Krishna Mukunda Murari: ముకుందను తీసుకొచ్చిన కృష్ణ.. భవానీని అంత మాట అనడంతో.. నిజం తెలియడంతో షాక్
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఏం జరిగిందంటే: సంక్రాంతి సందర్భంగా ఔట్ హౌస్‌లో పిండి వంటలు చేస్తుండగా మధుకర్ వీడియో తీస్తాడు. అందరూ తనతో మంచిగా ఉండడంతో ముకుంద సంతోషిస్తుంది. మురారికి ప్రేమ పరీక్ష పెట్టిన కృష్ణ అతడి వీపుపై కొన్ని రాస్తుంది. వాటిని అతడు కనిపెట్టాలని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. భోగి మంటలు పెట్టే సమయంలో మధుకర్ బాధ పడుతుండగా.. భవానీ అతడిలో చాలా టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేస్తుంది. దీంతో అతడు సంతోషిస్తాడు. ఆ తర్వాత ఇంట్లోని వస్తువులు తెచ్చి భోగి మంటలు వేసేందుకు అందరూ ఏర్పాట్లు చేస్తారు.
ముకుందను తీసుకొచ్చింది: శకుంతల భోగి మంటలను వెలిగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తర్వాత అందరూ అక్కడికి చేరుకుంటారు. భవాని కూడా వచ్చేస్తుంది. దీంతో అందరూ కలిసి భవానీని భోగి మంటలు వెలిగించమని అంటారు. ఆమె రెడీ అవుతుండగా కృష్ణకు ముకుంద ఒంటరిగా నిల్చుని ఉండడం కనిపిస్తుంది. అప్పుడు భవానీని ఆపేసి మరీ తనని కూడా పిలుద్దామని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ, ఆమె మాట్లాడకుండా చూస్తుంది. అప్పుడు ఇక కృష్ణ వెళ్లి ముకుందని తీసుకొస్తానని అంటుంది. ఆ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ముకుందను వెంట పెట్టుకుని తీసుకు వస్తుంది.
భవానీకి పంచ్ వేసిన కృష్ణ: భోగి మంటలు వెలిగించిన తర్వాత భవానీ 'మా అమ్మ తెగ హడావుడి చేసేది. మా నాన్నకు ఇవేం ఇష్టం ఉండేవి కాదు. అస్తమానం క్రమశిక్షణ అంటూ ఉండేవారు' అంటుంది. దీంతో కృష్ణ 'హో అంటే మీది అచ్చం మీ నాన్న పోలిక అన్నమాట' అని పంచ్ వేస్తుంది. అప్పుడు భవానీ అఫ్ కోర్స్ నువ్వు అన్నది కరెక్టే అంటుంది. ఆ తర్వాత అందరూ కోలాటం ఆడతారు. అనంతరం మధు పాటలు పాడతాను అంటే భవానీ ఓకే అంటుంది. కానీ, ఆమె వెళ్లిపోతుంటే కృష్ణ, మురారి డ్యాన్స్ చూడమని రిక్వెస్ట్ చేస్తారు. తర్వాత వాళ్లిద్దరూ డ్యాన్స్ వేయగా చూస్తుందామె.
కృష్ణను పొగడ్తలతో ముంచి: కృష్ణ, మురారి డ్యాన్స్ చేసిన తర్వాత నందూ, గౌతమ్ కూడా స్టెప్పులు వేస్తారు. ఆ తర్వాత శకుంతల తీన్ మార్ డ్యాన్స్‌తో అదరగడుతుంది. అలా అందరూ భోగి పండుగ సందర్భంగా సంతోషంగా గడుపుతారు. ఉదయం అవగానే కృష్ణ ఇంటి ఎదురుగా ముగ్గు వేస్తుంది. మురారి అక్కడికి వస్తే కృష్ణ గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇక మురారి కృష్ణని పొగిడేపనిలో పడతాడు. అలా కాసేపు ఇద్దరూ మాటలతోనే రొమాన్స్‌ను పండిస్తారు.
