Krishna Mukunda Murari: మురారికి ఆదర్శ్ షాక్.. నిజం చెప్పేసిన కృష్ణ.. రసవత్తరంగా నేటి ఎపిసోడ్
కొత్త జనరేషన్లు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శనివారం ఏం జరిగిందంటే:ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా కృష్ణ, మురారి వచ్చి ఆదర్శ్ జాడ తెలిసిందని చెప్తారు. దీంతో అందరూ సంతోషించగా.. ముకుంద మాత్రం బాధపడుతుంది. ఆ తర్వాత ఆమె తన అంతరాత్మతో మాట్లాడుతుంది. అనంతరం వాళ్ల మెహతా దగ్గరకు వెళ్లగా.. ఆదర్శ్ జాబ్ మానేశాడని, అతడికి ఓ పల్లెటూరిలో స్థలం ఇవ్వడంతో అక్కడే ఉంటున్నాడని చెప్తాడు. దీంతో మురారి, కృష్ణ అతడి దగ్గరకు వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ వెంటనే కారులో ఆ ఊరు వెళ్లేందుకు ప్రయాణం అవుతారు. ఆ సమయంలో ఇద్దరూ గతాన్ని తలుచుకుని ఎమోషనల్ అవుతూ ఉంటారు.

ఆదర్శ్‌ను చూసిన మురారి:దాబా దగ్గర ఆగిన సమయంలో ఒక కప్‌లోనే టీ తాగుదామని మురారి.. కృష్ణకు కండీషన్ పెడతాడు. 'సగం సగం తాగకూడదు.. కప్ ఫ్రెష్‌గా ఉండాలి కానీ ఇద్దరం తాగాలి' అని అంటాడు. అలా కాసేపు మాటలతో రొమాన్స్ పండించిన తర్వాత మురారి, కృష్ణ ఇద్దరూ మెహతా చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే అతడిని ఆదర్శ్ గురించి అడుగుతారు. ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్లగా.. ఆదర్శ్ కొంత మంది పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఉంటాడు. అక్కడికి మురారి, కృష్ణ వస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆదర్శ్‌ను చూసే సరికి మురారి ఎమోషనల్ అవుతాడు.
ఆదర్శ్‌కు నిజం చెప్పింది:మురారి ముఖం మారడంతో ఆదర్శ్ గుర్తు పట్టుకుండా ఎవరని ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణ తమకు జరిగిన యాక్సిడెంట్, ప్లాస్టిక్ సర్జరీ గురించి నిజాలన్నీ చెబుతుంది. దీంతో ఆదర్శ్.. మురారిని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. వాళ్లనలా చూసి కృష్ణ కూడా సంతోషిస్తుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకున్న తర్వాత కృష్ణను మురారి పరిచయం చేస్తాడు. ఆ సమయంలో 'తను నా భార్య కృష్ణ.. నా ఫ్రెండ్, ఫిలాసఫర్ అన్నింటికంటే తింగరి' అని చెప్తాడు. అప్పుడు ఆదర్శ్ 'అంటే ముకుందను వీడు పెళ్లి చేసుకోలేదా. ఆరోజు తను వీడికి కాల్ చేసింది కదా' అనుకుంటాడు.

