Krishna Mukunda Murari: ముకుంద కుట్ర అంటూ మధు ట్విస్ట్.. ఆదర్శ్‌ను వెతికాలనుకున్న కృష్ణకు షాక్

ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Krishna Mukunda Murari Serial Today Episode January 19th 2023

గురువారం ఏం జరిగిందంటే: శోభనం కోసం కృష్ణను ముకుంద అందంగా రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు రేవతి వచ్చి ముకుందకు థ్యాంక్స్ చెప్పబోతుండగా.. ఆమె వద్దని అంటుంది. అంతేకాదు, జీవితాంతం వీళ్లకు రుణపడి ఉంటానని అంటుంది. శోభనం గదిలోకి వెళ్లే ముందు ముకుంద ఎక్కడ ఉందని కృష్ణ అందరినీ అడుగుతుంది.

అప్పుడు ఆమె ఏడుస్తూ ఒంటరిగా నిల్చుని ఉంటుంది. అది చూసిన కృష్ణ.. ఆదర్శ్ వచ్చి ముకుంద సంతోషంగా ఉండే వరకూ శోభనం వద్దని ట్విస్ట్ ఇస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మురారి మాత్రం కృష్ణ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్తాడు.

కృష్ణకు సపోర్ట్ చేసిన మధు: శోభనం వద్దన్న కృష్ణ మాటలను రేవతి తలుచుకుని కోపంగా ఉంటుంది. అప్పుడే నందూ ఆమెకు గుడ్ మార్నింగ్ చెప్పగా.. సీరియస్ అవుతుంది. అంతేకాదు, ఆదర్శ్‌ను తీసుకురావడానికి, శోభనాన్ని ఆపడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తారు. అంతలోనే మధు అక్కడికి రావడంతో అతడికి కూడా రేవతి చీవాట్లు పెడుతుంది. అప్పుడు మధు 'పెద్దమ్మ కృష్ణ ఇప్పటి సంగతి గురించే కాదు. భవిష్యత్ గురించి కూడా ఆలోచించింది. మనందరం ఔట్ హౌస్ నుంచి రమ్మని చెప్తే కృష్ణ రాను అని చెప్పింది' అంటూ కృష్ణకు సపోర్టుగా మాట్లాడతాడు.

ముకుంద కుట్ర చేస్తుంది: ఆ తర్వాత మధు 'అప్పుడు కృష్ణ.. ముకుందతో కలిసి ఉంటే బాగోదు అని సున్నితంగా తిరష్కరించింది. ఇలా శోభనం చేసుకుంటే మురారి ఆదర్శ్‌ను వెతకడంలో ఇంట్రస్ట్ చూపించడు. రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తాడు. అప్పుడు ముకుంద ఒంటరిగా తిరుగుతూ.. హాయిగా ఉన్న వీళ్లిద్దరిని చూసి కుట్ర చేయదు అని గ్యారెంటీ ఏంటి. ఇలా ఎందుకు ఆలోచించరు' అని అంటుంది. దీనికి రేవతి 'నువ్వు అన్నది నిజమేరా కానీ దాన్నిఇలా వాయిదా వేయడం నాకు నచ్చలేదు' అంటుంది. దీంతో మధు 'రెండు రోజులు ఓపిక పట్టలేరా' అని అంటాడు.

ఆదర్శ్ వస్తాడని లేదంటూ: ఉదయాన్నే మురారి నిద్ర లేచే సరికి ఎదురుగా పేపర్ మీద కృష్ణ ఇదిగో ఏబీసీడీల అబ్బాయి నన్ను తిట్టారో బాగోదు చెప్తున్నా అని రాసుంటుంది. దాన్ని చూసి మురారి నవ్వుకుంటాడు. ఇక కృష్ణ అప్పుడే స్నానం చేసి వస్తుంది. మురారిని దగ్గరకు తీసుకొని గుడ్ మార్నింగ్ చెప్తుంది. అప్పుడతను 'ఆదర్శ్ వస్తాడు అన్న నమ్మకం నాకు లేదు కృష్ణ' అంటాడు. దీనికామె 'లేదు ఏసీపీ సార్ వస్తాడు. తప్పకుండా వస్తాడు. నాకు నమ్మకం ఉంది' అంటుంది. అప్పుడు మురారి 'వాడి కోసం మనం ఇలా అన్ని వదిలేసి ఎదురుచూస్తున్నాం అని వాడికి తెలుసా చెప్పు' అంటాడు.

