దీంతో మురారి 'ఆదర్శ్ కావాలని వెళ్ళిపోయాడు కాబట్టే తను మళ్ళీ తిరిగి రాడని అనిపిస్తుంది' అని అనగా.. ఎలాగైనా వాళ్లను కలుపుతానని కృష్ణ చెప్తుంది.

గుడ్ న్యూస్ చెప్పిన భవానీ : భవానీ దేవి దగ్గరకు వెళ్లిన రేవతి.. కృష్ణ, మురారికి శోభనం జరిపించాలని, అందుకు సంబంధించి ముహూర్తం పెట్టడం కోసం పంతుల్ని పిలిపిస్తున్నట్టు చెప్పాలని అనుకుంటుంది. అప్పుడు భవాని 'ప్రభాకర్‌ను విడిపించడానికి ఏర్పాటు చేశాను. వారం పది రోజుల్లో అతడి మీద ఎటువంటి కేసులు లేకుండా జైలు నుంచి బయటికి వచ్చేస్తాడు' అని రేవతికి చెబుతుంది. దీంతో ఆమె సంతోషిస్తుంది. ఆ తర్వాత రేవతి పంతుల్ని పిలిపించాలని అనుకుంటున్న విషయం రేవతి చెప్పగానే గుడ్ అలాగే చేయమని భవానీ అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode January 12th

శోభనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి : రేవతి మాటలకు భవానీ 'మురారి వాళ్ళ మధ్య ఉన్న అగ్రిమెంట్ బంధం శాశ్వతం చేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి మంచి ముహూర్తం చూసి జరిపించేద్దాం' అని చెప్తుంది. దీనికి రేవతి 'అక్క మీరు మాట్లాడేది వాళ్ల కార్యం గురించి కదా' అనగా అవును దాని గురించే నీకు నచ్చినట్టు చేయమని చెప్తుంది. భవాని మాటలకు రేవతి చాలా సంతోషంగా విషయం చెప్పడం కోసం శకుంతల దగ్గరికి వెళ్తుంది. వెంటనే వెళ్లి 'ప్రభాకర్ అన్నయ్యని విడిపించేందుకు భవాని అక్కయ్య ఏర్పాట్లు చేసిందని వారం రోజుల్లో జైలు నుంచి బయటకు వస్తాడు' అంటుంది.

ప్రామిస్ చేసిన ముకుంద : రేవతి చెప్పిన మాటలకు అందరూ సంతోషిస్తారు. అప్పుడు ముకుంద మాత్రం శకుంతకు క్షమాపణ చెప్తుంది. అంతేకాదు, ఇకపై కృష్ణ జీవితంలోకి తను ఎప్పటికీ రానని ప్రామిస్ చేస్తుంది. ఆ తర్వాత మధుకర్, నందినీ కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్లకి విషయం చెప్పడంతో సంతోషిస్తారు. అప్పుడే పంతులు ఫోన్ చేసి పండగ తర్వాత మంచి ముహూర్తం ఉందని అప్పుడు జరిపించుకోవచ్చు అని చెప్పడంతో రేవతి సంతోషిస్తుంది. ఆ సమయంలోనే ఇన్ని సమస్యలకి కారణం తనేనంటూ ముకుంద కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో మధు ఆమెపై డౌట్ పడతాడు.

శుక్రవారం ఎపిసోడ్ ఇలా : ముకుంద వ్యవహరిస్తున్న తీరుతో రేవతికి డౌట్ వస్తూనే ఉంటుంది. దీంతో వీలైనంత త్వరగా మురారి, కృష్ణ శోభనం జరిపించాలని అనుకుంటుంది. మరోవైపు, ఇంటికి వచ్చిన తర్వాత మురారి, కృష్ణ సరదాగా గడుపుతుంటారు. అప్పుడు కృష్ణ అతడి వీపుపై పేర్లు రాసి అవేంటో చెప్పమంటుంది. అలా ఇద్దరూ ఆడుకుంటోన్నప్పుడే కృష్ణ అతడికి ఐలవ్యూ చెప్తుంది. దీనికి మురారి కూడా హిందీలో బదులిస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్‌పై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X