Krishna Mukunda Murari: బయటపడ్డ ముకుంద నిజస్వరూపం.. ఆమె ప్లాన్ వర్కౌట్.. మరింత రంజుగా నేటి ఎపిసోడ్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఏం జరిగిందంటే:ఆదర్శ్ వచ్చిన తర్వాత ముకుంద తీరును గమనించిన భవానీ దేవికి ఆమెపై అనుమానం మొదలవుతుంది. అంతలో రేవతి వచ్చి మరో పంతులును పిలిచి శోభనాలకు ముహూర్తం పెట్టిద్దాం అంటుంది. ఆ సమయంలో భవానీ దేవి తన అనుమానాలను రేవతి ముందు ఉంచుతుంది. మరోవైపు, ఆదర్శ్‌కు కూడా ముకుంద తీరుపై డౌట్ వస్తుంది. కానీ, తను నిజంగానే మారిందని అతడు నమ్ముతాడు. అయితే, ముకుంద ఎందుకు అరిచిందో తెలుసుకునేందుకు ఆదర్శ్‌తో మందు తాగించాలని మధు అనుకుంటాడు. అప్పుడు మురారి కూడా వాళ్లతో కలుస్తానంటాడు.

ఎలాగైనా బయటపెట్టాలని:ఆదర్శ్‌తో పాటు అందరూ మందు తాగేందుకు కూర్చుంటారు. అప్పుడు ప్రసాద్ ఓవర్ యాక్షన్ చేయగా.. భార్య వచ్చి తిడుతుంది. దీంతో అతడు ఫీల్ అవుతాడు. ఆ సమయంలోనే ముకుంద.. ఆదర్శ్ కోసం వెతుకుతూ 'ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడతాడో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి' అనుకుంటుంది. మధు మాత్రం ఎలాగైనా తొండ టాపిక్ బయట పెట్టించాలని 'మార్నింగ్ మనం డిస్కస్ చేస్తుంటే అమ్మ వచ్చి డిస్ట్రబ్ చేసింది కదా. మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందామా' అని ఆదర్శ్‌ను అడుగుతాడు. అప్పుడే ముకుంద బయటకి వచ్చి వాళ్లను చూస్తుంది.
మధు డౌట్ పడడంతోనే:మధు మాటలకు మురారి అంత సీరియస్ మేటర్ ఏంటి అనగా తొండ టాపిక్ అంటాడు. దీంతో పక్కనే ఉండి చూస్తున్న ముకుంద 'ఏదైతే జరగకూడదని భయపడుతున్నానో అదే జరుగుతుంది. మధుకి అనుమానం వచ్చింది. తాగిన మత్తులో ఆదర్శ్ నిజం చెప్పేస్తాడేమో' అని టెన్షన్ పడుతుంది. అప్పుడు మధు 'తొండ పడితే ఉలిక్కిపడి పక్కకి జరుగుతారు కానీ.. భూమి బద్ధలైనట్టు ఎందుకు అరుస్తారు' అంటాడు. దీనికి మురారి అవును కరెక్టే అంటాడు. దీనికి ఆదర్శ్ 'నాకొక విషయం అర్థమైంది. అక్కడ ఏదో జరిగిందని మీ అనుమానం కదా' అంటాడు.
కృష్ణకు చెప్పిన ముకుంద:ఆదర్శ్ వాళ్లు నిజం చెప్పేలా ఉన్నాడని గ్రహించిన ముకుంద వెంటనే కృష్ణను తీసుకొచ్చి అది ఆపించాలని వస్తుంది. వెంటనే మురారి, ఆదర్శ్ అంతా కలిసి మందు కొడుతున్నారని చెప్తుంది. అప్పుడామె 'అంతేనా.. వాళ్ళు తాగుతున్న విషయం ముందే నాకు చెప్పారు' అని లైట్ తీసుకుంటుంది. దీంతో ముకుంద 'అంటే ఏంటి కృష్ణ.. మా ఆయనను చెడగొట్టమని మీ ఆయనను పంపించావా' అని సీరియస్ అవుతుంది. దీంతో కృష్ణ 'ఆదర్శ్‌కు మందు అలవాటు ఉంది కదా. మిలటరీలో రోజు తాగుతారు' అంటుంది. అప్పుడు ముకుంద ఇక్కడ తాగొద్దు అంటుంది.

