Krishna Mukunda Murari: శోభనం ముందే ట్విస్ట్ ఇచ్చిన కృష్ణ.. అతడు వస్తేనే అంటూ.. కథలో ఊహించని మలుపు
చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఏం జరిగిందంటే: పంతులు గారు వచ్చి కృష్ణ, మురారి శోభనం కోసం ముహూర్తం పెడతారు. ఆ తర్వాత ముకుంద ఆ పనులు చూసుకుంటాను అనగా.. భవానీ దేవి మాత్రం వద్దని చెప్తుంది. దీంతో ముకుంద ఎంతగానో బాధపడుతుంది. ఇక, తన దగ్గరకు వచ్చిన రేవతితో భవానీ కొన్ని విషయాలు చెప్తుంది. అప్పుడే ప్రభాకర్‌కు కొత్తగా కట్టే హాస్పటల్ కాంట్రాక్టును అప్పగించాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. ఇక, కృష్ణను బయటకు తీసుకు వెళ్లిన ముకుంద.. ఆమెను మోడ్రన్‌గా రెడీ చేయిస్తుంది. ఆ తర్వాత ఆమె ఇంటికి రాగానే అందరూ ఆశ్చర్యపోతారు. మురారి అయితే ఫ్లాట్ అవుతాడు.

జీవితాంతం సేవ చేస్తాను: కృష్ణకు ముకుంద సహాయం చేస్తూ ఉండగా రేవతి ఆమెనే చూస్తూ ఉంటుంది. అప్పుడు 'ఈ అమ్మాయి ఎంత మారిపోయింది. భవానీ అక్క మారదని అంటుంది. కానీ తనని చూస్తుంటే అలా అనిపించడం లేదు' అని మనసులో అనుకుంటుంది. తర్వాత కృష్ణను శోభనం కోసం ముకుంద మంచిగా రెడీ చేస్తుంది. దీంతో తన కోడలిని రెడీ చేసినందుకు ముకుందకి థాంక్స్ చెప్పబోతుంటే.. ముకుంద 'వద్దు ఇది నా ప్రాయశ్చిత్తంలో భాగం మాత్రమే. నేను కృష్ణ, మురారి వాళ్లకు జీవితాంతం సేవ చేసుకుంటూనే ఉంటాను' అని చెప్తుంది.
కన్నీరు పెట్టుకున్న కృష్ణ: రేవతి 'కృష్ణా.. ఇప్పటి వరకు ముకుంద మారలేదని అనుకున్నా కాని ఇప్పుడు నమ్ముతున్నా' అని చెప్తుంది. దీనికామె 'లేదు ముకుంద మారింది. తన కళ్లలో అపరాధ భావం కనిపిస్తుంది' అని అంటుంది. మరోవైపు మురారికి మధు, గౌతమ్ కంగ్రాట్స్ చెప్తారు. తర్వాత శోభనం గదిని చూసుకుని మురారి తెగ మురిసిపోతాడు. అందరూ కృష్ణ చేతికి పాల గ్లాసు ఇచ్చి గదిలోకి పంపించేందుకు తీసుకుని వెళ్లబోతు ఉంటారు. కృష్ణ.. భవానీకి నమస్కరించగా 'ఆ దేవుడి నిన్ను చల్లగా చూడాలి. నీలాంటి వాళ్లకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు' అనగా కృష్ణ ఏడుస్తుంది.
బిగ్ ట్విస్ట్ ఇచ్చేసిన కృష్ణ: శోభనం గదిలోకి వెళ్లే ముందు ముకుంద ఎక్కడ ఉందని కృష్ణ అందరినీ అడుగుతుంది. అప్పుడు ఆమె ఏడుస్తూ ఒంటరిగా నిల్చుని ఉంటుంది. అది చూసిన కృష్ణ 'ముకుంద బాధపడుతుంది. ఈ బాధ ఎటు దారి తీస్తుందో' అని కంగారు పడుతుంది. అప్పుడు అందరూ కృష్ణని గదిలోకి వెళ్ళమని చెప్తారు. కానీ తను మాత్రం ఏసీపీ సర్ గదిలోకి వెళ్లనని చెప్తుంది. ఏమైంది ఎందుకు ఆగారని భవానీ అడుగుతుంది. అప్పుడే మధు వెళ్ళి మురారిని పిలుచుకుని వస్తాడు. అంతలో కృష్ణ 'అత్తయ్య నన్ను క్షమించండి. ముకుంద ఏడుస్తుంది' అంటుంది.
