Krishna Mukunda Murari: ఆదర్శ్‌లో మొదలైన అనుమానం.. తొలిసారి భయపడిన భవానీ.. ఈరోజు ఏం జరిగిందంటే!

ఇండియాలో చాలా భాషల్లో వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శనివారం ఏం జరిగిందంటే:ఆదర్శ్ వచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న కృష్ణ.. ఇకపై భవానీ దేవిలా ఉంటానని అంటుంది. అంతేకాదు, ఆమెను ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన భవానీ.. నువ్వు నీ లాగనే ఉండు అని కృష్ణతో అంటుంది. ఆదర్శ్, మురారి జంటలకు శోభనం ముహూర్తం చూడడానికి వచ్చిన పంతులు.. పది రోజుల వరకూ మహూర్తాలు లేవని చెప్తాడు. అతడితో భవానీనే అలా చెప్పిస్తుంది. ఇక, ముకుంద మనసులో ఒకరిని పెట్టుకుని ఆదర్శ్‌తో కలిసి బతకలేనని అనుకుంటుంది. అప్పుడే అతడు వచ్చి చేయి వేయగా అరుస్తుంది. దీంతో అంతా కంగారు పడతారు.

Krishna Mukunda Murari Serial Today Episode January 29th

గుడ్డిగా నమ్మి తీసుకొచ్చింది:ముకుంద డల్‌గా ఉండడంతో భవానీ దేవి ఆమె గురించి ఆలోచిస్తుంది. 'తన ప్రవర్తన చూస్తుంటే అంగీకరించింది అని అసలు నమ్మకం కలగడం లేదు. తన అన్న చేసిన పనులు తనకు తెలియకుండా ఉంటాయా? ముకుంద సపోర్ట్ లేకుండా తన అన్న అంతకి తెగిస్తాడా? అప్పుడే ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకున్నా. కానీ ఈ కృష్ణ అడ్డుపడింది. ఈ కృష్ణ తన అతి మంచితనంతో తన గురించి ఆలోచించడం మానేసింది. తను మారిపోయిందని గుడ్డిగా నమ్మి ఆదర్శ్‌ను తీసుకొచ్చింది. అసలు ఏం చెప్పి వాడిని తీసుకొచ్చింది' అని అనుకుంటుంది.

వేరే పంతుల్ని అడుగుదాం:ఆ తర్వాత భవానీ 'ఒక పక్క బిడ్డ వచ్చాడని సంతోషంగా ఉన్నా.. మరోపక్క ఎక్కడ తన మనసు చంపేస్తుందోనని భయంగా ఉంది. అసలు ముకుంద మనసులో ఏముందో క్లియర్‌గా తెలియడం లేదు' అనుకుంటుంది. అప్పుడే రేవతి వచ్చి వేరే పంతుల్ని పిలిపిద్దామా అని అడగ్గా.. భవానీ ఎందుకు అంటుంది. దీనికామె 'ఫోన్లో రెండు మూడు రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయన్న పంతులు.. ఇప్పుడు పది రోజుల వరకు లేవని అంటున్నారు. సరిగా చూశారో లేదో వేరే పంతుల్ని పిలిచి అడుగుదాం' అంటుంది. దీంతో భవానీ ఇన్ని రోజులు ఆగాం కదా అంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode January 29th

సంతోషం కనిపించట్లేదని:భవానీ మాటలకు రేవతి 'ఆదర్శ్ వచ్చినప్పుడు మీ మొహంలో సంతోషం చూశాను. కానీ పంతులు ఎప్పుడైతే ముహూర్తాలు లేవని చెప్పాడో.. అప్పుడు సంతోషం తగ్గింది' అంటుంది. అప్పుడు భవానీ 'పంతులికి ముహూర్తాలు లేవని చెప్పమని చెప్పింది నేనే. అది నా సంతోషాన్ని ప్రభావితం చేస్తుంది. ఆదర్శ్‌ను తీసుకొస్తానని అంటే ముకుంద ఎందుకు ఒప్పుకుందో తెలియదు. తన మనసులో ఏముందో తెలియదు. అవన్నీ బయట పడాలంటే కొంచెం టైమ్ అవసరమని అలా చేశాను' అని మనసులో అనుకుంటుంది. కానీ, రేవతి వాళ్లు హ్యాపీగా ఉన్నారని చెబుతుంది.

