Krishna Mukunda Murari: బెడ్‌పై కనిపించని ముకుంద.. నిజాలతో నిలదీసిన ఆదర్శ్.. అలా చెప్పడంతో షాక్
చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఏం జరిగిందంటే:నిజం చెప్పించాలని మధు ప్లాన్ చేసినట్లుగానే అందరూ మందు తాగేందుకు రెడీ అవుతారు. అప్పుడు మధు తొండ పడితే ఎందుకు అంతలా అరిచింది అని డౌట్ పడతాడు. అప్పుడు అందరూ అదే అంటారు. దీంతో ఆదర్శ్ నిజం చెప్పబోతాడు. అప్పుడు కంగారు పడిన ముకుంద వెంటనే కృష్ణ దగ్గరకు వెళ్తుంది. అప్పుడామెను నమ్మించేలా మాట్లాడి వాళ్లు మందు తాగడం ఆపాలని చెప్తుంది. దీంతో కృష్ణ, ముకుంద వచ్చి వాళ్లను తాగొద్దని అంటారు. దీంతో ఆదర్శ్ నిజం చెప్పడు. తర్వాత ముకుంద తన మనసులో మురారినే ఉన్నాడని అసలు విషయం బయటపెడుతుంది.

ఇష్టం, లవ్ గురించి చెప్పాలా:మందు తాగి ఉన్న ఆదర్శ్ తన భార్య ముకుంద గురించి పొగుడుతూ మాట్లాడతాడు. తర్వాత మురారి కూడా అలాగే కృష్ణ గురించి చెప్తుంటాడు. అప్పుడు ముకుంద 'ఒకరి మీద ఇష్టం ప్రేమ ఉన్నాయని ప్రత్యేకించి చెప్పాలా? వాళ్ళ ప్రవర్తన, వాళ్లకి ఇచ్చే విలువ బట్టి తెలిసిపోదా? తెలిసిపోతుంది కదా మళ్ళీ చెప్పుకోవడం అవసరమా' అని మురారితో అంటుంది. అప్పుడు సుమలత నిజమే కదా అని అనడంతో మధుకర్ వాళ్లు ఇరుక్కుంటారు. అప్పుడు రేవతి 'వీళ్ళు ఇంత బాగున్నారు కదా. మరి ఆదర్శ్ రావడం కరెక్టేనా అని అక్క ఎందుకు అడిగింది' అని ఆలోచిస్తుంది.
నువ్వు సూపర్ కృష్ణ అంటూ:మురారి చాప మీద పడుకుందామని అనుకుంటుండగా కృష్ణ వద్దని బెడ్ మీద పడుకోమంటుంది. దీంతో శోభనం అయ్యే వరకూ కిందే పడుకుంటా అంటాడు. కానీ, కృష్ణ మాత్రం ఒప్పుకోకుండా బెడ్ మీదనే పడుకోమంటుంది. అప్పుడు మురారి 'నీ సంతోషం చూసుకోకుండా ముకుంద సంతోషం చూశావు నువ్వు సూపర్. ఇంట్లో అందరూ ఎన్ని మాటలు అన్నారు కానీ.. అవేమీ పట్టించుకోకుండా నన్ను కాపాడుతూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఇంటిని చక్కదిద్దావు. ఇంట్లో అందరూ వద్దని అంటున్నా ఆదర్శ్‌ను తీసుకొచ్చావ్ హ్యాట్సాప్' అని మెచ్చుకుంటాడు.
మీ సపోర్ట్ లేకుంటే కష్టమే:ఆ తర్వాత మురారి 'చాలా రోజుల తర్వాత పెద్దమ్మ కళ్లలో ఆనందం చూశాను. అంతా నీ వల్లే నీకు ఈ కుటుంబం రుణపడి ఉంటుంది' అంటూ పొగడ్తలతో ముంచెత్తుతాడు. దీనికి కృష్ణ 'మీ సపోర్ట్ లేకపోతే అవుట్ హౌస్‌లో ఉండగలిగేదాన్నా? ఎప్పుడో బయటకి పంపించేవాళ్లు. మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు' అని భర్తను మెచ్చుకుంటుంది. తర్వాత మురారి వద్దని చెప్తున్నా కూడా కృష్ణ మాత్రం బెడ్ మీద పడుకోవాలని చెప్తుంది. ఇన్నాళ్లూ జరగనిది ఇప్పుడేం జరగదని అంటుంది. దీంతో మురారి కూడా బెడ్ మీద ఆమె పక్కనే నిద్రపోతాడు.