ముకుంద వేచి చూస్తుంది:ఆదర్శ్ ఆలోచిస్తుండగా మురారి 'నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం అయింది. అన్ని చెప్తాను కానీ ముందు ఇంటికి బయల్దేరు. అక్కడ అమ్మ ఎదురుచూస్తుంది' అని అంటాడు. కృష్ణ కూడా 'అవును సర్.. మా పెద్దత్తయ్య మీకోసం ఎదురుచూస్తున్నారు' అని చెప్తుంది. దీంతో ఆదర్శ్ నన్ను సార్ అనొద్దు అని కృష్ణతో చెప్తాడు. అప్పుడు కృష్ణ 'నీకోసం అక్కడ పెద్దత్తయ్య మాత్రమే కాదు అందరూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముకుంద' అంటుంది. దీనికి మురారి 'కృష్ణ చెప్పింది నిజమే. ముకుందకు నిన్ను తీసుకొస్తామని చెప్పి వచ్చాం' అంటాడు.
ఆ మాటలే గుర్తు చేసుకుని:మురారి వాళ్ల మాటలకు ఆదర్శ్ 'నిన్ను మరచిపోవడం అంటే అది నేను చచ్చిపోవడమే. ఇక మాట ఇచ్చినంత తేలికగా ఆదర్శ్‌ను భర్తగా యాక్సెప్ట్ చేయలేను. నిన్ను మనసులో పెట్టుకుని తనతో జీవితం పంచుకోలేను. ఆ ఆలోచన వస్తేనే నా ప్రాణం పోతుంది. మురారి ఐలవ్యూ' అని ముకుంద అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు. అప్పుడు మురారి 'ఇప్పుడు అక్కడ పరిస్థితులన్నీ మారాయి. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం లేదు. అన్నీ చక్కదిద్దాక ఇక్కడికి వచ్చాం' అంటాడు. దీంతో చక్కదిద్దడం అంటే ఏంటి అనగా.. ముందు బయల్దేరు అంటాడు.

భర్త చెప్పడంతో వచ్చావు:మురారి మాటలకు ఆదర్శ్ 'నేనేమైనా స్కూల్ పిల్లాడిని అనుకుంటున్నావా? అలిగి ఇంటి నుంచి బయటకి వెళ్తే సర్ది చెప్పి తీసుకుని వెళ్ళడానికి. నేను ఒక కమాండర్‌ను. దేశానికి సర్వీస్ చేసే ఉద్యోగం కూడా వదులుకుని ఇలా అడవిలో పిల్లలకి దేశభక్తిని నేర్పిస్తూ.. ఆ జ్ఞాపకాలను తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నా. మళ్ళీ నన్ను ఆ ఊబిలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయవద్దు. వెంటనే వెళ్లిపోండి' అంటాడు. కృష్ణ సర్ది చెప్పడానికి చూడగా 'నీకు గతం ఎంటో తెలియదు భర్త చెప్పాడు విని నువ్వు తోడు వచ్చావు' అంటాడు.
నిజం చెప్పి షాకిచ్చింది:ఆదర్శ్ మాటలకు కృష్ణ 'నాకు గతం తెలుసు. మీరు అన్నది పొరపాటు.. ఏసీపీ సర్ ఇక్కడికి నన్ను తీసుకురాలేదు. నేనే తనని తీసుకొచ్చాను. గతం అంతా నాకు తెలుసు. గతాన్ని తెలుసుకుని వర్తమానం పాడు చేసుకోకుండా ఉంటే భవిష్యత్ బాగుంటుంది. మనుషుల మధ్య అపార్థాలు సృష్టించేది గతం. దాన్ని మర్చిపోతే కుటుంబాల మధ్య దేశాల మధ్య కూడ అన్ని గొడవలు ఉండవు' అంటుంది. దీనికతడు 'మీరు ఎన్నయినా చెప్పండి. నేను రాను నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది' అనగా.. ముకుంద గురించి ఆలోచించవా అని మురారి ప్రశ్నిస్తాడు.
నీ మనసులో ఉంది అని:మురారి ప్రశ్నకు ఆదర్శ్ 'మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఒంటరిగా కాకుండా పెళ్లి చేసుకుని జంటగా కనిపించి ఉంటే ఏం చేసే వాళ్లు? నాకు నా భార్యకి బట్టలు పెట్టి నోరు మూసుకుని వెళ్లిపోయే వాళ్లు కదా. ఇప్పుడు అదే పని చేయండి' అంటాడు. దీనికి మురారి 'నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నీ ప్రేమ విషయం తెలియకుండా నేను పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడు పడే బాధ కంటే ఇది ఎక్కువా చెప్పు. ఇప్పుడు మీ ఇద్దరికీ పెళ్లి కాలేదు. ఇప్పటికీ నీ మనసులో ముకుంద ఉంది' అంటాడు. కానీ, ఆదర్శ్ లేదని అరుస్తాడు. తర్వాత మురారి, కృష్ణ అతడిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











