Krishna Mukunda Murari: కొత్త రూపంతో కృష్ణ.. శోభనం ముహూర్తం ఫిక్స్.. ప్రభాకర్‌కు భవానీ బంపర్ ఆఫర్
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఏం జరిగిందంటే: కృష్ణ హారతి తీసుకుంటూ ఉంటే అది ఆరిపోతుంది. దీంతో అందరూ కంగారు పడిపోతారు. అప్పుడు ముకుంద తన వల్లే ఇలా జరిగిందని అంటుంది. అనంతరం అందరూ గాలి పటాలు ఎగరేస్తూ ఉంటే కృష్ణది ముకుంద కట్ చేస్తుంది. దీంతో ఆమె కావాలనే ఇలా చేస్తుందా అని కృష్ణ సందేహం వ్యక్తం చేస్తుంది. ఇక, మురారి వచ్చి శోభనం గురించి కృష్ణతో చిలిపిగా మాట్లాడతాడు. దీంతో ఆదర్శ్ వచ్చి ముకుంద జీవితం బాగైన తర్వాతనే పెళ్లి చేసుకుందాం అని కండీషన్ పెడుతుంది. దీంతో మురారి ఇంత కాలం నీ మాట విన్నా.. ఇప్పుడు నా మాట వినాల్సిందే అంటాడు.

ముగ్గు వేసింది ముకుందే: ఇంటి ముందు ముగ్గు ఎవరు వేశారన్నది మిస్టరీగా మారుతుంది. అంతలో రేవతి వచ్చి ఏమైందని అడగ్గా విషయం చెప్తారు. అంతలోనే ముకుంద హారతి పట్టుకని వస్తుంది. అప్పుడామెను కృష్ణ అడగ్గా.. నేనే వేశాను అని నిజం చెప్పేస్తుంది. దీంతో కృష్ణ 'ముగ్గు నా డ్యూటీ కదా నువ్వు ఎందుకు వేశావు' అని అడుగుతుంది. దీనికి ముకుంద 'ఎప్పుడు ఇతరుల గురించే కాదు.. నీ గురించి కూడా ఆలోచించుకో. ఈరోజు నీ ఫస్ట్ నైట్ కదా. ఏ పని చేయవద్దు' అని చెప్తుంది. దీంతో కృష్ణ సిగ్గు పడుతూ ఉంటుంది. అంతలో మధుకర్ వాళ్లు ముకుంద తీరుపై డౌట్ పడుతూ ఉంటారు.
శోభనం ముహూర్తం కోసం: ముగ్గు వేసిన దానిపై చర్చలు జరుగుతున్నప్పుడే ముకుంద 'కృష్ణ నన్ను క్షమించింది. తన రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలైన సరిపోదు' అని అంటుంది. ఆ తర్వాత మురారి నిద్రలేచి కృష్ణని పిలుస్తాడు. ఆమె వచ్చి ఇంటి ముందు ముగ్గు ఆల్రెడీ వేసేశారని, అది ముకుంద వేసిందని చెప్తుంది. దీంతో 'కొత్తగా తను వేయడం ఏంటి? ఎందుకు వేసింది' అని అడుగుతాడు. దీనికి కృష్ణ 'ఇప్పుడు నీకు ఏ పని చెప్పను. హ్యాపీగా రెస్ట్ తీసుకోమని చెప్పింది' అని సిగ్గుపడుతూ చెప్తుంది. ఆ తర్వాత అందరూ శోభనం ముహూర్తం కోసం పంతులు కోసం వేచి చూస్తారు.
భవానీ మాటలతో ఏడుపు: అందరూ పంతులు కోసం వేచి చూస్తుండగా భవానీ వచ్చి అసలైన వాళ్లు ఎక్కడని అడుగుతుంది. అప్పుడే మురారి, కృష్ణ వస్తారు. శోభనం ముహూర్తం పెట్టడానికి పంతులు వస్తున్నాడని చెప్పేసరికి కృష్ణ సిగ్గు పడుతుంది. అప్పుడు శోభనానికి కావాల్సిన వస్తువులు తను వెళ్ళి తీసుకొస్తానని ముకుంద అంటుంది. కానీ, భవానీ మాత్రం అవన్నీ తీసుకు రావడానికి నందూ, గౌతమ్‌ను పంపించు ఎంతైనా శుభకార్యం కదా అంటుంది. దీంతో ముకుంద కన్నీరు పెట్టుకుంటుంది. అప్పుడు నాకులాగే పెద్ద పెద్దమ్మ కూడా ముకుందని నమ్మడం లేదని మధు అనుకుంటాడు.

