Krishna Mukunda Murari: ఉంగరం చూసేసిన కృష్ణ.. పెళ్లిపై తేల్చేసిన భవానీ.. కథలో ఊహించని ట్విస్ట్
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఏం జరిగిందంటే
శ్రీధర్‌ను ఎవరు చంపి ఉంటారని కృష్ణ ఆలోచిస్తూ దేవ్ మీద సందేహం వ్యక్తం చేస్తుంది. దీంతో మురారి ఆమెకు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఆ తర్వాత ముకుంద వచ్చి పెళ్లి విషయంలో భవానీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రేవతి అడ్డుపడగా.. ఆమెకు భవానీ కౌంటర్లు ఇస్తుంది. ఇక, మురారి, ముకుంద పెళ్లికి ఏర్పాట్లు చేస్తుండడంతో శకుంతల కృష్ణ, మురారిని తీసుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. కానీ, కృష్ణ మాత్రం ఆమెతో వెళ్లేందుకు ఇష్టపడదు. అంతేకాదు, దోషిని బయట పెట్టి మురారి సార్‌ను పెళ్లి చేసుకుంటాను అని అందరినీ తేల్చి చెప్పేస్తుంది.

ఆలోచనలో పడిన భవానీ
ఎలాగైనా మురారితోనే తన పెళ్లి జరుగుతుందని కృష్ణ అన్న మాటలను విన్న వెంటనే భవానీ దేవి కోపంలో తన గదిలోకి వెళ్లిపోతుంది. అంతేకాదు, 'నేను ప్రభాకర్ ఇదంతా చేశాడని నమ్ముతాను. కానీ చూస్తుంటే నేను ఒక్కదాన్నే ఈ విషయం నమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? కృష్ణ వైపు ఎటువంటి భయం కానీ, టెన్షన్ కానీ కనిపించడం లేదు. మరి అది పైకి కనిపించే గంభీర్యమా? భయపడుతున్న ఛాయలు కృష్ణలో కానీ, కృష్ణ దూరమవుతుందన్న భయం మురారిలో కనిపించడం లేదు ఎందుకు' అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఏడుస్తూ వెళ్లిపోయిందిగా
ఆ తర్వాత భవానీ దేవి 'నేనేమైనా అనవసరంగా ఆవేశపడుతున్నానా? నేను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానా? కాదు.. నేను ఏ తప్పు చేయడం లేదు' అని అనుకుంటుంది. అనంతరం శకుంతల.. భవానీ దగ్గరకు వస్తుంది. కృష్ణ, మురారికి పెళ్లి చేయమని ప్రాధేయపడుతుంది. అంతేకాదు, మీ కాళ్ళు మొక్కుతా అని శకుంతల ఏడుస్తుంది. దీంతో భవానీ 'నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు. నేను ఏం చెప్తానో నీకు తెలుసు. దయచేసి వదిలేయ్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో' అని అనగానే శకుంతల ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

ఇందుకైనా పెళ్లి చేసుకో
ఔట్ హౌస్‌లో ఉన్న కృష్ణ దగ్గరకు వచ్చిన మురారి తలనొప్పిగా ఉందంటే మసాజ్ చేస్తుంది. అప్పుడతను 'ఎంత బాగా తలపడుతున్నావో. దీనికోసమైనా కేసు త్వరగా క్లోజ్ చేయాలి' అని అంటాడు. దీంతో కృష్ణ కోపంగా అంతేనా దీని కోసమేనా అంటుంది. దీనికి మురారి కాదు దగ్గరకి రమ్మని చెప్పి చెవిలో ఏదో చెప్తాడు. అది విని కృష్ణ తెగ సిగ్గుపడిపోతుంది. తర్వాత శకుంతల ఇంటికి వచ్చి నవ్వుతూ ఉన్న కృష్ణ, మురారిలని చూస్తుంది. అప్పుడు మురారి ఆమెను గమనించి ఏం జరిగిందో ఊహిస్తాడు. అంతేకాదు, అంతా అనుకున్నట్లే జరుగుతుందని ధైర్యం చెప్తాడు.
