Krishna Mukunda Murari: అతడి బొమ్మ గీసిన ఆర్టిస్ట్.. దేవ్ ప్లాన్‌కు మురారి బలి.. కథలో సూపర్ ట్విస్ట్
ఇండియాలోని ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శనివారం ఏం జరిగిందంటే
కృష్ణను నమ్మించేందుకు దేవ్ ప్రయత్నాలు సాగిస్తాడు. దోషి ఎవరో తెలిస్తే చంపేస్తానని అంటాడు. అప్పుడు కృష్ణ వాళ్లు అది ఎవరో తెలిస్తే మురారి వదిలిపెట్టడని అంటారు. దీంతో అతడికి భయం వేస్తుంది. ఇక, మురారితో ముకుంద వాదనకు దిగగా.. కేసు తేల్చేసి కృష్ణను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆమెనేమో తనను మోసం చేశావని నిందిస్తుంది. అప్పుడు అన్నీ తెలిసే ఆదర్శ్‌ను పెళ్లి చేసుకున్నావని మురారి అంటాడు. అనంతరం కృష్ణ గురించి భవానీతో మురారి మాట్లాడతాడు. కేసు సాల్వ్ అయిన తర్వాత మాట మీద నిలబడతానని హామీ ఇచ్చేస్తాడు.

ఈ వనవాసం మూడు రోజులే
డైనింగ్ టేబుల్ దగ్గర భవానీ పక్కనే కృష్ణ, మురారి కూర్చునేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ విషయాన్ని ముకుంద అందరికీ అర్థం అయ్యేలా చెబుతుంది. దీంతో భవానీకి కోపం వస్తుంది. అప్పుడు మురారి 'ఎవరి మాటల ప్రభావానికి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు' అనడంతో మౌనంగా ఉంటుంది. ఔట్ హౌస్‌లో ఉన్న కృష్ణ బాధపడుతూ ఉంటుంది. 'ఎప్పటి దాకా నాకు ఈ వనవాసం? మూడు రోజుల్లో పెళ్లి. ఈలోపు కేసు ఓ కొలిక్కి రావాలి. వస్తుందనే నమ్మకం ఉంది కానీ.. రాకపోతే ఏంటి పరిస్థితి' అని అనుకుంటూ ఉండగా.. మురారి అక్కడకు వస్తాడు.
కృష్ణకు సర్ధి చెప్పిన మురారి
తన దగ్గరకు వచ్చిన మురారిని పరిమళ ఎప్పుడు వస్తుంది అని కృష్ణ అడుగుతుంది. ఆ తర్వాత కూడా ఆమె ఆందోళన చెందుతూ ఉంటుంది. అప్పుడు మురారి 'కేసు కొలిక్కి వస్తుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పరిమళ స్కెచ్ వేసే వ్యక్తిని తీసుకుని వస్తుంది కదా' అంటాడు. అప్పుడు కృష్ణ 'స్కెచ్‌లో ఉన్న వ్యక్తి మనకు తెలిసిన వాడు అయితే పట్టుకోవడం ఈజీ. కానీ తెలియని వాడు అయితే ఏం చేద్దాం' అని అంటుంది. దీంతో 'కంగారు పడకు త్వరలోనే దోషి దొరికిపోతాడు' అని కృష్ణకు సర్ది చెప్తాడు.

టెన్షన్ పడుతున్న ముకుంద
తన రూమ్‌లో ఉన్న దేవ్ దగ్గరకు ముకుంద వెళ్తుంది. అతడు కూల్‌గా కూర్చుని ఉండడంతో పరిమళ వస్తుంది కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దేవ్ 'అదే ప్లాన్ చేస్తున్నాను. పరిమళను కూడా లేపేస్తే అసలు ఏ గోల ఉండదు కదా' అని అంటాడు. దీంతో ముకుంద 'స్టాపిట్.. ఇప్పటికే నువ్వు చేస్తున్న పనులకు రోజురోజుకీ టెన్షన్‌తో చచ్చిపోతున్నాను. ఇవన్నీ కాకుండా ఇంకెదైనా ప్లాన్ చేసి ఉండాల్సింది' అంటుంది. దీంతో దేవ్ 'మన మాటలు ఎవరైనా వింటే దొరికిపోతాం' త్వరగా కిందకి వెళ్లిపొమ్మని ముకుందను పంపించేస్తాడు.