మేమంతా అమ్మ అంటాం: ఆ తర్వాత రేవతి మంచిగా రెడీ అయి కిందకు వస్తుంటుంది. అప్పుడు మధు 'పెద్దమ్మ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ అందం ఈ చీరతోనో పండగ వల్లో వచ్చింది కాదు పెద్దమ్మ. నీ కొడుకు, కోడలు కలిసి పోవడం వల్ల ఇక నీకు ఏ టెన్షన్ లేకపోవడం వల్ల వచ్చింది. ప్రతీ రోజూ నువ్వు ఇలాగే ఉండాలి పెద్దమ్మ. నిజం పెద్దమ్మ నేను నీ దగ్గరే పెరిగిను. నేను అంటే నేనే కాదు ఇక్కడున్న మేమంతా నిన్నే అమ్మా అనుకునే వాళ్లం' అంటాడు. దీనికి కృష్ణ కూడా అవును అంటుంది. అప్పుడు మురారి 'తను నాకు మాత్రమే అమ్మ. మీకు కాదు' అని అంటాడు.
సుమకు పంచ్.. అరిటాకు: అనంతరం భవానీతో కలిసి సుమలత రావడంతో ఆమెపై పంచులు వేస్తారు. అప్పుడామె మధుతో 'నువ్వు నోరు ముయ్యురా. నేను అక్క రూమ్‌లోకి ఎందుకు వెళ్లానో తెలుసా? తను చీర సూపర్‌గా కట్టుకుంది కదా. నేను కూడా అలా కట్టుకుందామని వెళ్లా' అంటుంది. తర్వాత భవానీ అందరం కింద కూర్చుని అరిటాకులో భోజనం చేద్దామని అంటుంది. దీంతో మధు, మురారితో పాటు గౌతమ్ కూడా పని చేస్తానంటే వద్దంటారు. దీంతో నందూ బాధ పడుతుంది. అప్పుడు వాళ్లంతా కలిసి అల్లుడు పని చేయకూడదని వద్దన్నాం అని సర్ధి చెప్పి ఆమెను ఓదార్చుతారు.
భవానీపై పంచ్ వేయగానే: అందరూ కింద కూర్చోగానే భవానీ భోజనం వడ్డిస్తుంది. అప్పుడు మధు 'బ్రో పెద్ద పెద్దమ్మ కింద కూర్చొకుండా వడ్డిస్తాను అని భలే ఎస్కేప్ అయింది కదా' అని పంచ్ వేస్తాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు. అప్పుడు ఏమైందో చెప్పమని భవానీ అడుగుతుంది. దీంతో ఆమెకు మురారి 'స్టార్ట్ చేసింది నువ్వే కదా నువ్వే చెప్పు. పెద్దమ్మ మీరు కింద కూర్చోకుండా ఉండటానికి వడ్డిస్తాను అని షాకు చెప్పి భలే ఎస్కేప్ అయ్యారు అని అంటున్నాడు' అని నిజం చెప్తాడు. దీంతో మధు 'పెద్దమ్మ ఏదో పండగ కదా.. క్షమించి వదిలేయరా ప్లీజ్' అని ప్రాధేయపడతాడు.
నిజం తెలిసి అంతా షాక్: మధు అన్న మాట వినగానే భవానీ దేవి 'కృష్ణ నువ్వు లే లే. నువ్వు వడ్డించు. కింద కూర్చొని ఏంట్రా నేను కింద కూర్చోలేనా నాతో పాటు మీరు సూర్యనమస్కారాలు చేయండి చూద్దాం' అంటూ కింద కూర్చుని తింటుంది. దీంతో కృష్ణ అందరికి వడ్డిస్తుంది. అందరూ హ్యాపీగా తింటారు. ఆ తర్వాత వంటలు అన్నీ సూపర్‌గా ఉన్నాయని కృష్ణను మెచ్చుకుంటారు. అయితే ఆ వంటలు అన్నీ ముకుంద చేసింది అని కృష్ణ చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