అది మన అజ్ఞానం కృష్ణా: మురారి మాటలకు కృష్ణ 'ఆదర్శ్‌కు మనమే వెళ్లి చెప్తాం. మొన్న మెహతా గారిని కలిశాం కదా ఆయన మీద నమ్మకం ఉంది' అంటుంది. దీనికి మురారి 'ఇన్నాళ్లు అజ్ఞానంలో ఉన్న వాడు వస్తాడు అనుకోవడం మన అజ్ఞానం' అంటాడు. అప్పుడామె 'అలా అనకండి ఏసీపీ సార్. జీవితంలో మారదు అనుకున్న ముకుందే మారింది. ఆదర్శ్ మారడా చెప్పండి. నేను ఆలోచించేది మన గురించే కాదు.. పెద్దత్తయ్య కోసం కూడా. పైకి గంభీరంగా ఉన్నా ఆదర్శ్ గురించి పెద్దత్తయ్య ఎంత బాధ పడుతుందో నాకు తెలుసు' అనగా మురారి కూడా అవును అంటాడు.

పనికిరాని త్యాగాలు చేసి: కృష్ణ, మురారిని రేవతి 'ఎక్కడికి నందూ ఇంత పొద్దున్నే బయల్దేరారు. ఎందుకు పనికి రాని త్యాగాలు చేసి ఏదో గొప్పపని చేసినట్లు ఫీలైపోతారు' అని అంటుంది. దీంతో అక్కడే ఉన్న ముకుంద సారీ చెప్పగా.. 'నీకు పిచ్చా ముకుంద? రాత్రి చెప్పాం కదా ఆదర్శ్‌ను తీసుకొస్తామని మళ్లీ ఇదంతా ఏంటి' అంటుంది. దీనికి భవానీ 'మురారి నాకు ఏం చెప్పొద్దు.. అన్నీ మీరు అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదు. ఏ నమ్మకంతో వాడు కన్విన్స్ అవుతాడు అనుకుంటున్నారు. జరిగింది గొప్ప విషయయా' అంటుంది. చివరికి ఆమెను కన్విన్స్ చేసేస్తారు.

ముకుందను ప్రశ్నించగా: ఆ తర్వాత మురారి 'మొన్న దోషి ఎవరో తేలితే మన పెళ్లి జరుగుతుందని.. లేదంటే నువ్వు ఆదర్శ్‌తో ఉండాలని కండీషన్ పెట్టారు గుర్తుందా' అనగా ముకుంద గుర్తుంది అంటుంది. దీంతో మురారి ఆ మాట మీదనే ఉండు అంటాడు. తర్వాత మెహతాకు కాల్ చేయగా స్విచ్‌ఆఫ్ వస్తుంది. అప్పుడు మురారి 'అయిపోయింది అంతా అయిపోయింది. వాడు మనకు హ్యాండ్ ఇచ్చాడు. వాడి భరోసాతో నువ్వు చాలా బిల్డప్ ఇచ్చావు. అప్పటికీ పెద్దమ్మ చెప్తూనే ఉంది' అంటాడు. దీంతో కృష్ణ 'ఏసీపీ సార్ ప్లీజ్.. కారణం ఏదైనా అయిండొచ్చు. ఆయన జెంటిల్‌మన్' అంటుంది.

ముకుందను అడగడంతో: ముకుంద 'అదర్శ్‌ని తెస్తానని కృష్ణ అంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. ఏం చేయాలి? అయినా ఆదర్శ్ ఎందుకు వస్తాడు? అయినా మగాడి అహం మీద దెబ్బ పడినప్పుడు ఎందుకు వస్తాడు? అనవసరంగా వస్తాడు అని టెన్షన్ పడుతున్నాను' అనుకుంటుంది. అప్పుడు నందూ ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దీనికి ముకుంద 'ఏముంది నందూ.. నా కోసం కృష్ణ వాళ్లు చేసిన త్యాగం డైజస్ట్ కావడం లేదు. వాళ్లు ఆదర్శ్‌ వస్తాడు అంటున్నారు. వస్తాడా చెప్పు నందూ. వచ్చేవాడు అయితే ఎప్పుడో వచ్చేవాడు. నా బతుకు ఏదో నేను బతికేదాన్నికదా' అంటుంది.

మా అన్న రావడం ఓకేనా: ఆ తర్వాత నందూ 'అసలు ఆదర్శ్ రావడానికి, శోభనం ఆపడానికి సంబంధమే లేదు. ముకుంద నీకు మా అన్నయ్య రావడం ఇష్టమేనా' అని అడుగుతుంది. దీనికి ముకుంద 'కృష్ణ ఆదర్శ్‌ రావాలి అని నాతో ఉండాలి అని అప్పుడే తనకు సంతోషం అని చెప్పింది. కృష్ణ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆదర్శ్ ఎవరు నా భర్తే కదా. ఆ విషయంలో కృష్ణ నా కళ్లు తెరిపించింది. ఆదర్శ్‌ నా గతాన్ని మర్చిపోయి ఆదరిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పు' అంటుంది. తర్వాత కృష్ణ, మురారి రొమాన్స్ చేస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X