శోభనం ఆపేస్తానన్న కృష్ణ: ఆ తర్వాత కృష్ణ 'ఎదుటి వారి దురదృష్టంలో అదృష్టం వెతుక్కోవడం కరెక్ట్ కాదు. ముకుందను అలాంటి పరిస్థితిలో వదిలి పెట్టి మనం సంతోషంగా ఉండటం ఎంతవరకు కరెక్ట్' అంటుంది. అప్పుడు భవానీ 'రేవతి ఆవిడ బాధ ఏంటో కనుక్కో' అంటుంది. దీనికి కృష్ణ 'తన బాధ ఏంటో అందరికీ తెలుసు. అడిగి తెలుసుకుంటే గాయం రేపడం తప్ప మరొకటి ఉండదు' అని చెప్తుంది. దీంతో నందూ నువ్వేం చేస్తావని కోపంగా అడగ్గా.. శోభనం ఆపేస్తానని అంటుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. అప్పుడు మురారి కూడా కృష్ణకు సపోర్టుగానే మాట్లాడతాడు.
ఆదర్శ్‌ను తీసుకొస్తానని: ఆదర్శ్‌ను తీసుకు రావాలని అనుకుంటుంటుండగా.. భవానీ 'వద్దు వాడిని తీసుకురావద్దు. వాడు వస్తే అన్ని సర్దుకుంటాయనే నమ్మకం నాకు లేదు. అదే పరిష్కారం అనుకుంటే దీన్ని ఆపాల్సిన అవసరం లేదు' అని చెప్తుంది. దీనికి కృష్ణ 'ఉంది పెద్దత్తయ్య. మనం రొటీన్ జీవితాల్లో పడిపోతే ముకుంద గురించి ఆలోచించేది ఎవరు' అని ప్రశ్నిస్తుంది. దీనికి రేవతి సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా.. 'ఇప్పుడు ఆదర్శ్ రావాల్సిన అవసరం ఉంది. తన రాక మీదే మా జీవితాలు ఆధార పడి ఉన్నాయి. ఇవాళ ఇది జరిగిపోయిందని అంటే ఇక అంతే' అంటుంది.
కృష్ణపై రేవతి ఫుల్ ఫైర్: అనంతరం కృష్ణ 'నేను కూడా ఆదర్శ్, ముకుంద గురించి ఆలోచించను. దయచేసి అర్థం చేసుకోండి' అని బతిమలాడుతుంది. దీంతో భవానీ సరే అంటూనే.. కానీ ఒక్క విషయం ఆదర్శ్ వచ్చాక ఎదురయ్యే పరిస్థితులకి పూర్తి బాధ్యత నీదేనని చెప్తుంది. అప్పుడు శకుంతల ఇంకొక సారి ఆలోచించమని అంటే.. రేవతి మాత్రం కోపంగా వద్దు వదిన ఎవరి ఇష్టం వాళ్లది. మనం చెప్పి మన పెద్దరికం పోగొట్టుకున్నట్టే అంటుంది. ఆ తర్వాత కూడా కృష్ణపై రేవతి ఫైర్ అవుతుంది. అనంతరం కృష్ణ.. ముకుంద దగ్గరకు వెళ్తుంది. దీంతో ఆమె ఎందుకు వచ్చావని అడుగుతుంది.
ముకుంద బ్రతిమాలినా: ముకుంద అడగ్గానే 'నేను ఏసీపీ సర్‌కు శోభనం వద్దని చెప్పాను. ఆదర్శ్ వచ్చాకే ముహూర్తమని చెప్పాను. ఇలా మేం సంతోషంగా ఉంటే నీకు ఆదర్శ్ గుర్తుకు వస్తాడని తెలుసు. నీ మనసు పాడవుతుందని తెలిసి వద్దని చెప్పాను' అని అంటుంది. దీనికి ముకుంద 'నా బాధలకు మీ సంతోషం బలిపెట్టడం ఏంటి? ముహూర్తాన్ని వాయిదా వేయొద్దు' అని ముకుంద బతిమలాడుతుంది. కానీ, కృష్ణ మాత్రం ఆదర్శ్ వచ్చిన తర్వాతనే ఫస్ట్ నైట్ అని చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