నమ్మించేసిన ముకుంద:ఆ తర్వాత ముకుంద 'అత్తయ్య చూస్తే మేం సరిగా లేము అందుకే తాగుతున్నాడని అనుకుంటుంది' అంటుంది. దీంతో కృష్ణ ఆమె మాటలు నమ్మి మందు తాగకుండా ఆపడానికి వెళ్తుంది. వెళ్లగానే ముకుంద 'తాగింది చాలు అందరూ లేవండి' అని సీరియస్‌గా చెప్పడంతో ఆదర్శ్ లేస్తాడు. అప్పుడామె 'నా మీద తొండ పడలేదని మధుకి గట్టిగా అనుమానం వచ్చింది. టైమ్‌కు వెళ్లాను కాబట్టి సరిపోయింది. లేదంటే మేము ఎలా ఉంటున్నామో తెలిసిపోయేది. అయినా తెలిస్తే ఏమౌతుంది. వామ్మో ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి' అని తనలో తాను అనుకుంటుంది.
మీ విలువ పోగొట్టుకోవద్దు:అనంతరం ముకుంద 'కృష్ణ, మురారి నామీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని ఒమ్ము చేసినట్టు అవుతుంది కదా. నా మనసులో ఏముందో తెలిస్తే ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తారు. అప్పుడు మురారికి శాశ్వతంగా దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి బయట పడకూడదు' అనుకుంటుంది. తర్వాత ఆదర్శ్ తాగిన మైకంలో పడబోతుంటే ముకుంద పట్టుకుంటుంది. కాసేపు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు ఆదర్శ్ 'కాసేపు సరదాగా సిట్టింగ్ వేశాం' అంటాడు. దీంతో మీ విలువ పోగొట్టుకోవద్దనే అలా చేశా అని ఆమె చెప్పగా ఆదర్శ్ నమ్మేస్తాడు.
ముకుందకు అనుమానం:భోజనం చేయడానికి రమ్మని మధు పిలుస్తాడు. దీంతో ఆదర్శ్ ఒకవైపు, మురారి మరోవైపు ఊగుతూ వస్తుంటారు. వాళ్లను కవర్ చేసేందుకు భార్యలు ప్రయత్నిస్తారు. అప్పుడే అటుగా భవాని వస్తుండడంతో ఆమెను చూసిన ముకుంద 'అత్తయ్య చూపుల్లో అదే అనుమానం.. అదే కోపం. ఎందుకు ఇంకా నా మీద అనుమానం? ఎందుకు నన్ను నమ్మడం లేదు? దేవ్ మీద కోపం నామీద చూపిస్తుందా? ఎటు తేల్చుకోలేకపోతున్నా' అనుకుంటుంది. ముకుంద డల్‌గా ఉండటం చూసి కృష్ణ ఏం ఆలోచిస్తున్నావని అనగా నందినీ హనీమూన్ గురించి మాట్లాడుతుంది.

మురారి కోసమే ముకుంద:తర్వాత ముకుంద 'అత్తయ్యకు అనుమానం రాకుండా నటించాలి. కానీ ఇలా నటించడం మోసం చేస్తున్నట్టు అవుతుంది. నా వల్ల కావడం లేదు' అనుకుంటుంది. అప్పుడు నందినీ 'మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు అనిపిస్తుంది' అంటుంది. భవానీ మాత్రం ముకుంద వైపు అనుమానంగా చూస్తుంది. ముకుంద మాత్రం నవ్వుతూనే లోపల 'ముకుంద మేడ్ ఫర్ మురారి' అనుకుంటుంది. తర్వాత ఆదర్శ్.. ముకుందను పొగడ్తలతో ముంచేస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