ఇష్టమేనా? నటించావా?:ఉదయాన్నే నిద్ర లేచిన ఆదర్శ్‌కు ముకుంద కనిపించదు. పైగా తను పక్కన వేరే బెడ్ మీద పడుకున్నట్లు అర్థం అవుతుంది. దీంతో అతడు 'అంటే ముకుంద కింద నిద్రపోయిందా? ఎందుకు నా పక్కన పడుకోలేదు? రాత్రి వరకు బాగానే ఉంది కదా. ఇంతలోనే ఏమైంది? అసలు ముకుంద మనసులో నేను ఉన్నానా లేదా' అనుకుంటాడు. అప్పుడే ముకుంద రావడంతో 'నిజంగానే నా మీద నీకు ఇష్టం ఉందా? మనస్పూర్తిగానే నన్ను ఇక్కడికి రప్పించావా? లేదంటే నన్ను ఇక్కడికి రప్పించడం కోసం ఇష్టం లేకపోయినా ఉన్నట్టు నటించావా' అని సూటిగా ప్రశ్నిస్తాడు.
అనుమానం పెట్టొద్దంటూ:ఆదర్శ్ మాటలకు ముకుంద 'నేను మీతో బాగానే ఉంటున్నాను కదా ఎందుకు అనుమానం వచ్చింది' అని అడుగుతుంది. దీంతో అతడు చాప చూపించి 'మంచం ఉండగా నేల మీద పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది' అని నిలదీస్తాడు. దీనికామె 'ఇదా మీ అనుమానం ఇంకా మన శోభనం జరగలేదు కదా. అప్పటి వరకు ఒకే మంచం మీద పడుకుంటే అరిష్టం అన్నారని నేను కింద పడుకున్నా' అని చెప్తుంది. దీనికి ఆదర్శ్ నిన్నా, మొన్న లేని అరిష్టం ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతాడు. దీంతో అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది.
కృష్ణ వాళ్లను అడుగుదాం:ఆదర్శ్‌తో ముకుంద 'నేను అప్పుడు కూడా కిందే పడుకున్నా. అనవసరంగా ఏడేదో ఊహించుకోవద్దు. నా మీద అసలు అనుమానం పెట్టుకోవద్దు' అని చెప్తుంది. దీనికతడు 'నా మీద నీకు ప్రేమ లేదని తెలిసి వెళ్ళిపోయిన వాడిని. వచ్చాక కూడా నాతో నువ్వు నాకు దూరంగా ఉంటే అదే అభిప్రాయం ఉంటుంది కదా' అంటాడు. దీంతో ముకుంద 'అయితే మీ అభిప్రాయం మార్చుకోండి దూరంగా ఉండేది ప్రేమ లేక కాదు' అంటుంది. కానీ, మనసులో మాత్రం సారి చెప్తుంది. అప్పుడు ఆదర్శ్ నిజంగానే అరిస్టమేనా అన్నది కృష్ణ వాళ్లను అడుగుదాం అంటాడు.

ముకుంద దూరంగానే:ఆదర్శ్ మాటకు ముకుంద 'వాళ్ల పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు. వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి అవ్వచ్చు. దూరం అవుతారనే భయం లేదు. కానీ, మన పరిస్థితి అలా కాదు. మీరు వస్తారో లేదో తెలియదు. వచ్చినా నమ్ముతారో లేదో తెలియదు. అందుకే ప్రతి సంప్రదాయం ఫాలో అవ్వాలని చూస్తున్నాను. అందులో ఇదొకటి అత్తయ్య ముహూర్తం పెడతారు కదా అప్పటి వరకు ఓపిక పట్టండి. మీరంటే ఇష్టం ఉందో లేదో మీకే తెలుస్తుంది' అని అంటుంది. కానీ, మనసులో మాత్రం వేరేగా అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