ఆదర్శ్ వచ్చి ఉంటే కరెక్ట్:అనంతరం కృష్ణ, మురారి కలిసి ఆదర్శ్‌ను తీసుకురావడం కరెక్టే అంటావా అని రేవతిని భవానీ అడుగుతుంది. దీనికామె 'ఆదర్శ్ రావడం వల్లే కదా మనం సంతోషంగా ఉన్నాం లేదంటే ముకుంద, వాడు చెరొక చోట ఉండి బాధపడుతూ ఉంటారు. కృష్ణ వాళ్ళు ఒకే చోట ఉండి కూడా దూరంగా ఉండే వాళ్ళు. అయినా మీకెందుకు ఈ అనుమానం వచ్చింది' అని అడుగుతుంది. దీంతో భవానీ 'అనుమానం ఏమి కాదు.. కృష్ణ వాళ్ళు తీసుకురాకుండా ఆదర్శ్ స్వయంగా తనంతట తనే వచ్చి ఉంటే బాగుండేది' అనగా.. వీళ్ల ద్వారానే ఆదర్శ్‌కు తెలిసిందని రేవతి చెప్తుంది.

Krishna Mukunda Murari Serial Today Episode January 29th

ఆదర్శ్‌లో మొదలైన డౌట్:భవానీ మాటలు విన్న రేవతి 'ముకుంద మారినట్టు అక్క నమ్మడం లేదు. మళ్ళీ ఏం జరుగుతుందోనని భయపడుతున్నట్టు ఉంది' అనుకుంటుంది. అప్పుడు భవానీ 'నిజంగా నాకు భయమేస్తుంది రేవతి. పొరపాటున ముకుంద.. ఆదర్శ్‌ను అంగీకరించకపోతే నా బిడ్డ ఏమైపోతాడా అని భయంగా ఉంది' అంటుంది. మరోవైపు ఆదర్శ్ కూడా ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 'ముకుంద నిజంగానే భయపడి అరిచిందా? లేదంటే నేను తాకడం ఇష్టం లేక అరిచిందా? లేదంటే అప్పుడు నేను చెప్పకుండా వెళ్లానని కోపంగా ఉందా' అనుకుంటాడు.

ఎలాగైనా నిజం చెప్పించి:ఆ తర్వాత ఆదర్శ్ 'కోపం ఉంటే నన్ను తీసుకుని రమ్మని మురారి వాళ్లకు ఎందుకు చెప్తుంది? నేను అంటే ఇష్టం ఉండబట్టే కదా నన్ను పిలిపించింది. ఆ విషయంలో డౌట్ అక్కర్లేదు' అనుకుంటాడు. అప్పుడు మధు అతడిని చూసి 'అసలు ముకుంద బ్రోని అంగీకరించిందా? అసలు నిజంగా తొండ పడిందా లేదంటే ఏదైనా ఉందా? ఇందాక బ్రో కూడా ముకుంద మాట చెప్పాడు కదా ఇప్పుడు తనతో ఎలాగైనా నిజం చెప్పించాలి. మందు వేస్తే ఎలాగైనా నిజం బయటకి వచ్చేస్తుంది' అని ప్లాన్ చేస్తాడు. తర్వాత మందు తాగుదామని ఆదర్శ్‌ను తీసుకెళ్తాడు.

మురారి కూడా తాగాలని:మురారి 'ముకుంద నన్ను మర్చిపోయి ఆదర్శ్‌ను అంగీకరించింది. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అందుకే కలిసి మందు తాగుదాం రమ్మని పిలిచాడు. దీనికి కారణం కృష్ణ. తన సంతోషం కంటే వాళ్ళ సంతోషం కోసం ఆరాటపడింది. ఇక తను ఏం చెప్తే అదే చేస్తా' అని మనసులో అనుకుంటాడు. తర్వాత ఆమెకు మస్కా కొట్టి మందు తాగాలని అనుకుంటాడు. అంతలో కృష్ణ మందు తాగుదామని అనుకుంటున్నారు కదా అని అడిగి షాకిస్తుంది. తర్వాత మధు వాళ్లు అందరూ కలిసి తాగుతుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X