Krishna Mukunda Murari: ఒప్పుకున్న ఆదర్శ్‌.. మురారి లవ్ స్టోరీ లీక్ చేసి.. ముకుందపై అతడికి డౌట్

ఈ మధ్య కాలంలో సరికొత్త కాన్సెప్టులతో షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఏం జరిగిందంటే
మురారి, కృష్ణ కలిసి ఆదర్శ్ ఉన్న ప్లేస్‌ను కనుక్కుని అతడి దగ్గరకు వెళ్తారు. కానీ, వీళ్లను అతడు గుర్తు పట్టడు. అప్పుడు కృష్ణ జరిగింది మొత్తం వివరించి చెప్తుంది. దీంతో ఆదర్శ్ ఆప్యాయంగా మురారితో మాట్లాడతాడు. అన్నీ మాట్లాడుకున్న తర్వాత అతడిని ఇంటికి రమ్మని అడుగుతారు. కానీ, ఆదర్శ్ రాను అని చెప్తాడు. అప్పుడు కృష్ణ కూడా ముకుంద అతడి కోసం వేచి చూస్తుందని నిజాలు చెప్తుంది. అయినా ఆదర్శ్ మాత్రం తిరిగి రాలేనని తేల్చి చెబుతాడు. దీంతో ముకుంద మారిపోయిందని, వస్తే చక్కగా ఉండొచ్చని కృష్ణ, మురారి అతడిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు.

Krishna Mukunda Murari Serial Today Episode January 23rd

ఆ మాటలు గుర్తు చేసుకుని
ఆదర్శ్‌ను ఇంటికి తిరిగి తీసుకొచ్చేందుకు కృష్ణ, మురారి సర్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు కృష్ణ 'ఒక్కసారి మీరు ప్రేమించిన, ప్రేమిస్తున్న ముకుంద మొహం చూస్తే మీరు అనుకున్నవి అన్నీ ఎగిరిపోతాయి' అని చెప్తుంది. ఎట్టకేలకు ఆదర్శ్ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు అతడు 'అక్కడ ఏం జరిగినా బాధ్యత నీదే' అనే సరికి భవానీ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. దీంతో ఆదర్శ్ 'ఏంటి మౌనంగా ఉండిపోయారు మీకు కూడా నమ్మకం లేదా' అనగా.. కృష్ణ ఇంట్లో జరిగిన విషయాలు అన్నీ అతడికి చెప్తుంది.

ఇంట్లో వాళ్లంతా టెన్షన్‌గా
ఆదర్శ్‌ను తీసుకొచ్చేందుకు వెళ్లిన కృష్ణ, మురారి గురించి ఇంట్లో వాళ్లు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు మధుకర్ కృష్ణకు కాల్ చేసినా కలవదు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్తాడు. అప్పుడు రేవతి 'ఏ నెంబర్ కలవకపోవడం ఏంటి? వాళ్ళు అక్కడికి చేరుకున్నారో లేదో' అని రేవతి కంగారుపడుతుంది. అప్పుడు భవానీ చివరిగా కృష్ణ ఎప్పుడు ఫోన్ చేసిందని అడుగుతుంది. దీంతో రేవతి రాత్రి తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదని అంటుంది. అప్పుడు ఇంకా కంగారు పడుతూ ఉండగా నందూ ఏం కాదు కృష్ణ వాళ్ళు ఆదర్శ్‌ను తీసుకుని వస్తారు అని ధైర్యం చెబుతుంది.

ఆటపట్టించేసిన ఆదర్శ్
ఇంటికి తిరిగి వెళ్లే ముందు కృష్ణ 'మనసులో ఉన్న వ్యక్తితో కలిసి బతకలేకపోవడం కష్టం అనుకుంటే.. ఆ మనిషి పక్కనే ఉండగా వేరొకరితో కలిసి ఉండటం ఎంత నరకంగా ఉంటుంది. భగవంతుడా ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నావు' మనసులోనే బాధపడుతుంది. అప్పుడు కృష్ణ ఆదర్శ్ బ్యాగ్ సర్దుతూ ఉంటుంది. అంతలోనే అతడు ఒక పెన్సిల్ చూపించి కృష్ణ దీని కథ ఏంటో తెలుసా? అని అడిగేసరికి మురారి టెన్షన్ పడతాడు. దీంతో కృష్ణ ఆ విషయం ఏంటో చెప్పమని ఆదర్శ్‌ను బతిమలాడుతుంది. కానీ, అతడు మాత్రం వాళ్లను ఆటపట్టిస్తూ ఉంటాడు.

