Krishna Mukunda Murari: శోభనం విషయంలో భవానీ ట్విస్ట్.. పంతులుతో ఎందుకు అబద్ధం చెప్పించింది?

భారతదేశంలో ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Krishna Mukunda Murari Serial Today Episode January 27th

శుక్రవారం ఏం జరిగిందంటే: ఆదర్శ్‌ను రిజైన్ ఎందుకు చేశావని భవానీ ప్రశ్నించగా.. రిస్క్ ఎక్కువ చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్‌‌లో వేశారని, అందుకే అలా చేశాడని కృష్ణ చెప్తుంది. అప్పుడామె తల్లి ఉందని గుర్తు లేక అలా చేశాడని అంటుంది. దీంతో ముకుంద గురించి చెప్పడం లేదేంటి అని మురారి వాళ్లు అనుకుంటారు. అప్పుడు ముకుంద కూడా భవానీకి డౌట్ రాకుండా నటించాలని అనుకుంటుంది. తర్వాత ఆదర్శ్, ముకుందకు కూడా శోభనం చేయాలని అనుకుంటారు. వీళ్లు కలిసేలా చేసిన కృష్ణను భవానీ మెచ్చుకుంటుంది. ఇక, ఇంట్లో జరిగిన కథను సినిమాగా తీస్తానని మధు అంటాడు.

చాలెంజ్ చేసేసిన కృష్ణ: కృష్ణ - మురారి, ముకుంద - ఆదర్శ్‌కు శోభనం జరిపించాలని రేవతి అనుకుంటుంది. అప్పుడే వాళ్లు జంటగా రావడంతో నందినీ, మధు నవ్వుతారు. అప్పుడు కృష్ణ ఏమైందని అడగ్గా.. మధు, నందినీ కలిసి ఆమెను ఆటపట్టిస్తారు. మురారి కూడా తింగరి అంటాడు. దీంతో కృష్ణ 'తింగరి తింగరి అని నన్ను ఇంట్లో జోకర్‌ను చేశారు. నేను కూడా ఇక నుంచి పెద్దత్తయ్య లాగా సీరియస్‌గా ఉంటాను' అని ఛాలెంజ్ చేస్తుంది. దీంతో రేవతి రెండు నిమిషాలు కూడా ఉండలేవని అనగా.. లేదు ఖచ్చితంగా ఉంటానని ఆమెను అనుకరిస్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు.

నీలా నువ్వు ఉండు అని: ఆ తర్వాత కృష్ణ వచ్చి భవానీ దేవి కూర్చున్నట్లుగా సోఫాలో సీరియస్‌గా కూర్చుంటుంది. అది గమనించిన భవానీ దేవి ఏమైంది కృష్ణని ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. కానీ, కృష్ణ మాత్రం కదలకుండా అలాగే కూర్చుని ఉంటుంది. అప్పుడు మురారి 'మీలా సీరియస్‌గా రెండు నిమిషాలు ఉండమని చెప్పాం. అందుకే ఇలా బిగుసుకుపోయింది' అని చెప్తాడు. దీనికి భవానీ దేవి 'తింగరి పిల్ల.. నాలా నువ్వు ఉంటావా? ఒకరు మరొకరిలా ఉండటం కష్టం. నీలా నువ్వు ఉండు' అని చెప్తుంది. దీంతో కృష్ణ మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.

ముహూర్తాలు లేవనగానే: కొద్ది సేపటి తర్వాత పంతులు అక్కడకు వస్తాడు. అప్పుడు ముకుంద 'ఇప్పుడు శోభనం కోసం ముహూర్తం పెడుతున్నారా? ఇందుకోసమా రమ్మన్నది' అని అనుకుని టెన్షన్ పడుతుంది. మురారి మాత్రం కృష్ణతో 'మన శోభనానికి ముహూర్తం పెట్టడానికి వచ్చారు. ఈరోజు కావచ్చు రేపు కావచ్చు' అంటాడు. అప్పుడే ఆదర్శ్ ముకుంద వైపు ప్రేమగా చూస్తే.. తను మాత్రం ఇబ్బంది పడుతుంది. అంతలో పంతులు మరో పది పదిహేను రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పడంతో ముకుంద సంతోషిస్తుంది. కానీ, మిగిలిన వాళ్లు మాత్రం సంతోషపడతారు.

