Krishna Mukunda Murari: తెలిసిన ఆదర్శ్ జాడ.. బయటపడ్డ ముకుంద నిజస్వరూపం.. నేటి ఎపిసోడ్ చూశారంటే!
దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శుక్రవారం ఏం జరిగిందంటే
శోభనం వద్దని చెప్పిన కృష్ణపై అందరూ కోపంగా ఉంటారు. అప్పుడు మధు వచ్చి ఆమె ప్లాన్‌ను రేవతికి అర్థం అయ్యేలా వివరిస్తాడు. దీంతో ఆమె కూల్ అయిపోతుంది. ఇక, ఆదర్శ్‌ను తీసుకు రావాలని కృష్ణ అనగా.. అతడు వస్తాడని నమ్మకం లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఆ సమయంలోనే గతంలో ముకుంద ఇచ్చిన మాటను మురారి గుర్తు చేస్తాడు. అనంతరం ఆదర్శ్ వస్తే మళ్లీ కలుస్తావా అని ముకుందను నందూ ప్రశ్నిస్తుంది. దీంతో కృష్ణ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని ఆమె చెబుతుంది.

గుడ్ న్యూస్ చెప్పిన కృష్ణ
అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో ముకుందపై సీరియస్ అవుతూ ఉంటారు. అప్పుడామె నేను వడ్డిస్తాను, పెద్దత్తయ్య పక్కన కూర్చుంటే ఇబ్బంది అంటుంది. అంతలో కృష్ణ, మురారి వస్తారు. అంతలోనే భవానీ కూడా అక్కడకు వస్తుంది. అప్పుడు వాళ్లు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అంటూ.. ఆదర్శ్ ఆచూకీ తెలిసిందని చెబుతారు. దీంతో అందరూ సంతోషిస్తారు. కానీ, ముకుంద మాత్రం షాకైపోతుంది. ఆ తర్వాత 'రేపు వెళ్ళి అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్తున్నాము. మేము తిరిగొచ్చేది ఆదర్శ్‌తోనే' అని మురారి చెప్తాడు. దీంతో భవానీ కూడా సంతోషిస్తుంది.
సీరియస్ అయిన భవానీ
కృష్ణ.. ముకుందను భవానీ పక్కన కూర్చోమంటే.. ఆమె కోపంగా మధు నువ్వు వచ్చి కూర్చో అంటుంది. దీంతో ముకుంద బాధగా వెళ్ళిపోతుంది. అప్పుడు కృష్ణకు కూడా భవానీ క్లాస్ పీకుతుంది. అనంతరం 'ఆదర్శ్ రావడం అనేది మంచిదే కానీ.. వచ్చాక ఏం జరుగుతుందనే విషయం తలుచుకుంటే బాధగా ఉంది' అని అంటుంది. అప్పుడు కృష్ణ 'చెప్పాను కదా అత్తయ్య ఆదర్శ్ వచ్చాక బాధ్యత నాదే అని' అని అంటుంది. తర్వాత 'నీ స్థానంలో ఆదర్శ్, ఆదర్శ్ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావ్. ఇంటికి వస్తావా' అని మురారిని భవానీ సూటిగా అడుగుతుంది.
తెలిసిన ఆదర్శ్ ఆచూకీ
మురారి మాటలకు భవానీ 'తీసుకొచ్చినంత తేలిక కాదు ఇక్కడ ఉండటం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. వాడు రావడం ఎంత సంతోషంగా ఉందో.. వచ్చాక ఏం జరుతుందోననే టెన్షన్ ఎక్కువగా ఉంది' అంటుంది. కట్ చేస్తే.. కృష్ణ వాళ్ళు మెహతా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే అతడు వచ్చి 'ఆదర్శ్ జాబ్ రిజైన్ చేశాడు. ఆరు నెలలు అవుతుందట' అనగానే వాళ్లు షాక్ అవుతారు. అప్పుడు కృష్ణ 'రిజైన్ చేసి ఎక్కడికి వెళ్లాడు' అని అడుగుతుంది. దీనికాయన 'అక్కడే ఒక పల్లెటూరు ఉంది. ఆదర్శ్ అక్కడే ఉంటున్నట్లు ఉన్నాడు' అని తెలుపుతాడు.
ఆదర్శ్ దగ్గరకు వెళ్లాలి
ఆ తర్వాత మెహతా 'ఆదర్శ్ ఇంతకాలం ఆర్మీకి సేవ చేసినందుకు గాను ఆ ఊర్లో స్థలం ఇచ్చింది. అక్కడే ఉంటున్నాడు. ఆ ఊరు పేరు యూరి. రోడ్డు మార్గం ద్వారా అక్కడికి వెళ్లవచ్చు' అని చెప్తాడు. దీంతో కృష్ణ 'వెంటనే అక్కడికి బయల్దేరదాం. ఇంటికి వెళ్ళి పెద్దత్తయ్యకి విషయం చెప్దాం' అంటుంది. దీనికి మురారి 'టైమ్ వేస్ట్ ఎందుకు కాల్ చేసి చెప్దాం' అంటాడు. మరోవైపు ముకుంద తన అంతరాత్మతో మాట్లాడుతుంది. అప్పుడు ఆమె మురారికి ఇచ్చిన మాట గురించి మాట్లాడగా.. అంతరాత్మ అతడిపై ప్రేమను గుర్తు చేస్తుంది. కానీ ముకుంద ఆ మాట వినదు.
నేను చనిపోయేదాన్ని
కృష్ణ, మురారి కారులో వెళ్తూ ఉండగా ఇంక ఎంత దూరం అంటుంది. అప్పుడామె 'ఆదర్శ్ ఎందుకు ఇలా చేశావ్? అందరికీ చెప్పి వెళ్ళి ఉండవచ్చు కదా. ఆరోజే జరిగింది మొత్తం పెద్దత్తయ్యకి చెప్పి ఉంటే స్పాట్‌లోనే డెసిషన్ తీసుకుని ఉండేది కదా' అంటుంది. తర్వాత మురారిని కారు ఆపమని చెప్పి దిగి అతడిని హగ్ చేసుకుంటుంది. అప్పుడు 'మీరు చెప్పినట్టు పెద్దత్తయ్య అప్పుడే మీకు ముకుందని ఇచ్చి పెళ్లి చేసేది. నేను చచ్చిపోయి ఉండేదాన్ని' అంటుంది. దీంతో ఆమెను ఆపిన మురారి 'ఇది దేవుడు రాసిన రాత దాన్ని ఎవరూ మార్చలేరు' అంటాడు.
మురారికి కృష్ణ హామీ
మురారి మాటలకు కృష్ణ 'ఆదర్శ్ చెప్పకపోవడం నిజంగా చాలా మంచిది. ఆదర్శ్ దేవుడు. ఒకవేళ తను రాను అంటే కన్వీన్స్ చేసే బాధ్యత మీదే' అని కృష్ణ చెప్తుంది. అప్పుడు మురారి 'పెద్దమ్మ రావద్దు డిస్ట్రబ్ అవుతాడు అంటుంది కదా' అనగా.. కృష్ణ 'అత్తయ్యను కన్విన్స్ చేయడం నా వంతు' అని హామీ ఇస్తుంది. అనంతరం ఇద్దరూ ఒక దాబా దగ్గర ఆగుతారు. అప్పుడు మురారి 'మనం హనీమూన్ కి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వెళ్లాలని అనుకున్నాం కదా ఇలా డ్రైవింగ్ చేయడం తన వల్ల కాదు' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