దేవ్ ఉంగరం చూసి డౌట్
శకుంతలను చూసి కృష్ణ కూడా బాధ పడుతుంది. అప్పుడు మురారి.. శ్రీధర్ ముఖం మీద ఉన్న రింగ్ గుర్తు ఒక్కటే సమస్యకు పరిష్కారం ఇస్తుంది అని అంటాడు. అనంతరం ముకుంద.. దేవ్ చేతిలో ఉంగరం చూసి కొత్తగా అని అడుగుతుంది. దీంతో 'అవును ముంబయ్‌లోని నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చింది. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ నాతో జీవితం ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేరు' అని చెప్తాడు. తర్వాత అందరూ తినేందుకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కృష్ణ తింటూ దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూసి అతడిపై డౌట్ పడుతుంది.
ఔట్ హౌస్‌లోనే నలుగు
అందరూ భోజనం చేస్తున్న సమయంలోనే రేపు ముకుంద, మురారికి నలుగు పెడుతున్నామని భవానీ చెబుతుంది. దీంతో కృష్ణ బాధపడగా.. ముకుంద సంతోషపడుతుంది. అప్పుడు దేవ్ 'మేడమ్ ఒక్కసారి ఆలోచించండి. నా చెల్లి పెళ్లి అవుతుందని మీరు సంతోషిస్తున్నారు. కానీ నా చెల్లి కృష్ణ జీవితం ఏమవుతుందోనని బెంగతో నాకు భోజనం కూడా సహించడం లేదు' అని చెప్తాడు. దీంతో భవానీ 'కృష్ణ నీ చెల్లి అన్నావ్ కదా. నా సమస్యకు సొల్యూషన్ దొరికింది. రేపు ముకుందకి నలుగు నీ రెండో చెల్లి ఇంట్లో అదే ఔట్ హౌస్‌లోనే' అని చెప్పి షాక్ ఇస్తుంది.
పెళ్లి ఆగాలంటే మార్గం
భవానీ చెప్పినది విని అన్నంలోనే చేయి కడిగేసుకుని వెళ్లిపోతుంది. తర్వాత మురారి కూడా వెళ్లిపోతాడు. మరోవైపు, శకుంతల.. కృష్ణ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. బాధగా ఇంటికి వచ్చిన కృష్ణను రేపు నలుగు పెడుతున్నారా అని శకుంతల అడుగుతుంది. కృష్ణ.. భవానీ మాటలు తలుచుకుని ఏడుస్తుంది. 'ఎప్పుడూ లేనిది ఎందుకు ఇంత భయపడుతున్నాను. రేపు నలుగు, ఎల్లుండి పెళ్లి. ఈ పెళ్లి ఆగాలి అంటే ఆ ఉంగరం వాడైన దొరకాలి, లేదంటే పెద్దత్తయ్య మనసు అయినా మార్చుకోవాలి. లేదంటే ఆదర్శ్ అయినా తిరిగి రావాలి. ఈ మూడింటిలో ఉంగరం వాడు దొరకడమే సాధ్యం' అనుకుంటుంది.
కేసు ప్రోగ్రెస్‌లోనే ఉంది
మురారి రాగానే కృష్ణ భయపడుతూ తన చేతిని పట్టుకుంటుంది. అప్పుడు 'భయంగా ఉంది ఏదో కొత్త ఫీలింగ్ నా మనసుకి సమాధానం చెప్పలేకపోతున్నాను' అంటుంది. దీనికి మురారి 'బాధపడకు కృష్ణ ఎందుకు భయం నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్తాడు. డిపార్ట్‌మెంట్ వాళ్లకు ఫోన్ చేశాను. కేసు ప్రోగ్రెస్‌లోనే ఉంది' అని అంటాడు. దీంతో కృష్ణ 'నువ్వు లేకపోతే నేను ఉండలేను. అయినా అది జరగదు. నీతోనే నేను అనే ధైర్యంతో ఉంటున్నాను. ఎప్పటికీ మీరే నా మొగుడు' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