Krishna Mukunda Murari Serial Today Episode January 27th

భవానీనే వద్దని చెప్పింది: పంతులు చెప్పిన వెంటనే ముకుంద 'హమ్మయ్య పది రోజులు ఉంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు' అని అనుకుంటుంది. అప్పుడు భవానీ సరే పది రోజుల తర్వాత ముహూర్తం పెట్టమని చెప్తుంది. దీనికి పంతులు 'మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా ఎందుకు భవానీ మేడమ్ ఇప్పుడే ముహూర్తం వద్దని అన్నారెందుకు' అని మనసులో అనుకుంటాడు. తర్వాత ముకుంద ఒంటరిగా 'ఎక్కడ ముహూర్తం పెట్టేస్తారని భయపడ్డాను. పది రోజుల వరకు ముహూర్తాలు లేవని అనేసరికి ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. కానీ పాపం ఆదర్శ్' అనుకుంటుంది.

అలా బతకడం కుదరదు: తర్వాత ముకుంద 'ఆదర్శ్ నా మీద ఎన్నో ఆశలతో వస్తే నిరాశే మిగులుతుంది. నా వల్ల మొన్నటి వరకు మురారి, కృష్ణ సఫర్ అయ్యారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారని అనుకుంటే ఇప్పుడు ఆదర్శ్ అవుతున్నాడు. నేను ఏది కావాలని చేయడం లేదు. నా ఇష్టం వేరొకరికి కష్టంగా మారుతుంటే నేనేం చేయను. మురారిని మర్చిపోయి బతకడం నావల్ల కావడం లేదు. అత్తయ్య నన్ను అనుమానంగానే చూస్తుంది. ఏం చేయాలి అర్థం కావడం లేదు' అనుకుంటాడు. అప్పుడే ఆదర్శ్ ముకుందని చూస్తాడు. ముహూర్తం లేదని డిసప్పాయింట్ అయిందా అనుకుంటాడు.

భర్త పట్టుకోగానే అరిచి: ఆలోచనలో ఉన్న ముకుంద 'ఇంట్లో ఇంత మంది బాధపడుతున్నా నేను మాత్రం నిన్ను ఎందుకు మర్చిపోలేకపోతున్నా. దీని వల్ల ఎదురయ్యే పరిణామాలు తెలిసి కూడా ఎందుకు మారలేకపోతున్నాను. కుటుంబం పరువు పోతుందని తెలిసి కూడా ఎందుకు మర్చిపోలేక పోతున్నాను. ఏముంది మురారి నీలో ఎందుకు నా మనసు నిన్ను వదిలి రానని అంటుంది' అని అనుకుంటూ ఉంటుంది. అంతలో ఆదర్శ్ వచ్చి భుజం మీద చేయి వేస్తాడు. దీంతో భయంతో ముకుంద గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఇంట్లో అందరూ ఒక్కసారిగా బయటకి వచ్చేస్తారు.

అబద్ధం చెప్పడంతోనే: ముకుంద ఎందుకు అరించిందన్న దానిపై చర్చ జరుగుతుంది. అప్పుడు ఆదర్శ్ ఏదో చెప్పబోతుండగా ముకుంద వచ్చి తొండ పడిందని.. అందుకే భయపడి అరిచానని చెప్తుంది. దీంతో అందరికీ డౌట్ మొదలవుతుంది. ఇక, గదిలోకి వెళ్లిన మురారి, కృష్ణలు ముకుంద గురించి మాట్లాడుకుంటారు. ఆమె మారిపోయిందని, ఆదర్శ్ వచ్చిన తర్వాత అతడితో మంచిగా ఉంటుందని అనుకుంటారు. వాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పుకుంటారు. తర్వాత తమ ముచ్చట కూడా చూడమని మురారి అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X