బొమ్మ గీసిన స్కెచ్ ఆర్టిస్టు
పరిమళ ఎప్పుడు వస్తుందా అని అందరూ వేచి చూస్తుండగా.. ముకుంద మాత్రం ఆర్టిస్టు దేవ్ బొమ్మ గీస్తే ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది. అంతేకాదు, తనకేం సంబంధం లేదంటే అత్తయ్య నమ్ముతుందా అని ఆలోచిస్తుంది. అప్పుడే దేవ్ కిందకు వస్తాడు. దీంతో ముకుంద తిట్టగా.. పరిమళ వస్తే వెళ్లిపోతానని అంటాడు. అంతలోనే పరిమళ, ఆర్టిస్టు శ్రీధర్ వస్తారు. దీంతో దేవ్ అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత పరిమళ గుర్తులు చెప్పగా శ్రీధర్ బొమ్మను గీస్తుంటాడు. దీంతో ఆ బొమ్మ ఎవరిది అని అందరూ ఎదురు చూస్తుంటారు. ముకుంద భయపడుతుంది.
అతడి బొమ్మ గీసిన ఆర్టిస్ట్
బొమ్మ చూసి దేవ్‌ను మురారి పిలవగా.. హెల్త్ బాలేదని ముకుంద అంటుంది. తర్వాత శ్రీధర్ గీసిన బొమ్మను భవానీకి చూపించగా 'అతడు కరెక్టుగానే ఇది గీశాడా? ఇతను ఎవరో నాకు తెలుసు' అని అంటుంది. దీంతో రేవతి ఎవరు ఆ దుర్మార్గుడు అని అడగ్గా.. 'దుర్మార్గుడు కాదు చాలా మంచోడు. పైగా మూగ వాడు. మన ఫామ్ హౌస్ మేనేజర్ రాజనర్స్ పెద్ద కొడుకు' అని భవానీ చెప్తుంది. దీంతో పరిమళ 'మూగ వాడు ఏంటి? తను నాతో మాట్లాడాడు. అయినా నేను చెప్పింది తను కాదు. తేడాగా ఉన్నాడు' అంటుంది. దీంతో శ్రీధర్ మేడం చెప్పినట్లే గీశా అంటాడు.
బలి అయిన మురారి, కృష్ణ
బొమ్మను చూసిన తర్వాత భవానీ 'స్కెచ్ కరెక్టుగా వేయలేదు. అయినా నువ్వు ఎందుకు ఇంతగా దిగజారిపోయావు' అని మురారిని అంటుంది. అప్పుడు కృష్ణ మాట్లాడబోతుంటే భవానీ అరుస్తుంది. అంతేకాదు, 'మీ వాళ్లను తప్పించడం కోసం మా మనుషులని ఇరికించి మమ్మల్ని ఇరుకులో పెట్టాలని అనుకున్నావా' అంటుంది. ఆ గొడవ అలా జరుగుతుండగా దేవ్ తన ప్లాన్ వర్కౌట్ అయిందని సంతోషిస్తాడు. అప్పుడు మురారి ఎంత చెప్పినా భవానీ వినదు. దీంతో వేరే ఆర్టిస్టును పిలిపించి మళ్లీ బొమ్మను గీయిస్తాను అని మురారి హామీ ఇస్తాడు.
బొమ్మ విషయంలో తారుమారు కావడంతో ముకుంద.. దేవ్ దగ్గరకు వస్తుంది. అప్పుడతను 'మొన్న ఫ్రెండ్స్ వచ్చారు ఫామ్ హౌస్‌కు వెళ్ళాను. అక్కడ రాజనర్స్ కొడుకునే చూసి ఫోటో తీసుకున్నాను. పరిమళ వస్తానని చెప్పింది కదా అంతక ముందే నేను శ్రీధర్ ఇంటికి వెళ్ళాను' అని జరిగింది వివరిస్తాడు. అప్పుడు మురారి చెప్తున్నప్పుడు శ్రీధర్ నెంబర్ తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లి డబ్బులు ఇస్తాడు. అలా ప్లాన్ ప్రకారం వేరే బొమ్మను గీయిస్తాడు. ఇదంతా చెప్పిన తర్వాత ముకుంద సంతోషిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