కంగారు పెట్టించిన భవానీ: ఆ తర్వాత పంతులు వచ్చి 'లేట్ అవుతుందని ఇంటి దగ్గరే ముహూర్తం పెట్టుకుని వచ్చాను. మంచి ముహూర్తం పెట్టా. సంతాన ప్రాప్తి లభిస్తుంది' అని చెప్తాడు. దీంతో రేవతి, సుమలత తమకి ఆడపిల్ల కావాలని అంటారు. తర్వాత రాత్రికి ముహూర్తం ఉందని చెప్పి పంతులు వెళ్ళిపోతాడు. అనంతరం కృష్ణను బయటకు వెళ్దామని ముకుంద అంటుంది. ఆ తర్వాత రేవతి.. భవానీ దగ్గరకి వచ్చి.. మురారి విషయం మాట్లాడటం కోసం వచ్చానని చెప్తుంది. కృష్ణ గురించి తను మాట్లాడాలని అనుకుంటున్నట్టు భవానీ చెప్పేసరికి రేవతి కంగారు పడుతుంది.
ఉద్యోగం చూడమని చెప్పి: రేవతితో మాట్లాడుతున్న సమయంలో భవానీ 'కృష్ణ అన్ని మంచి పనులే చేసింది. ఒక్క అగ్రిమెంట్ విషయంలో తప్ప. ఆ విషయంలోనే కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యాను అంతే' అనే సరికి రేవతి ఊపిరి పీల్చుకుంటుంది. అనంతరం 'అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ముకుంద కూడా మారిపోయింది. ఉద్యోగంలో రూపం మారడం వల్ల జాబ్ ప్రాబ్లం అయింది. మీరే ఏదో ఒకటి చేసి ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది' అని రేవతి అడుగుతుంది. దీనికి భవానీ దేవి 'సరే చూద్దాంలే ప్రస్తుతం ఎంజాయ్ చేయనివ్వు' అని చెబుతుంది.
ప్రభాకర్‌కు కాంట్రాక్టు ఇచ్చి: అనంతరం భవానీ దేవి 'కృష్ణ కోసం కట్టిస్తున్న హాస్పిటల్ కాంట్రాక్ట్ పెద్దపల్లి ప్రభాకర్‌కు అప్పగించాలని అనుకుంటున్నా' అని భవానీ చెప్తుంది. ఆ మాటకి రేవతి సంతోషిస్తుంది. అదే సమయంలో 'అన్ని శుభవార్తలు వింటున్నాం ఏమవుతుందో' అని రేవతి భయపడుతుంటే.. ఇక మంచి రోజులు వచ్చినట్టేనని భవానీ ధైర్యం చెప్తుంది. తర్వాత కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెళ్లాలని కృష్ణ వాళ్ళు అనుకుంటున్నారు పంపిద్దామా అని రేవతి అడిగితే ఓకే అని చెబుతుంది.
కొత్త రూపంతో కృష్ణ ఎంట్రీ: ముకుంద కృష్ణను రెస్టారెంట్‌కు తీసుకుని వెళ్తుంది. అక్కడ 'ఇంటి నుంచి అందరూ నన్ను నిర్దాక్షిణ్యంగా వెళ్లగొడుతుంటే నువ్వు ఒక్కదానివే నాతరపున నువ్వు నిలబడ్డావు. పెద్దత్తయ్యకి నా గురించి బాధ్యత తీసుకున్నావని థాంక్స్' అని అంటుంది. మరోవైపు ఇంట్లో అందరూ మాట్లాడుతుండగా.. మురారి వచ్చి కృష్ణ ఎక్కడని అడుగుతాడు. అంతలోనే ముకుందతో కలిసి కృష్ణ వస్తుంది. ట్రెండీగా తయారైన కృష్ణను చూసి అందరూ షాక్ అవుతారు. తర్వాత కృష్ణను ఫస్ట్ నైట్ కోసం రెడీ చేస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











