Krishna Mukunda Murari: తిరిగి వచ్చేసిన ఆదర్శ్.. ముకుంద మాత్రం అలా.. నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే!
ఇండియాలోని ఎన్నో భాషలతో పోల్చుకుని చూస్తే.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఏం జరిగిందంటే
మురారి, కృష్ణ కలిసి ఆదర్శ్‌ను ఇంటికి తిరిగి వచ్చేందుకు ఒప్పిస్తారు. కానీ, ఇంట్లో వాళ్లకు కృష్ణ వాళ్లు ఫోన్ నెంబర్లు కనెక్ట్ అవకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత భవానీ దేవి చేసిన కాల్ కృష్ణకు కలుస్తుంది. అప్పుడామె ఆదర్శ్ తిరిగి వస్తున్నాడన్న విషయాన్ని చెబుతుంది. దీంతో అందరూ సంతోషిస్తుండగా.. ముకుంద మాత్రం ముభావంగా ఉంటుంది. అది గమనించిన మధుకర్‌కు ఆమెపై డౌట్ వస్తుంది. ఆ తర్వాత ముకుంద దగ్గరకు వెళ్లి సూటిగా ప్రశ్నిస్తాడు. దీనికి ముకుంద కవర్ చేసుకుంటుంది. ఆదర్శ్ ఇంటికొచ్చేందుకు రెడీ అవుతాడు.

నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
కృష్ణ, మురారి కలిసి ఆదర్శ్‌ను కారులో ఇంటికి తీసుకు వస్తారు. చాలా కాలం తర్వాత అతడు వస్తుండడంతో నందినీ వాళ్లు ఇల్లు మొత్తం అందంగా తయారు చేస్తారు. ఆ తర్వాత ఆదర్శ్ ఇంట్లోకి అడుగు పెడుతున్న సమయంలో అతడిపై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతూ ఉంటారు. ఇక, చాలా ఏళ్ల తర్వాత ఆదర్శ్‌ను చూసిన భవానీ దేవి ఎమోషనల్ అయిపోతుంది. వెంటనే అతడిని హత్తుకుని కన్నీరు కారుస్తుంది. ఈ ఎపిసోడ్‌పై పూర్తి సమాచారం కాసేపట్లో అప్‌డేట్ చేస్తాము.



Click it and Unblock the Notifications