మురారి లవ్ స్టోరీ చెప్పి
ఆ తర్వాత ఆదర్శ్ 'మేము 9వ క్లాస్ చదువుకునేటప్పుడు వీడి పక్క బెంచ్‌లో స్వర్ణ అనే అమ్మాయి ఉండేది. వీడికి తను క్రష్' అంటాడు. దీంతో కృష్ణ 'అంటే సర్ అప్పటి నుంచే రొమాంటిక్ అన్నమాట' అని వెటకారంగా అంటుంది. తర్వాత ఆదర్శ్ 'వీడు స్వర్ణ పెన్సిల్ నొక్కేసి నాకు ఇచ్చి దాచేయమని చెప్పాడు. కానీ, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. వీడు ఆ విషయం మర్చిపోయినా నేను మర్చిపోలేదు. నాకు మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండని అనిపిస్తుంది' అంటాడు. దీనికి కృష్ణ 'వస్తాయి మంచి రోజులు తప్పకుండా వస్తాయి' అని అంటుంది.

ప్రేమ పుట్టించాలి అని
ఆదర్శ్‌తో కృష్ణ 'ముకుందకి నువ్వు చెప్పకుండా వెళ్లిపోయినందుకు కోపం ఉంటుంది' అని చెప్తుంది. దీంతో మురారి 'తన కోపం పోగొట్టి దాని స్థానంలో ప్రేమ పుట్టించే బాధ్యత నీదే' అని అంటాడు. అప్పుడామె అప్పటి ముకుంద వేరు ఇప్పటి ముకుంద వేరు అంటుంది. దీంతో ఆదర్శ్ మీరు భ్రమ పడుతున్నారని అనిపిస్తుంది అంటాడు. దీనికి వాళ్లు లేదు మేం భ్రమ పడటం లేదు. నువ్వే ఆ భ్రమ నుంచి బయటకి రా అంటారు. సరే మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నానని ఆదర్శ్ చెప్తాడు. అనంతరం ఆ ఊరి వాళ్లు ఆదర్శ్‌కు గిఫ్ట్‌లు ఇస్తారు.

వాళ్లిద్దరూ సాధించారు
ఎట్టకేలకు కృష్ణకు భవానీ కాల్ కలుస్తుంది. అప్పుడామె వివరాలు అడగ్గా ఆమె అన్నీ చెబుతుంది. మొత్తానికి ఆదర్శ్ ఇంటికి తిరిగి వచ్చేందుకు ఒప్పుకున్నాడని చెబుతుంది. దీంతో కృష్ణ 'ఒప్పుకున్నాడు. ముకుంద మారిందని చెప్తే ఒప్పుకోక ఏం చేస్తాడు. ఎప్పుడెప్పుడు ముకుందను చూస్తానా అని రెక్కలు కట్టుకుని బయల్దేరుతున్నాడు' అని చెప్తుంది. దీంతో భవానీ మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మధు మొత్తానికి ఇద్దరూ కలిసి సాధించారు అంటాడు. తర్వాత ఆదర్శ్ కోసం అంతా ఏర్పాట్లు చేస్తారు. కానీ, ముకుంద మాత్రం టెన్షన్‌గా ఉంటుంది.

ముకుందపై డౌట్‌గానే
ముకుంద ముఖం మాడ్చుకుని ఉండడంతో మధు 'ఆదర్శ్ వస్తున్నాడని అందరూ సంతోషంగా ఉంటే.. ముకుంద ఏంటి ఇలా ఉంది? అంటే తను రావడం ముకుందకి ఇష్టం లేదా' అని అనుకుంటాడు. తర్వాత ముకుంద 'ఆదర్శ్‌కు నేను ఏం సమాధానం చెప్పాలి. మురారిని మరచిపోవడం సాధ్యం కావడం లేదు. ఇదే విషయం ఆదర్శ్‌కు చెప్తే నేను మారిపోయానని అనుకుంటున్న కృష్ణ వాళ్ళు ఏమనుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు' అని అనుకుంటుంది. తర్వాత మధు వచ్చి ఆమెను ప్రశ్నించగా కవర్ చేస్తుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X